బంగారం ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. నిన్న తగ్గిన బంగారం ధర ఈరోజు కూడా పరుగులు పెట్టింది.పైకి దూసుకుపోయింది. పసిడి కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బంగారం ధర పరుగులు పెడితే.. వెండి రేటు మాత్రం నిలకడగానే సాగుతుంది. సిల్వర్ ధరలో ఈరోజు కూడా ఎలాంటి మార్పు కనపడలేదు.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.410 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 50,460కు చేరుకుంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో వెళ్ళింది. రూ.350 పైకి పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 46,250కు చేరుకుంది. బంగారం ధరలు పెరిగితే.. వెండి రేటు మాత్రం నిలకడగానే ఉంది. వెండి రేటులో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో కేజీ వెండి ధర రూ.70,000 ఉంది. వెండి ధర స్థిరంగా ఉండటం ఇది వరుసగా రెండో రోజు అవ్వడం గమనార్హం.