Golden Globe Awards : 80వ గోల్డెన్ గ్లోబ్స్ హాలీవుడ్ అవార్డుల సీజన్‌ను లాస్ ఏంజిల్స్‌లో హాస్యనటుడు జెరోడ్ కార్మిచెల్ హోస్ట్ చేసి వేడుకను ప్రారంభించారు . రాజమౌళి దర్శకత్వం వహించిన , నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకుంది. Jr ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటించిన ఆర్ ఆర్ ఆర్ హాలీవుడ్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన వాటిలో గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రం.
ఈ అవార్డు ల వేడుకకు హాజరు అయిన టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ , డైనమిక్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, కీరవాణి గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ 2023 రెడ్ కార్పెట్ ను స్టైలిష్ గా మార్చారు . రామ్ చరణ్ తన ఇన్‌స్టా కుటుంబానికి లాస్ ఏంజెల్స్ లో ఆర్ఆర్ఆర్ ఫ్యామిలీ దిగిన సంతోషకరమైన చిత్రాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నల్లటి టక్స్లో అందంగా కనిపించగా, రాజమౌళి ,రామ్ చరణ్ కీరవాణి లు నల్లటి సంప్రదాయ డ్రెస్సింగ్ లో చూడవచ్చు.
ఇక ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి రామ్ భార్య ఉపాసన కామినేని , రాజమౌళి భార్య రమా కూడా ఉన్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ, నటుడు దానికి “#RRR కుటుంబం! గోల్డెన్ గ్లోబ్స్ మార్గంలో” అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పిక్ లో తమ ఫేవరెట్ స్టార్స్ ఫ్యామిలీతో సహా ట్రెడిషనల్ లుక్ లో కనిపించడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన, ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు పాట బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అనే రెండు విభాగాలకు ఎంపికైంది. ఈ అవార్డు వేడుకకు ముందు, లాస్ ఏంజిల్స్‌లోని ప్రసిద్ధ చైనీస్ థియేటర్లో RRR నిర్మాతలు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. మంగళవారం తెల్లవారుజామున, ఆర్ ఆర్ ఆర్ స్టార్లు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు రావడం తో ఒకే థియేటర్ వద్ద అభిమానులు గుంపులుగా ఉన్న వీడియో కూడా వైరల్ అయ్యింది.
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో , డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రంలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరన్ కూడా కీలక పాత్రల్లో నటించినఆర్ ఆర్ ఆర్ అనేక ఆస్కార్ విభాగాలలో పరిశీలనకు సమర్పించబడింది. ఈ మూవీ అవార్డులకు అర్హత పొందిన 301 చిత్రాల జాబితాలో ఉంది. జనవరి 24న ఆస్కార్లకు నామినేషన్లకు అనౌన్సమెంట్ ఇచ్చారు.
Advertisement