బిగ్ బాస్ సీజన్ 6 ప్రస్తుతం నడుస్తుంది. షో చివరిదశకి వచ్చేసింది. హౌస్ లో ఉన్న కంటిస్టెంట్ మధ్య పోటీ గట్టిగానే ఉంది. అందరికి ఫ్యాన్ బేస్ ఉండటంతో ఓటింగ్ కూడా గట్టిగానే జరుగుతుంది. ఇక అందరూ ఫైనల్ కి వెళ్తామని ఆశతో ఉన్నారు. ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి భట్, రోహిత్, రేవంత్,శ్రీ సత్య టాప్ లో ఉన్నారు. వీరిలో రేవంత్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మెజారిటీ ఆడియన్స్ భావిస్తున్నారు. అయితే ఆదిరెడ్డికి కూడా ఛాయస్ ఉందనే మాట వినిపిస్తుంది. అలాగే శ్రీహాన్ పేరు కూడా వినిపిస్తుంది. కీర్తి, శ్రీసత్య టాప్ 5లోకి వచ్చిన ఫైనలిస్టులో మాత్రం ఉండే అవకాశం లేదనే మాట వినిపిస్తుంది. అయితే ఎవరికివారు మాత్రం కచ్చితంగా తాము ఫైనలిస్ట్ అయ్యి బిగ్ బాస్ విన్నర్ అనిపించుకోవాలని భావిస్తున్నారు.
ఇక రేవంత్ ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ కావడం పక్కా అనే మాట వినిపిస్తుంది. అతనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కచ్చితంగా అతన్ని టాపర్ ని చేస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఫైనల్ కి వచ్చేసరికి ఫేమ్ కంటే ఇన్ని రోజులు హౌస్ లో ఎవరు తమ ఆటతో, మాటతో మెప్పించారు అనే విషయాన్ని ఓటింగ్ లో పరిగణంలోకి తీసుకుంటారనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరనే విషయాన్ని గూగుల్ లో శోధించే ప్రయత్నం చేస్తే ఎవరూ ఊహించని విధంగా రోహిత్ పేరు రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అయితే టాప్ 5లో ఒకడిగా కూడా రోహిత్ ఉంటాడని ఎవరూ ఊహించడం లేదు. అలాంటిది అతను ఎలా టాప్ లోకి వస్తాడని భావిస్తున్నారు. అయితే అతను మొదటి నుంచి ఒకే రకమైన మాటతీరు, ఆటతో హౌస్ లో కొనసాగుతున్నాడు. అవసరంగా ఎవరితో గొడవ పెట్టుకోవడం లేదు, అలాగే అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. అలాగే ఎవరితో అర్గిమెంట్ జరిగిన కచ్చితమైన పాయింట్ మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇలా అన్ని రకాలుగా పెర్ఫెక్ట్ గా హౌస్ లో ఉన్న వ్యక్తి రోహిత్ ఒక్కడే అనే మాట కొందరు నెటిజన్లు నుంచి వినిపిస్తుంది. ఈ కారణంగానే అతనికి కూడా విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.