Green Comet : మరికొన్ని రోజుల్లో ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. దాదాపు 50,000 సంవత్సరాల తర్వాత భూమికి అత్యంత సమీపంలో ఆకుపచ్చని తోకచుక్క కనిపించనుంది. ఈ తోకచుక్కను చూడటం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత భూమికి దగ్గరగా వస్తుందని పేర్కొన్నారు.
ఈ తోకచుక్క ఫిబ్రవరి 2 నాటికి భూమికి దగ్గరగా వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ గ్రీన్ కామెట్ టెలిస్కోప్‌లు , బైనాక్యులర్‌లతో కనిపించవచ్చని, రాత్రి వేళల్లో ఆకాశంలో కంటితో కూడా కూడా చూడవచ్చని NASA తెలిపింది.

ఫిబ్రవరి 2న కామెట్ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు రాబోయే కొద్ది రోజుల్లోనే ఇది ప్రకాశవంతం కావచ్చునని నాసా పేర్కొంది. దీనిని “గ్రీన్ కామెట్” అని కూడా పిలుస్తారు, ఇది చిన్నగా స్పష్టంగా ఆకుపచ్చగా ఉంటుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఇది కనిపించనుంది. ఈ అద్భుతాన్ని చూసే అవకాశం విజయవాడ వాసులకు దక్కింది. నగరానికి ఉత్తర దిక్కున ఈ తోక చుక్కను చోడవచ్చు. ఈ తోక చుక్కను చూడటానికి అనువైన సమయం తెల్లవారుజామున , లేదా చంద్రాస్తమయం తర్వాత మాత్రమే చూడవచ్చు. ఎందుకంటే చంద్రకాంతి వాళ్ళ ఆకాశంలోని మిగిన నక్షత్రాలు మసకగా కనిపిస్తాయి . కామెట్ ప్రకాశాన్ని అంచనా వేయడం కష్టం, కానీ ఇది 2023లో అత్యంత ప్రకాశవంతంగా ఉండే అవకాశం ఉంది పరిశోధకులు పేర్కొంటున్నారు.

తోకచుక్క చిత్రాలు ఇప్పటికే భారతదేశంలో ప్రారంభ స్పాటింగ్ సమయంలో తీయబడ్డాయి. OdishaTV ప్రకారం, ఫోటో జర్నలిస్టులు రాకేష్ రౌల్ మలయా వరుసగా ఒడిశాలోని భువనేశ్వర్ , కోరాపుట్‌లో ఉన్నారు. ఛాయాచిత్రాలను టెలిలెన్స్‌లతో బంధించారు. C/2022 E3 అనే కామెట్ ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు ఆకాశంలో కనిపించే అవకాశం ఉంది. గత సంవత్సరం మార్చి 2న, ఖగోళ శాస్త్రవేత్తలు బ్రైస్ బోలిన్ ,ఫ్రాంక్ మాస్కీ జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీ సర్వేను ఉపయోగించి C/2022 E3 (ZTF)ని కనుగొన్నారు. C/2022 E3 వంటి దీర్ఘకాలపు తోకచుక్కలు మన సౌర వ్యవస్థ యొక్క సుదూర ప్రాంతాలలో ఉద్భవించాయని భావిస్తున్నారు, ఇది ఊర్ట్ క్లౌడ్ అని పిలువబడే భారీ గడ్డకట్టే ప్రాంతం.