Gujarath : ఒక్క ఆవుతో 30 ఎకరాల్లో వ్యవసాయం చేయవచ్చని ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ విధానం చెబుతుంది. గ్రామాల్లో ఆవుల పెంపకంతో రైతులకు జీవనోపాధి దక్కడంతో పాటు పాడి పశువులు వ్యవసాయంలో రైతులకు చేదోడువాదోడుగా ఉంటున్నాయి. అంతే కాదు ప్రజలకు ఆరోగ్యకరమైన పాలను అందిస్తూ వారి ఆరోగ్యాన్ని సంరక్షిస్తోంది. అయితే కొంత మంది అక్రమార్కులు గోవులను అక్రమంగా తరలిస్తూ గోవధకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి కేసే గుజరాత్‌లోని హైకోర్టుకు వచ్చింది. అయితే సాధారణంగా న్యాయవాధులు ఎలాంటి కేసుల్లో అయినా తీర్పు చెప్పి వదిలేస్తారు. కానీ ఈ న్యాయవాధి గోవుల ప్రాముఖ్యతను కోర్టు ద్వారా తెలియజేశారు.
అక్రమంగా పశువులను రవాణా చేసిన వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ గుజరాత్‌లోని ఒక కోర్టు గోహత్యపై కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. గోహత్యను నిలిపివేస్తే భూమ్మీద ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి అని తాపీ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఆర్డర్‌ను పాస్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి జోడింపుగా సమీర్ వినోద్‌చంద్ర వ్యాస్ ఆవు పేడతో చేసిన ఇళ్ళు ఆలోమిక్ రేడియేషన్ ద్వారా ప్రభావితం కావు అని గోమూత్ర వాడకం వల్ల అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని చెప్పారు. ఆవు పేడతో చేసిన ఇల్లు ఆటోమిక్ రేడియేషన్ బారిన పడవని తాను చెప్పడం కాదని సైన్స్ కూడా రుజువు చేసిందని అన్నారు. గోమూత్రం అనేక నయం చేయలేని వ్యాధులకు మందు అని న్యాయమూర్తి పేర్కొన్నారు. మతం ఆవు నుండే పుట్టిందన్నారు.
నవంబర్‌లో జారీ చేసిన ఉత్తర్వుకు సంబంధించి, గోసంరక్షణకు సంబంధించిన చర్చలన్నీ ఆచరణలోకి రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు బార్ అండ్ బెంచ్ నివేదించింది. ఆవు ఒక జంతువు మాత్రమే కాదని తల్లి కూడా అని పేర్కొంది. 68 కోట్ల పుణ్యక్షేత్రాలు, 33 కోట్ల దేవతల సజీవ గ్రహం ఆవు అని పేర్కొన్నారు. మొత్తం విశ్వంపై ఆవు యొక్క బాధ్యత ఉందన్నారు. కోర్టు, వివిధ శ్లోకాలను ప్రస్తావిస్తూ, ఆవులను సంతోషంగా ఉంచనట్లయితే, మన సంపద, ఆస్తి అదృశ్యమవుతాయని పేర్కొంది.
గోవధను వాతావరణ మార్పులకు కూడా జడ్జి ముడిపెట్టారు. ఈ రోజు ఆవేశం ,కోపం వంటి సమస్యల పెరుగుదలకు ఏకైక కారణం గోవుల వధ మాత్రమే అని అన్నారు. దీనిని పూర్తిగా నిషేధించే వరకు సాత్విక వాతావరణ మార్పు ప్రభావం చూపదు అని కోర్టు పేర్కొంది. గత ఏడాది ఆగస్టులో 16 ఆవులను అక్రమంగా రవాణా చేయడంపై ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. జీవిత ఖైదుతో పాటు, ఆ వ్యక్తికి ఐదు లక్షల జరిమానా కూడా విధించారు.