Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఈరోజు ఆగస్టు 18వ తేదీ ఎపిసోడ్ లో హైలెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో గౌతమ్, మహేంద్ర, జగతీలు రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకుంటుండగా అక్కడికి రిషి, వసుధార వస్తారు. రిషి వారిని మీరేంటి ఇక్కడ అన్ని ప్రశ్నించగా మా ఫ్రెండ్ కోసం వచ్చామని మహేంద్ర చెప్పగా గౌతం మీరు ఎక్కడికి వెళ్లి వస్తున్నారని రిషిని ప్రశ్నించగా ఎగ్జామ్స్ గురించి చర్చించడానికి వెళ్ళాము అని చెప్పి వసుని కాఫీతీసుకురామని చెబితే దానికి గౌతం మేము కూడా ఉన్నాం కదా అంటే సరే అందరికీ కూడా తీసుకురా అని చెప్పి అందరూ కూర్చుంటారు. ఏం చర్చించుకుంటున్నారని రిషి అడగక ఏముంది నేను గౌతం ఎగ్జామ్స్ గురించే చర్చించుకుంటున్నాం అంటాడు మహేంద్ర. అవునా అని రిషి చెప్పేలోపే దానికి మహేంద్ర నువ్వు వసుధార చర్చించుకున్నారు కదా ఎగ్జామ్స్ గురించి మేము వాటి గురించి చర్చించుకుంటున్నాం అనే లోగా వసు కాఫీ తీసుకువస్తుంది. అదేంటి నువ్వు తీసుకురాలేదా అంటే పర్లేదు సార్ మీరు తాగండి అంటే కూర్చొని కప్ప సాసరా అని అడిగితే మీ ఇష్టం అంటే కాఫీ కప్పు చేతికి ఇస్తాడు.
తర్వాత సన్నివేశంలో అందరూ కలిసి భోజనానికి కూర్చొని ఉండగా ధరణి భోజనం దేవయానికి వద్దకు తీసుకు వెళ్తుంటే దానికి రిషి పెద్దమ్మ రాలేదా అని అడిగితే పెద్దమ్మ పైన ఉన్నారు డల్ గా ఉన్నారని చెప్పి వెళ్తుంది. తర్వాత గౌతం పెద్దమ్మ రుషి మనసు బాగా మార్చుకుంది అంటే దానికి మహేంద్ర అలా బయటికి అనకూడదు మనసులో అనుకోవాలి. అంటాడు అప్పుడు రిషి అక్కడినుంచి భోజనం తీసుకొని దేవయాని వద్దకు వెళ్తాడు. జగతి ధరణితో నువ్వు కూడా వచ్చిన తర్వాత తింటా అని చెప్పి వెళ్ళిపోతుంది.
రిషి భోజనం తీసుకురావడం చూసి దేవయాని నువ్వెందుకు తెచ్చావు నాన్న అని అడగక మీ గురించి నాకు తెలుసు పెద్దమ్మ మనసులో ఏ స్వార్థం లేకుండా నా గురించి ఆలోచిస్తారు. దానికి మనసులో నా గురించి నిజం తెలిస్తే అప్పుడు ఏమవుతుందో ఏమో ఈ సాక్షి పెళ్లి వద్దనుకొని వెళ్లిపోయింది అని మనసులో అనుకుంటుంది. అది కాదు నాన్న నీ పెళ్లి అద్దాంతరంగా ఆగిపోయింది కదా అది అందుకే నా బాధ అంటుంది. సాక్షి ప్రేమ మోసం వెళ్ళిపోయింది కదా వదిలేయండి. డబ్బు విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ బరిస్తాను కానీ నా దగ్గర నటించే వాళ్లను నేను భరించలేని పెద్దమ్మ అంటాడు. జీవితమే నాటకం కదా అని నిజ జీవితంలో నటించే వాళ్లంటే నాకు అసహ్యం అంటే దానికి మనసులో దేవయాని అమ్మో నా గురించి నిజం తెలిసే ఏకంగా మెడబెట్టి బయటికి గండుతాడేమో అనుకుని రిషి ఇప్పుడు ఆ నాటకాలు ఆ గొడవలు మనకెందుకులే అంటే సరే మీరు తినండి పెద్దమ్మ అని అన్నం తినిపిస్తాడు. దేవయానికి అన్నం తినిపిస్తున్న సన్నివేశాన్ని జగతి చూసి చాలా బాధపడుతుంది. స్థానంలో నేనుంటే బావుండు అని ఊహించుకుంటూ ఉంటే అక్కడికి మహేంద్ర వచ్చి జగతి నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో నేను ఊహించుకోగలను. నువ్వు అనుకుంటున్నది ఎప్పుడో ఒకప్పుడు నిజమవుతుంది జగతి. నిజంగానా మహేంద్ర అంటే నీకు అమ్మ అన్న గౌరవం దక్కుతుంది, అది నీకు వరం కాదు నీ హక్కు, తన కళ్ళల్లో ఇంత ముందులాగా ధైర్యం కనపడట్లేదు, స్వరూపం బయటపడిపోతుంది ఏమో అన్న భయం ఉంది, భయం కూడా ఎప్పుడూ ఒకప్పుడు నిజం అవుతుంది జగతి. కావాల్సిందంతా కాస్త ఓపిక అంతే.
తర్వాత సన్నివేశంలో వసుధార ఆకలిగా లేదు భోజనం చేయకూడదు అని అనుకోనే లోగా ఒక అతను వచ్చి క్యారేజీ ఇచ్చి ఈ నెంబర్ కాల్ చేయమంటాడు ఇది రిషి సార్ నెంబర్ కదా అని కాల్ చేస్తుంది. రిషి ఫోన్ లో భోజనం చేస్తున్నావా అంటే లేదు సార్ ఆకలిగా లేదు అంటే అందుకే నువ్వు టయానికి భోజనం చేయవు ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి మీ ఆరోగ్యం మీద నీకు దృష్టి లేదు మొత్తం భోజనం తినాలని చెప్తాడు. ఆరోగ్య సూత్రాలు టైం కు తినాలి టైం కు నిద్రపోవాలి చెప్పడమే కానీ పాటించాలి అని తెలియదా నీకు. భోజనం చేయి గుడ్ నైట్ అంటాడు.
Guppedantha Manasu:
తర్వాత సన్నివేశంలో రిషి వచ్చి వదిన కాఫీ అంటాడు, అప్పుడు జగతి ధరణి ఇక్కడ లేదు పిలవమంటారా సార్ అంటే అవసరం లేదు నేను కాఫీ కోసం వచ్చాను అంటాడు. జగతి కాఫీ నేను ఇవ్వమంటారా సార్ అని అడిగితే ఓకే అంటాడు. తరువాత రిషి మేడం చిన్న రిక్వెస్ట్ నన్ను మీరు రిసీ సార్ అని పిలవద్దు అంటే దానికి జగతి సార్ అని లోపే అవును మేడం మీరు వినేది నిజమే నన్ను ఇక్కడి నుంచి సార్ అని పిలవకుండా రిషి అని పిలవండి అంటాడు. నీకు నాకు ఉన్న బంధం గురించి నేను మాట్లాడ దలుచుకోలేదు. కానీ ఇకనుంచి మీరు నన్ను రిషి అని పిలవండి. ఈ విషయాలలో మీరు కరెక్ట్ కావచ్చు మరికొన్ని విషయాల్లో నేను కరెక్ట్ కావచ్చు. ఒకే ఒక విషయంలో మీకు నాకు అభిప్రాయాలు కలుస్తాయి. ఆ విషయం గురించి నేను మాట్లాడొద్దని నిర్ణయించుకున్నాను. మాట్లాడను కూడా మీకు థాంక్స్ చెప్పాలి. నాకు ఏం నచ్చుతుందో ఏం నచ్చదు ఇంత మీకు తెలుసని నాకు తెలియదు. వసుధార కు మీరు ఎంతో సహకరించారు. వసు తన చివరి లక్ష్యాన్ని చేరుకోబోతుంది అప్పుడు కూడా మీరు సహకరించాలి మీరు సహకరిస్తారని తెలుసు అని చెప్పి కాఫీ అంటే దానికి ఇస్తాను సార్ అంటే రిషి జగతి వైపు తిరుగుతాడు ఇస్తాను రిషి అంటుంది. జగతి రిషికి కాఫీ ఇస్తుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.