Hansika : ‘దేశముదురు’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ హన్సిక. తొలి సినిమాతోనే ఈ బ్యూటీ యూత్‌కి బాగా కనెక్ట్ అయిపోయింది. అమ్మడు బాలనటిగానే సినీరంగ ప్రవేశం చేసింది. అల్లు అర్జున్‌తో తొలి మూవీ చేయడం కూడా అమ్మడికి బాగా ప్లస్ అయిపోయింది. దీంతో అవకాశాల కోసం వెతుక్కోనక్కర్లేకుండా పోయింది. స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ అమ్మడికి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీంతో అమ్మడు ఫోకస్‌కు కోలీవుడ్ వైపు షిఫ్ట్ చేసింది.
తాజాగా హన్సిక గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తమిళనాడులో వైరల్ అవుతోంది. అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోందట. తమిళ మీడియా ఈ విషయం గురించి వార్తలు వెలువరిస్తోంది. మరి వరుడు ఎవరు? అమ్మడు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతోంది? అనే కదా మీ డౌట్.. సౌత్ ఇండియాకు చెందిన ప్రముఖ రాజకీయ నేత కుమారుడితో వివాహానికి సిద్ధమవుతోందట. ప్రస్తుతం హన్సికకు కాబోయే భర్త వ్యాపారం రంగంలో రాణిస్తున్నట్టు సమచారం. అమ్మడికి సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఇక పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిలింనగర్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట.
Hansika : త్వరలోనే నిశ్చితార్థం..
ఇప్పటికే పెళ్లి విషయమై ఇరు కుటుంబాలు కలిసి చర్చించుకున్నారని.. అంతా ఓకే అయిపోయిందని.. త్వరలోనే నిశ్చితార్థం.. ఆపై వివాహ తేదీని కూడా ఖరారు చేయనున్నారని సమాచారం. అయితే దీనిపై హన్సిక నుంచి కానీ.. సంబంధితుల నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రెండేళ్ల గ్యాప్ తరువాత అమ్మడు మహా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా సక్సెస్ అయితే అమ్మడికి కెరీర్ బాగుండే అవకాశాలున్నాయి. ఫట్ అయితే మాత్రం ఇక అవకాశాలకు ఇబ్బంది పడాల్సిందే. మరి అమ్మడికి పెళ్లి అయిపోతే సినీ ఇండస్ట్రీతో టచ్‌లో ఉంటుందో లేక దూరంగా వెళ్లిపోతుందో చూడాలి.