Hardik Pandya : క్రికెటర్ హార్దిక్ పాండ్యా , అతని భార్య, నటాషా స్టాంకోవిచ్, రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా, సన్నిహితుల సమక్షంలో మళ్ళీ వివాహం చేసుకున్నారు. ఈ జంట హిందూ , క్రిస్టియన్ రెండు సంప్రదాయాలను అనుసరించి వివాహం చేసుకున్నారు. ఈ గొప్ప వెడ్డింగ్ ఉత్సవాల నుండి ఫోటోలను హార్దిక్ ఒక్కొక్కటిగా వదులుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు ఈ క్రికెటర్.

ఈ మధ్యనే వివాహానికి సంబందించిన పిక్స్ పోస్ట్ చేసి సందడి చేసిన ఈ స్టార్ క్రికెటర్ తాజాగా హల్దీ, మెహందీ వేడుకల నుండి స్నిప్పెట్‌లుఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. అభిమానులను అలరించాడు.

వెడ్డింగ్ డ్రెస్ లో దిగిన క్యూట్ మూమెంట్స్ పిక్స్ ను ఫాలోవర్స్ తో షేర్ చేసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ అబూ జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన అందమైన కస్టమ్-మేడ్ దుస్తులలో నటాషా , హార్దిక్‌లు ఆధరగొట్టారు.

“పెయింట్ ఇన్ లవ్” అనే క్యాప్షన్‌తో హల్దీ పిక్స్ పోస్ట్ చేసారు ఈ కపుల్. వేడుకల సమయంలో జంట ఉత్సాహంగా గడిపిన పిక్స్ తో పాటు కుమారుడు అగస్త్య పాండ్యతో కలిసి దిగిన ఫోటోలు పోస్ట్ చేశారు.

హార్దిక్, అగస్త్య పింక్ అండ్ వైట్ కుర్తా , ప్యాంట్ సెట్‌లో కనిపించగా నటాషా అద్భుతమైన షరారా ప్యాంట్ సెట్ ధరించి చాలా అందంగా కనిపించింది. ఈ అవుట్ ఫిట్స్ ను అబు జానీ సందీప్ ఖోస్లా లు డిజైన్ చేశారు.

హార్దిక్ పాండ్య , నటాషా లు 2020 జనవరి 1న వివాహం చేసుకున్నారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో వీరు ఒక ప్రైవేట్ వేడుకలో పెళ్లి చేసుకున్నారు. ఈ కపుల్ కు జులై 2020లో తల్లిదండ్రులు అయ్యారు. అయితే వివాహం అనేది అందరి సమక్షం లో అంగరంగ వైభవంగా జరగాలనే ఉద్దేశం తో రీసెంట్ గా మరోసారి ఈ జోడి తన వివాహాన్ని జరుపుకుంది.
