బాలీవుడ్ లో అమీర్ ఖాన్ అంటే నెంబర్ వన్ యాక్టర్ అని చెప్పాలి. అతని సినిమా రిలీజ్ అయ్యింది అంటే మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ ఉంటాయి. కనీసం 50 కోట్లకి పైగా మొదటి రోజునే అతని సినిమా కలెక్ట్ చేస్తుంది. అంత ఇమేజ్ ఆయన సొంతం. అందుకే అమీర్ ఖాన్ తో భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి నిర్మాతలు ధైర్యం చేస్తూ ఉంటారు. సినిమా ఫ్లాప్ అయిన మొదటి మూడు రోజుల్లోనే కలెక్షన్స్ వచ్చేస్తాయి అనే ధీమా అమీర్ ఖాన్ సినిమా విషయంలో ఉంటుంది. అయితే మొదటి సారి అమీర్ ఖాన్ కెరియర్ లో ఘోరమైన పరాభవం లాల్ సింగ్ చద్దా సినిమాతో చూసాడనే చెప్పాలి. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో హిందీతో పాటు సౌత్ బాషలలో కూడా రిలీజ్ చేశారు. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్ కూడా గట్టిగా చేశారు. ఇక టాలీవుడ్ లో అయితే సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవి, నాగార్జున దగ్గరుండి సినిమాని ప్రమోట్ చేశారు. చిరంజీవి సమర్పకుడుగా ఉంటూ సినిమా ప్రమోషన్ బాధ్యత తీసుకున్నారు.
అమీర్ ఖాన్ కూడా ఎన్నడూ లేని విధంగా తెలుగు ఆడియన్స్ మీద, తెలుగు సినిమాల మీద విపరీతమైన ప్రేమ కురిపించాడు. ఇంత చేసిన తెలుగు ప్రేక్షకులు లాల్ సింగ్ చద్దా చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీనికి కారణం బింబిసార, సీతారామం లాంటి సూపర్ హిట్ తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందు ఉన్నాయి. వాటిని కాదనుకొని అమీర్ ఖాన్ సినిమాకి వెళ్ళాలలే ఆసక్తి తెలుగు ప్రేక్షకుడికి రాలేదు. తెలుగులోనే అనుకుంటే హిందీలో కూడా ఈ సినిమాకి భారీ దెబ్బ తగిలింది. ఈ సినిమా మొదటి రోజు కేవలం 11 కోట్లు కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అమీర్ ఖాన్ కెరియర్ లో ఈ మధ్యకాలంలో అతి తక్కువ కలెక్షన్స్ చేసిన చిత్రంగా లాల్ సింగ్ చద్దా నిలబడింది. సినిమా అద్భుతంగా ఉంటుందని, తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అమీర్ ఖాన్ ఎంత ప్రమోషన్ చేసుకున్న యాంటీ హిందూ క్యాంపైన్ అతనికి గట్టిగా తగిలింది.
బాయ్ కట్ లాల్ సింగ్ చద్దా పేరుతో ట్విట్టర్ లో జరిగిన హ్యాష్ ట్యాగ్ క్యాంపైన్ ఎఫెక్ట్ సినిమాపై భారీగానే పడింది. దానికి తోడు మొదటి షో నుంచి డివైడ్ టాక్ రావడంతో హిందీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడానికి అస్సలు ఇష్టపడలేదు. ఫలితంగా డిజాస్టర్ రిజల్ట్ సినిమాకి వచ్చింది. తన సినిమాకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి అమీర్ ఖాన్ అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసిన కూడా ప్రేక్షకులని థియేటర్ వరకు రప్పించడంలో విఫలం అయ్యారు. 10 వేల స్క్రీన్స్ లో సినిమాని రిలీజ్ చేస్తే, అందులో 1300 స్క్రీన్స్ లో ప్రేక్షకులు లేక సినిమా పడలేదు అంటే ఏ స్థాయిలో లాల్ సింగ్ ని ప్రేక్షకుడు తిరస్కరించాడో అర్ధం చేసుకోవచ్చు. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఇందులో సిక్కులని అవమానించే విధంగా కథ, కథనాలు ఉన్నాయని ప్రచారాన్ని తెరపైకి తీసుకురాటంతో లాంగ్ రన్ లో సినిమా ఎక్కువ రోజులు నిలబడే అవకాశం లేదని అనిపిస్తుంది. మొత్తానికి అమీర్ ఖాన్ ఎంతో నిరీక్షణ తర్వాత ప్రేక్షకుల ముందుకి వస్తే అతనికి అవమానకరమైన ఫలితాన్ని లాల్ సింగ్ ద్వారా ప్రేక్షకుడు ఇవ్వడం ఊహించని ఘటన అని చెప్పాలి.