Mahesh Babu Foundation : వెండి తెర పైనే కాదు… నిజ జీవితంలోనూ మహేష్ మనసున్న శ్రీమంతుడే అనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని ఆయన బతికించిన వందల గుండెలు చెబుతాయి. గతంలో ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి తన ఉదారతను చాటుకుంటున్నారు మహేష్. తాజాగా మళ్లీ పసిగుండెలను బతికించాలని తాపత్రయ పడుతున్నారు. ఈ క్రమంలోనే తమ చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు. అసలు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయాలను ఆ ప్రకటనలో స్టెప్ బై స్టెప్ వివరించారు.
మహేష్ తొలుత చిన్నారి గుండె ఆపరేషన్ కోసం ఒక లెటర్ హెడ్ విడుదల చేస్తారు. ఆ లెటర్ హెడ్‌ను తీసుకుని హైదరాబాద్‌లో కానీ, విజయవాడలో కానీ.. లేదంటే ఆంధ్రా హాస్పిటల్‌కి కానీ వెళితే చిన్నారిని తమ ఆసుపత్రిలో జాయిన్ చేసుకుంటారు. సదరు ఆసుపత్రిలో బేబి కండీషన్‌ను పరిశీలించి సర్జరీ అవసరమైతే షెడ్యూల్ చేస్తారు. ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో జాయిన్ అయ్యాక బేబితో పాటు బేబి తల్లికి హాస్పిటల్ యాజమాన్యమే భోజనం అందిస్తారు. అలాగే వసతి కూడా ఇస్తారు. సర్జరీ పూర్తయిన మీదట 4 – 5 రోజుల పాటు ఆసుపత్రిలోనే తమ సమక్షంలో ఉంచుకుని కండీషన్ బాగుంది అనుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తారు.
Mahesh Babu Foundation : ఒక్కో బేబి సర్జరీ కోసం రూ.3 నుంచి 7 లక్షలు..
సర్జరీ అనంతరం కూడా బేబి ఫ్యామిలీతో కో ఆర్డినేట్ అవుతూ బేబికి కావల్సిన మందులు, మెడికల్ టెస్ట్ చేస్తుంటారు. ఒకవేళ బేబి ఫ్యామిలీ పేదరికంలో మగ్గుతున్నట్టయితే రవాణా ఖర్చులు, ఉండటానికి ఖర్చులు, మెడికల్ ఖర్చులు, అన్నీ ఇస్తారు. నయం అయ్యాక వాళ్లకి లైఫ్ సపోర్ట్ కోసం మహేష్ కొంత డబ్బు ఇచ్చి మరీ పంపిస్తారు. ఒక్కో బేబి సర్జరీ కోసం రూ.3 నుంచి 7 లక్షల వరకూ ఖర్చవుతుంది. పైగా పై ఖర్చులు వేరుగా ఇస్తారు. మహేష్ ఇప్పటి వరకూ 2500కి పైగా ఆపరేషన్లు చేయించారు. ఒకవేళ ఎవరికైనా హార్ట్ కంప్లైంట్ ఉంటే.. +917449898989 నంబర్‌కు పూర్తి వివరాలు పంపించండి. మహేష్ ఉదారతకు,ఔన్నత్యానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.