Hema : ప్రముఖ నటి సురేఖా వాణి ఈ మధ్య కాలంలో సినిమాల్లో అయితే కనిపించడం లేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం దుమ్ము రేపుతోంది. కూతురితో కలిసి పొట్టి పొట్టి డ్రెస్సుల్లో డ్యాన్స్‌లు నానా హంగామా చేసేస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెలబ్రిటీ హోదాలో సురేఖావాణి చిందులాటకు,సెలబ్రిటీ కిడ్‌గా సుప్రిత అందాలు యాడ్ అవుతూ కుర్రకారులో సెగలు పుట్టిస్తుంటాయనడంలో సందేహం లేదు. ఇక ఈమెపై వచ్చిన ట్రోల్స్ మరెవరిపైనా రాలేదంటే అతిశయోక్తి కాదు. అయినా సరే.. తగ్గేదేలే.. తన లైఫ్ తన ఇష్టం అన్నట్టుగా నెట్టింట రచ్చ చేస్తూ ఉంటుంది.
వీలు కుదిరినప్పుడల్లా కూతురు సుప్రితతో కలిసి హాలిడే ట్రిప్స్, పబ్స్ తిరుగుతూ హేమ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తన కూతురి పుట్టినరోజు సందర్భంగా కూడా సురేఖా వాణి విపరీతంగా ట్రోల్ అయ్యింది. తన కూతురి పుట్టిన రోజు వేడుకలో తన కూతురికి విస్కీ తాగించిన వీడియో కాస్తా వైరల్ అయ్యింది. ఇంకేముంది.. సురేఖా వాణి తన కూతురికి విస్కీ తాగిస్తోందహో అంటూ సోషల్ మీడియా అంతా రచ్చ అయిపోయింది. దీన్ని కూడా ఆమె అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదిలా ఉండగా తాజాగా మరో ప్రముఖ నటి హేమ.. సురేఖా వాణిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
Hema : సురేఖా వాణి నా గురించి షూటింగ్స్‌లో తప్పుగా మాట్లాడేది..
నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అక్కగా, వదినగా, భార్యగా ఎన్నో క్యారెక్టర్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ.. సురేఖ వాణి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. సురేఖ వాణి తన బెస్ట్‌ఫ్రెండ్ అని, తమలాగే తన కూతురు ఈషా, సురేఖ కూతురు సుప్రీత మంచి ఫ్రెండ్స్ అని తెలిపింది. అయితే వారిద్దరి స్నేహాన్ని చూసి ఓర్వలేక సురేఖా వాణి వారిద్దరినీ విడగొట్టేందుకు ప్రయత్నించిందని.. అది కుదరక పోవడంతో తన కూతురిని స్కూల్ మాన్పించిందని వెల్లడించింది. అయినా కూడా సుప్రీత మళ్లీ తన కూతురు చదివే స్కూల్‌కే వచ్చిందని తెలిపింది. అంతేకాకుండా షూటింగ్స్‌లో సురేఖా వాణి తన గురించి వేరే వాళ్లతో తప్పుగా చెప్పేదని.. అందుకే ఆమెకు దూరంగా ఉంటున్నట్టు హేమ వెల్లడించింది.