Hero Nikhil : యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. గతంలో నిఖిల్ నటించిన కార్తికేయ మూవీకి ఇది సీక్వెల్. ఈ సినిమా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నిర్వహిస్తోంది. మరోవైపు సినిమా టీం ప్రమోషన్స్‌లో చాలా బిజీ బిజీగా గడిపేస్తోంది. అయితే ప్రమోషన్స్ హీరోయిన్ కనిపిస్తు ఆ కిక్కే వేరప్ప. కానీ అమ్మడు కనిపించదే. ఎక్కడ చూసిన హీరో నిఖిల్ మాత్రమే కనిపిస్తున్నాడు. ఈ ప్రశ్న అమ్మడిని సైతం అడగ్గా.. ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. రాత్రి, పగలు వరుసగా షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్లే తాను కార్తీకేయ 2 ప్రమోషన్స్‌లో పాల్గొనడం లేదని వివరణ ఇచ్చింది.
Hero Nikhil : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిఖిల్ వ్యాఖ్యలు
అయితే హీరో నిఖిల్‌కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. అనుపమ ఎందుకు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు? అని. దీనికి నిఖిల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా నిఖిల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇక్కడ అనుపమ గురించి అసలు విషయాన్ని మన యంగ్ హీరో బయటపెట్టేశాడు. నిఖిల్.. అనుపమ గురించి మాట్లాడిన మాటల తాలుకు క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు ముద్దుగుమ్మపై ఫైర్ అవుతున్నారు.
అనుపమను చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. తను ప్రమోషన్స్‌కు ఎందుకు రాదనే విషయం తెలియదు. సెట్‌లో చూస్తే చాలా సరదాగా ఉంటుంది. ఇక ఇంటికి వెళ్లాక మెసేజ్ చేసినా.. కాల్ చేసినా కనీసం సమాధానం ఉండదు. మళ్లీ మరుసటి రోజు సెట్‌కు రాగానే సరదాగా కలిసిపోతుంది. అసలు తను ఏమాత్రం అర్థం కాదు. తనకి రెండు ముఖాలున్నాయి. రేపు ప్రమోషన్స్ ఉన్నాయని ముందు రోజే మెసేజ్ పెడితే చూడదు. కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నిఖిల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనుపమకు అంత యాటిట్యూట్ ఏంటంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అప్పుడే అమ్మడిపై ట్రోల్స్ కూడా ప్రారంభమయ్యాయి.