Hero Siddharth : ప్రముఖ హీరో సిద్దార్థ్ ఎప్పటికీ హాట్ టాపిక్‌గానే నిలుస్తుంటాడు. తెలుగులో ప్రముఖ దర్శకుడు భాస్కర్ దర్శకత్వం వహించిన ‘బొమ్మరిల్లు’ చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నాడు. అయితే నటుడు సిద్ధార్థ్ సినిమా, జీవిత పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ తన వైవాహిక జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా కొంతమేర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఆ తరువాత టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరోయిన్‌తో ప్రేమాయణం అది కూడా బెడిసికొట్టడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు మరోసారి సిద్దార్థ్ ప్రేమ వ్యవహారంలో హాట్ టాపిక్‌గా మారాడు.
Hero Siddahrth : ముంబై వీధుల్లో దర్శనమిచ్చిన జోడీ
నటి అదితిరావు హైదరీతో సిద్ధార్థ్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ‘మహా సముద్రం’ సినిమాతో అదితి, సిద్దార్థ్ జంటగా నటించారు. ఆ సినిమా నాటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ టాక్. ఈ క్రమంలోనే తాజాగా ఈ జోడీ ముంబయి వీధుల్లో దర్శనమిచ్చింది. సోమవారం సాయంత్రం నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో సందడి చేసింది. అయితే రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న సిద్దార్థ్ జంటను ఫోటోలు తీసేందుకు కెమెరా మెన్‌లు తెగ ఆరాటపడ్డారు. అయితే వీరిపై సిద్ధార్థ్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. ‘‘నేను ఇక్కడి వాడిని కాదు. ఇక్కడ ఉన్న స్టార్స్‌ను ఫొటోలు తీసుకోండి. ఇప్పుడు చాలా సున్నితంగా చెబుతున్నా. తర్వాత మరోలా చెప్పాల్సి వస్తుంది’’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే.. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు వీరిద్దరి ప్రేమ వ్యవహారంపై ఒక క్లారిటీకి వస్తున్నారు.
సిద్ధార్థ్ 2003వ సంవత్సరంలో న్యూఢిల్లీలో తన పొరుగింట్లో నివాసం ఉంటున్న మేఘన అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.కానీ ఏమైందో ఏమోగాని పెళ్లయిన మూడు సంవత్సరాలకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని 2007వ సంవత్సరంలో విడిపోయారు. అయితే అప్పటికే వీరిద్దరికీ ఒక కొడుకు జన్మించడంతో తన కొడుకు సంరక్షణ బాధ్యతలను సిద్ధార్థ్ తీసుకున్నాడు.ఆ తర్వాత సిద్ధార్థ మళ్లీ పెళ్లి చేసుకోక పోయినప్పటికీ పలువురు టాలీవుడ్ హీరోయిన్లతో లవ్ అఫైర్లతో హాట్ టాపిక్‌గా నిలిచాడు.