Bhavana : బస్సు, ట్రైన్‌లలో మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటూనే ఉంటారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ అమ్మాయి కారులో లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసిందే. పబ్‌కని సరదాగా వెళితే.. అక్కడ మాట కలిపిన కొందరు అబ్బాయిలు.. ఆమెను నమ్మించి తమ కారు ఎక్కించుకుని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలాంటి ఘటనే గతంలో కూడా జరిగింది. ప్లేస్, పర్సన్ వేరనుకోండి. అది ఒక హీరోయిన్‌కు జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హీరోయిన్ దగ్గరకు వెళ్లడమే కాదు.. ఆమె కారు ఎక్కి మరీ ఆమెకు రెండు గంటల పాటు నరకం చూపించారు.
కన్నడ సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌లలో భావన కూడా ఒకరు. ఈ ముద్డుగుమ్మ తెలుగు ప్రేక్షకులతో పాటు మలయాళ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. శ్రీకాంత్ సరసన మహాత్మ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. భావన ఇప్పటివరకు 82 సినిమాలకి పైగా నటించింది. 2017వ సంవత్సరంలో అంటే ఆమె కెరీర్ చాలా బాగున్న సమయంలో ఒక ఊహించని ఘటన జరిగింది. కొచ్చిలో ఒక లొకేషన్ లో షూటింగ్ పూర్తి చేసుకుని తన స్నేహితుడు యాక్టర్ డైరెక్టర్ లాల్ ఇంటికి భావన బయలుదేరింది. మరికొద్ది సేపయితే డైరెక్టర్ ఇంటికి చేరుకుని ఉండేది. అప్పుడే ఒక అనుకోని ఘటన జరిగింది. ఇది మీడియాలో పెను సంచలనంగా మారింది.
Bhavana : డ్రైవర్ ప్రమేయం కూడా ఉందట..
ఆమె కారులో వెళుతుండగా.. కొందరు వ్యక్తులు లిఫ్ట్ కావాలని అర్ధించడంతో భావనను సంప్రదించకుండానే డ్రైవర్ కారు ఆపాడు. ఆ తరువాత వాళ్లు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టారట. తాకరాని చోట తాకుతూ బట్టలు మొత్తం చింపారట. మరొకరు ఈ సంఘటన మొత్తాన్ని ఒక వీడియో తీశారు. దాదాపుగా రెండు గంటల పాటు భావనను లైంగికంగా వేధించిన అనంతరం ఒకచోట కారు ఆపి దిగి వెళ్లిపోయారు. కట్ చేస్తే.. ఇందులో డ్రైవర్ ప్రమేయం కూడా ఉందని తెలిసింది. ముందే పథకం ప్రకారం డ్రైవర్‌తో కుమ్మక్కై కారు ఆపించి సదరు వ్యక్తులు కారులో ఎక్కినట్టు సమాచారం. వారి నుంచి తప్పించుకున్న భావన చివరికి ఒంటిపై చిరిగిన దుస్తులతోనే స్నేహితుడి ఇంటికి వెళ్లింది. తన స్నేహితుడి సలహా మేరకు తరువాత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.