ఇప్పటి వరకు సినిమాలలో లేదంటే ఫ్యాషన్ మ్యాగజైన్స్ మీద హీరోయిన్స్, మోడల్స్ అందాలని చూపిస్తూ వాటితో హైప్ క్రియేట్ చేయడం ఒక అలవాటుగా ఉంది. హీరోయిన్స్ కూడా చాలా మంది అందాల ప్రదర్శనకి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు అయితే శరీరంపై ఎలాంటి అచ్చాదనం లేకుండా ఫోటోలకి ఫోజులు ఇవ్వమన్నా ఇస్తారు. అలాగే సినిమాలలో కూడా పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా కనిపించడానికి వెనుకాడరు. ఆధునిక ప్రపంచంలో మన శరీరంలో అందాలని మనం చూపించుకుంటేనే క్రేజ్ ఉంటుందనే అభిప్రాయం చాలా మంది హీరోయిన్స్ లో ఉంది. అందుకే వారు తమ ఇన్స్టాగ్రామ్ పేజీలలో కూడా హాట్ హాట్ ఫోటోషూట్ లు చేసుకొని వాటిని షేర్ చేస్తూ ఉంటారు. చాలా మంది యువత హీరోయిన్స్ అందాల ఫోటోలని చూడటానికి ఇష్టపడతారు. ఆ ఫోటోల కోసం వారికి ఫాలోవర్స్ గా కూడా మారిపోతారు. డబ్బు సంపాదనకి అంగాంగ ప్రదర్శన కూడా ఒక రకమైన వ్యాపార సూత్రమే అనేది చాలా మంది హీరోయిన్స్ మాట.
సౌత్ హీరోయిన్స్ ఇప్పటి వరకు ఆ స్థాయికి చేరుకోకున్నా. పూనమ్ పాండే, షెర్లీన్ చోప్రా లాంటి భామలు ఏకంగా వీడియోలు కూడా చేయడం మొదలు పెట్టారు. ఆడవారి అందాన్ని చూడటానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అందుకే వారు శరీరాన్ని ఆదాయ మార్గంగా మార్చుకొని అందాల ప్రదర్శన చేస్తారు. కాని మగవారి నగ్నత్వాన్ని ఎవరు చూస్తారు అనే సందేహం రావొచ్చు. అయితే కండలు తిరిగిన శరీరాన్ని చూసేందుకు ఇష్టపడే అమ్మాయిలు ఉన్నారు. అలంటి వారిని ఎట్రాక్ట్ చేయడం కోసం కొన్ని మ్యాగజైన్స్ నడుస్తున్నాయి. అయితే గతంలో ఎవరో మోడల్స్ అలాంటి మ్యాగజైన్స్ కి నగ్నంగా ఫోజులు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాడు. అయితే ఆ ఫొటోలకి పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇదేమి కొత్త వెర్రి అంటూ అందరూ విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఇంతలో సౌత్ నుంచి మరో హీరో నగ్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తమిళ్ హీరో విష్ణు విశాల్ బెడ్ మీద కేవలం నడుము వరకు దుప్పటి కప్పుకొని ఫోటోకి ఫోజులు ఇచ్చాడు. ఈ ఫోటోలని తన భార్య గుత్తాజ్వాల తీసిందని కూడా వాటికి కామెంట్స్ పెట్టాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగు హీరో, సింగర్ గీతామాధురి భర్త నందు కూడా ఇలా టవల్ కట్టుకొని బెడ్ రూమ్ లో తన కండలు తిరిగిన శరీరాన్ని చూపిస్తూ ఫొటోలకి ఫోజులు ఇచ్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఇవి కూడా వైరల్ గా మారాయి. వీటిని చూస్తున్న చాలా మంది సదరు హీరోలపై నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. బాడీని షో అప్ చేయడం ఏదో ట్రెండ్ గా హీరోలు అందరూ ఫాలో అవుతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి ఫోటోలు పెడుతూ సభ్య సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఇలాంటి ట్రోల్స్ ని మన హీరోలు ఎలాగూ పట్టించుకోరు కాబట్టి మరెంత మంది ఈ ట్రెండ్ ని కొనసాగిస్తూ తమ కండల శరీరాన్ని బట్టలు లేకుండా చూపిస్తారో అనేది చూడాలి అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.