Hit And Drag Case : జనవరి ఒకటవ తారీఖున తెల్లవారుజామున దేశ రాజధానిలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో 20 ఏళ్ల యువతి అంజలి కుమారిని తమ కారు కిందకు లాగిన ఆరుగురు నిందితులపై ఢిల్లీ పోలీసులు మంగళవారం హత్యానేరం మోపారు. జనవరి 12న, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమానితులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరింది. అదేవిదంగా సాక్షులు చేసిన అనేక కాల్స్ లకు ఆలస్యంగా స్పందించినందుకు పిసిఆర్ వ్యాన్‌లలో మోహరించిన 11 మంది పోలీసులను సస్పెండ్ చేయాలని ఆదేశించింది. సుల్తాన్‌పురి హిట్ అండ్ డ్రాగ్ కేసులో నిందితుల్లో ఒకరైన అశుతోష్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేరం జరిగిన తర్వాతే అతని పాత్ర ప్రారంభమైందని రోహిణి కోర్టు పేర్కొంది.

జనవరి 1న తన స్కూటర్‌పై ఇంటికి వెళ్తున్న 20 ఏళ్ల యువతి అంజలి కుమారిని మారుతీ సుజుకీ బాలెనో కారు ఢీకొట్టింది. ఆమె కాలు కారు కింది భాగంలో ఇరుక్కుపోయింది. దాదాపు మూడు గంటల పాటు 14 కిలోమీటర్లు ఆమెను కార్ ఈడ్చుకెల్లింది. ఈ ఘటనతో సదరు యువతి శరీరం నుజ్జు నుజ్జు అయ్యింది. తలకు బలమైన గాయాలు అయ్యాయి. సీసీ రికార్డు అయినా వివరాల ఆధారంగా పోలీస్ లు కేసు నమోదు చేసారు. నిందితులను అరెస్ట్ చేసారు. ఈ ఇన్సిడెంట్ పైన స్పందించిన , కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమానితులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరింది.