Hyper Tension : హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న వారు రోజురోజుకీ పెరుగుతున్నారు. గతంలో 50 ఏళ్ల పైబడిన వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనేవారు. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. ఇక చాలా మంది ఎదుర్కొంటున్న వారిలో ఒకటి హైపర్‌టెన్షన్. ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరించడం వల్ల ముఖ్యంగా హైపర్ టెన్షన్‌ను ఎదుర్కోవడం జరుగుతోంది. ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న మన ఆహారంలో మార్పులు, నీళ్ల నుంచి ప్రతి ఒక్కటి పొల్యూట్ అయిపోవడం.. అధిక బరువు, నిద్రలేమితో పాటు.. అయోడైజ్డ్ సాల్ట్ పేరుతో మనం తీసుకుంటున్న విషం.. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వంటివి అన్నీ వెరసి హైపర్ టెన్షన్‌కు కారణమవుతున్నాయి.
Hyper Tension : గంటపాటు వ్యాయామం తప్పనిసరి
ముఖ్యంగా బీపీని కంట్రోల్లో ఉంచుకోకపోతే.. చాలా ప్రాణాంతక సమస్యలకు దారి తీయవచ్చు. మరి ఈ హైపర్ టెన్షన్‌ను ఎలా అదుపులో పెట్టుకోవాలి? కేవలం మందులతో దీనిని కంట్రోల్లో పెట్టవచ్చా? అంటే అసంభవం. హైబీపీ అనేది చాలా డేంజర్. ఆహార నియమాలు, కనీసం ఒక గంటపాటు వ్యాయామం తప్పని సరి. ముఖ్యంగా హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్లో ఉంచుకోవడానికి సరిపడా నీరు తాగడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటే.. శరీరమంతా రక్తాన్ని పంప్ చేయడంలో గుండె మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు.
ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. నీరు శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడమే కాకుండా.. రక్తంలోని అదనపు సోడియంను తొలగిస్తుంది. తద్వారా శరీరంలో సోడియం స్థాయులు పెరిగితే.. హైపర్‌టెన్షన్ సమస్య పెరుగుతుంది. దీనికోసం కొన్ని రకాల జ్యూసులు కూడా సాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. హైపర్‌టెన్షన్ కంట్రోల్ చేయడానికి క్రాన్బెర్రీ జ్యూస్ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రాన్బెర్రీ జ్యూస్‌లో విటమిన్ సీతో పాటు ఉండే యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేషన్ ఎదుర్కోవడానికి సహాయపడతాయి. రక్త ప్రసరణను ప్రోత్సహిస్తాయి. రక్త నాళాలను సడలించి.. బీపీని కంట్రోల్ చేస్తుంది. రోజుకో గ్లాస్ క్రాన్బెర్రీ జ్యూస్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా.. ప్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడుతుంది.