వర్షాకాలం ఆరంభమైందంటే సీజనల్ వ్యాధులు ఎక్కువగా భయపెడుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో మనం తీసుకునే ఆహారంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించి ప్రోటీన్ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల త్వరగా వ్యాధుల బారిన పడుతున్నారు. వ్యాధి మహమ్మారి కూడా ఈ రెండేళ్లలో చాలా భయపెట్టింది. ఇక శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగడం వలన సీజనల్ వ్యాధి బారిన పడేవారు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువయ్యారు. వర్షాకాలం వచ్చిందంటే టైఫాయిడ్, డెంగ్యూ, కలరా వంటి వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. వీటిలో టైఫాయిడ్ ఫీవర్ చాలా ప్రమాదకరమైంది. సరైన జాగ్రత్తలు లేకపోతే టైఫాయిడ్ ఫీవర్ శరీరాన్ని చాలా బలహీనంగా మారుస్తుంది.
సాధారణంగా టైఫాయిడ్ నిల్వ ఉన్న ఆహారం తినడం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. సాల్మొనెల టైఫీ అంటే ఈ టైఫాయిడ్ ఫీవర్ రావడానికి కారణం అవుతుంది. టైఫాయిడ్ ఫీవర్ ఒకసారి వచ్చిందంటే దానికి సంబంధించిన వ్యాధి లక్షణాలు చాలా సులభంగా తెలుసుకోవచ్చు. శరీరంలో వేడి విపరీతంగా పెరిగిపోతుంది. తలనొప్పి, విపరీతమైన నీరసం వంటి లక్షణాలు ఉంటాయి. కడుపునొప్పి వాంతులు, విరోచనాలు కూడా జరుగుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే టైఫాయిడ్ అని గుర్తించడంతో పాటు డాక్టర్ ను సంప్రదించాలి. టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు జీర్ణశక్తి మందగిస్తుంది. ఆ సమయంలో తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు పూర్తిగా తగ్గించాలి.
ఎక్కువగా ఆకుకూరలు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇట్లాంటి ఆహారం వలన వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గోరు వెచ్చని నీటిని తాగుతూ ఉండాలి. టైఫాయిడ్ ఫీవర్ వల్ల డిహైడ్రేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. నీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఈ ప్రభావం నుంచి బయటపడవచ్చు. టైఫాయిడ్ ఫీవర్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించి వ్యాధి కావడం వల్ల మరొకరు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఇతరులకి రాకుండా వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి.