AP Politics: రాజకీయాలలో మోసాలు, వెన్నుపోటు అనేవి ఉండవు. కేవలం వ్యూహాలు మాత్రమే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. రాజకీయ మేధావులు కూడా ఇదే విషయాన్ని బలంగా నమ్ముతారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా వ్యూహాలు రచిస్తూ ఉంటారు. రాజకీయ పార్టీలు అధికారం కోసం చేసే యుద్దాలలో నేరుగా బాణాలు ఉండవు. వ్యూహాత్మక నిర్ణయాలతోనే ప్రత్యర్ధులని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అయితే ఇలా పడే వ్యూహాలలో ఎవరు ప్రజా విశ్వాసాన్ని సొంతం చేసుకుంటే వారే అధికారంలోకి వస్తారు అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ కూడా అలాంటి వ్యూహంలోనే ఇరుక్కుంది అనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

కార్యకర్తల నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరు ప్రత్యర్ధులపై ఆడే మాటల విషయంలో వ్యూహాత్మక విధానాలలో భాగంగానే ఉంటాయి. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవరి వ్యూహాలు ఏంటి అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతున్నాయి అనే భావనతో అందరూ ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో కూడా ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలతో అధికార పార్టీకి నిద్ర లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత తన ప్రతి సభలో కూడా కార్యకర్తలని ఉద్దేశించి మాట్లాడినపుడు వ్యూహాన్ని తనకి వదిలేయండి. జనసేనని ఎలా అధికారంలోకి తీసుకురావాలో అనేది నేను చూసుకుంటా. మీరు నన్ను నమ్మండి నియోజకవర్గాలలో బలంగా ప్రజల కోసం ఫైట్ చేయండి అని చెబుతున్నారు.
అయితే జనసేన వ్యూహాలు ఏముంటాయిలే అని అధికార పార్టీతో పాటు, ఆ పార్టీని సపోర్ట్ చేసి రాజకీయ విశ్లేషకులు కూడా తీసిపారేస్తున్నారు. అయితే ఇప్పుడు జనసేనాని వేస్తున్న వ్యూహంలో అధికారం పార్టీ ఇరుక్కొని గిలగిల కుట్టుకుంటుంది అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. న్యూ ఏజ్ పోలిటిక్స్ ని అర్ధం చేసుకుంటున్న ప్రతి ఒక్కరు జనసేన వ్యూహాలని అర్ధం చేసుకుంటున్నారు. వైసీపీలో సొంత పార్టీ నేతలే అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రోడ్డెక్కుతున్నారు. జగన్, సజ్జలవిధానాలపై విమర్శలు చేస్తున్నారు. అలాగే అధికార పార్టీ తమ విషయంలో ఎలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది అనేది చూపిస్తున్నారు.
దీని వెనుక జనసేన పవన్ కళ్యాణ్ బలమైన ఆలోచన ఉందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ , నారా చంద్రబాబుని కలిసిన తర్వాత ఏపీలో పొత్తుల వ్యవహారం చాలా బలంగా ప్రజలలోకి వెళ్ళింది. ఈ రెండు పార్టీలు పొత్తు ఖరారు అయిపోయిందని ప్రచారం నడుస్తుంది. సంక్షేమం పేరుతో జగన్ ఇస్తున్న పథకాల వెనుక రహస్యం కూడా బయటపెట్టాడు. ఇవన్ని ప్రజలలోకి బలంగా వెళ్ళాయి. దీంతో అన్ని వర్గాల ప్రజల నుంచి వైసీపీపై వ్యతిరేకత పెరిగింది. ఈ విషయాన్ని గ్రహించిన వైసీపీ ఎమ్మెల్యేలు మెల్లగా తమ కోపాన్ని అధినాయకత్వంపై చూపుస్తున్నారు.
దీనిని మీడియా మొత్తం హైలైట్ చేస్తూ సొంత పార్టీ నేతలే జగన్ రెడ్డి భాగోతాలు బయటపెడుతున్నారు అంటూ ప్రచారం చేస్తున్నాయి. ఇవన్ని ప్రజలలోకి వెళ్తున్నాయి. రానున్న ఎన్నికలలోపు వైసీపీని అన్ని రకాలుగా వ్యూహాత్మక ఎత్తుగడలతో పవన్ కళ్యాణ్ బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. అదే నిజం అయితే జగన్ మేల్కొని వాస్తవం అర్ధం చేసుకునేలోపే జరగాల్సిన నష్టం పార్టీకి జరిగిపోతుంది అని భావిస్తున్నారు.