Huma Qureshi : ఢిల్లీ బ్యూటీ హుమా ఖురేషీ బాలీవుడ్ నటి. మోడల్ గా కెరీర్ ప్రారంభంచి ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి తన నటనతో అందరి మన్ననలను పొందించి ఈ బ్యూటీ. బొద్దుగుమ్మైనా ముద్దుగా ఉండటంతో పాటు ఆక్టింగ్ స్కిల్స్ మెండుగా ఉండటంతో ఈ భామకు అవకాశాలు అందివస్తున్నాయి. తమిళం, మలయాళం, మరాఠీ, హిందీ సినీ పరిశ్రమల్లో ఇప్పటి వరకు 25కు పైగా సినిమాల్లో నటించింది. తమిళ ఇండస్ట్రీలోనూ పలు సినిమాల్లో కనిపించి మెస్మరైజ్ చేసింది హుమా. బిల్లా, కాలా , వలిమై లో కీలక పాత్రలను పోషించింది. హిందీలో గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, బెల్ బాటమ్ ,గంగూభాయ్ కతియావాడీ, డబుల్ ఎక్స్‌ఎల్, మోనికా ఓ మై డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించి నత నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచేసింది హుమా ఖురేషీ.

సినిమాలతో ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడమే కాదు తన ఫ్యాషన్ ఫోటో షూట్ లతోనూ ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది ఈ బ్యూటీ. తాజాగా హుమా ఖురేషీ ఉల్లిపొర చీరకట్టుకుని తన వయ్యారాలు చూపిస్తూ కుర్రకారు మనసును దోచేస్తోంది.

హుమా ఖురేషీ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌కు ప్రసిద్ధి చెందింది. సొగసైన గౌన్‌ల నుండి పండుగ దుస్తుల వరకు, హ్యూమా యొక్క ఫ్యాషన్ డైరీలు అన్ని రకాల సందర్భాలలో ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లను పుష్కలంగా అందిస్తుంటాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. నటి ఏ రూపొంలో కనిపించినా అదరగొట్టగలదు. హుమా లేటెస్ట్ గా ఆరు గజాల చీరను అందంగా కట్టుకుని అద్భుతమైన ఎత్నిక్ ఫ్యాషన్ లుక్స్ ను అందించి ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించింది.

హ్యూమా ఫ్యాషన్ డిజైనర్ అబి జానీ సందీప్ ఖోస్లాకు మ్యూజ్ గా వ్యవహరించింది. తన ఫోటో షూట్ కోసం ఈ చిన్నది షీర్ బ్లాక్ సీక్విన్డ్ చీరను ఎంచుకుంది. బార్డర్స్‌లో టల్లే వివరాలు, చీరంతా బంగారు సీక్విన్ నమూనాల అలంకారాలతో అలంకరించబిన చీరలో ఎంతో హాట్ గా కనిపించింది హుమా. ఈ చీరకు జోడీగా హుమా కార్సెట్ వివరాలు కలిగిన, ఆఫ్ షోల్డర్, డీప్ స్వీట్ హార్ట్ నెక్‌లైన్ తో వచ్చిన మ్యాచింగ్ బ్లాక్ బ్లౌజ్ ను వేసుకుంది. ఈ చీరకట్టుతో దిగిన పిక్స్ ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేసింది హుమా.

ఈ చీరకు మ్యాచింగ్ గా కరిష్మా జ్యువెల్లరీ షెల్ఫ్ నుండి సొగసైన గోల్డెన్ డాంగ్లర్ ఇయర్ రింగ్స్‌ను ఎన్నుకుంది. చేతి వేళ్ళను మల్టిపుల్ ఫింగర్ రింగ్‌లతో అలంకరించుకుంది. హూ వోర్ వాట్ వెన్ అనే ఫ్యాషన్ స్టైలిస్ట్ ఆర్గనైజేషన్ హుమా ఖురేషీకి స్టైలిష్ లుక్స్‌ను అందించింది.

తన కురులతో జెడ వేసుకుని కెమరాకు హాట్ పోజులు ఇచ్చింది ఈ బ్యూటీ . మేకప్ ఆర్టిస్ట్ అజయ్ విశ్వస్రావ్ సహాయంతో, హ్యూమా కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐ లైనర్, మస్కరా వేసుకుంది. పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని తన లుక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది.