Nityamenon : పెళ్లి విషయమై మరోసారి వార్తల్లో నిలిచింది హీరోయిన్ నిత్యామేనన్. అమ్మడిపై ఇటీవల పెళ్లి చేసుకోబోతోందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అమ్మడు కూడా స్పందించింది. నవ్వుతూనే తన పెళ్లి వార్తలను తిరస్కరించింది. ఆ తరువాత ఓ వ్యక్తిపై ఆమె ఆరోపణలు చేసింది. ఇక్కడ మొదలైంది అసలు వివాదం. తనను ప్రేమిస్తున్నానంటూ సంతోష్ వర్కీ అనే వ్యక్తి ఆరేళ్ల నుంచి వేధిస్తున్నాడని హీరోయిన్ నిత్యామేనన్ ఆరోపించింది. ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన పెళ్లిపై జరిగిన ప్రచారంపై ఆమె స్పందించింది. సంతోష్ వర్కీ తనకు 30కి పైగా నంబర్స్ నుంచి కాల్ చేస్తూ విసిగించేవాడని పేర్కొంది. తాజాగా తనపై నిత్యామేనన్ చేస్తున్న ఆరోపణలపై సంతోష్ వర్కీ సైతం స్పందించాడు.
నిత్యామేనన్ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవమూ లేదని.. అసలు ఒకే వ్యక్తి పేరు మీరు సిమ్‌కార్డులు కొనగలడనే విషయాన్ని జనాల విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. నిత్యామేనన్‌కు వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని వాళ్ల తల్లి చెబితే, జరగలేదని తండ్రి చెప్పాడని పేర్కొన్నాడు. అంతేకాకుండా వాళ్లు నాపై లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టాలని చూస్తున్నారన్నాడు. తనకు గతంలో నిత్యామేనన్ అంటే ఇష్టం ఉండేదని.. తనను పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నట్ుట వెల్లడించాడు. కానీ ఇప్పుడు చచ్చినా పెళ్లి చేసుకోనన్నాడు. అసలు నిత్యామీనన్ గురించి ఇవన్నీ ముందే తెలిస్తే ప్రేమించి ఉండే వాడినే కాదు’. అంటూ కామెంట్స్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్లో సంతోష్ వర్కీపై మండిపడుతున్నారు.
Nityamenon : అసలు ఎవరీ సంతోష్ వర్కీ?
నిత్యామీనన్ పెళ్లి వార్తలతో ఒక్కసారిగా సంతోష్ వర్కీ పాపులర్ అయిపోయాడు. ఇతను ఎవరో కూడా జనాలకు చాలా వరకూ తెలియదు. ఈ వార్తల అనంతరం అతను ఎవరే విషయమై సెర్చ్ చేయడం ప్రారంభించారు. సంతోష్ వ్కీ ఒక యూట్యూబర్. సినిమాల రివ్యూస్ చెప్పడంలో మలయాళంలో గుర్తింపు పొందాడు. నిత్యామేనన్ గురించి సంతోష్ వర్కీ చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘అసలు నువ్వు నిత్యామీనన్‌ను రిజెక్ట్ చేయడమేంటి?నీకంత సీన్ ఉందా?’ అని ప్రశ్నిస్తున్నారు. దాదాపు నెటిజన్లు అంతా నిత్యామేనన్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.