Naga Chaitanya : నాగ చైతన్య.. డీసెంట్ అని చాలా మంది చెబుతుంటారు. అది ఎందుకు? అనేది ఆయన ఇంటర్వ్యూలు చూస్తే అర్థమవుతుంది. సమంతతో విడాకుల తర్వాత ఆయన ఎప్పుడూ కూడా మీడియా ముందుకు వచ్చి ఒక్కటంటే ఒక్కమాట కూడా ఆమె గురించి తూలింది లేదు. పైగా సామ్ గురించి ప్రతి ఇంటర్వ్యూలో ప్రశ్నలను ఎదుర్కొన్నా కానీ చాలా డీసెంట్‌గా సమాధానాలిస్తూ పోతున్నాడు. సామ్ కొన్ని ఇంటర్వ్యూల్లో బరస్ట్ అవుతున్నా కూడా చై మాత్రం ఎక్కడ కంట్రోల్ తప్పడం లేదు. దీంతో మన యంగ్ హీరోకి అభిమానుల సంఖ్య మరింత పెరిగి పోతోంది. వీరిద్దరూ విడిపోయి దాదాపు ఏడాది కావొస్తున్నా వీరి విడాకులపై రచ్చ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది.
ఇక నాగ చైతన్య లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌తో చై చాలా బిజీగా ఉన్నాడు. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్‌లో కొత్తగా ఎంట్రీ ఇస్తుండటంతో అక్కడ జరిగే ప్రతి ప్రమోషన్ కార్యక్రమంలోనూ అలాగే ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటున్నాడు. ఇక ఈ ఇంటర్వ్యూల్లో సినిమాకు సంబంధించిన విషయాలే కాకుండా పర్సనల్ లైఫ్‌పై కూడా చై ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే సమంతతో భవిష్యత్తులో నటించే అవకాశం ఉందా అని అడగ్గా అలా జరిగితే క్రేజీగా ఉంటుందని బదులిచ్చిన చై తాజాగా మరోసారి సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Naga Chaitanya : సామ్ అలా.. చై ఇలా.. వీరిద్దరి ఆలోచనలకు ఎంత తేడా?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూకు ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో భాగంగా సమంత మీకు ఎదురు పడితే ఏం చేస్తారు అని అడగ్గా.. ఆమెకు హాయ్ చెప్పి హగ్ ఇస్తానంటూ ఆన్సర్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. దీంతో చై చేసిన ఈ కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో ఇదే ప్రశ్న సమంతకు కూడా ఎదురైన సంగతి తెలిసిందే. దీనికి సామ్ సమాధానమిస్తూ.. మా ఇద్దరిని ఒకే గదిలో ఉంచితే అక్కడ కత్తుల్లాంటివేమీ లేకుండా చూసుకోవాలంటూ తెలిపింది. కానీ చై మాత్రం హాయ్ చెప్పడమే కాకుండా హగ్ ఇస్తానంటూ షాకింగ్ ఆన్సర్ ఇవ్వడంతో వీరిద్దరి ఆలోచనలకు ఎంత తేడా ఉందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.