AP Capital: ఏపీలో అధికార పార్టీ వైసీపీ మూడు రాజధానుల అజెండా పట్టుకొని ప్రజలలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అయితే పేరుకి మూడు రాజధానులతో మూడు ప్రాంతాల అభివృద్ధి అని చెబుతున్న జగన్ ఫోకస్ అంతా విశాఖపట్నం మీదనే ఉందనేది అందరికి తెలిసే నిజం. విశాఖని రాజధానిగా చేసుకొని పరిపాలన మొదలుపెట్టడానికి ఉన్న అన్ని ప్రయత్నాలు ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నారు. ఈ ఉగాది నుంచి విశాఖలో పరిపాలన మొదలుకాబోతుంది అని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇక ఉత్తరాంద్ర నాయకులు అయితే విశాఖపట్నం రాజధాని కావడంపై చాలా సంతోషంగా ఉన్నారు.
భూముల ధరలు పెరుగుతాయి కాబట్టి ఇప్పటి నుంచి విశాఖ పరిసర ప్రాంతాలలో భూములని కొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రాకపోతే విశాఖపట్నం రాజధాని అయ్యే అవకాశాలు పూర్తిగా కోల్పోతుంది అనేది అందరికి తెలిసిన నిజం. ఈ నేపధ్యంలో వైసీపీ నాయకులలో కూడా రాజధాని విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ చాలా ఉంది. అందుకే కొందరు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇదిలా వైసీపీ విశాఖపట్నంని రాజధానిగా చేయడానికి సిద్ధం అవుతుందని, అక్కడ శ్రీకాకుళం నుంచి ఇటు కడప వరకు అందరికి పూర్తిగా క్లారిటీ వచ్చేసింది.
అయితే మూడు రాజధానులు అనేది కేవలం ప్రజలని మభ్యపెట్టడానికి చెబుతున్న మాటే అని అందరూ నమ్ముతున్నారు. ఒక వేళ విశాఖపట్నం వెళ్లి పరిపాలన మొదలు పెడితే పూర్తిగా అదే రాజధాని అని క్లారిటీ వచ్చేస్తుంది. ఈ నేపధ్యంలో ఒక వేళ విశాఖ రాజధాని అయితే గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో వైసీపీ మెజారిటీ స్థానాలలో ఓడిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ జిల్లాల ప్రజలు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో కూడా వైసీపీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం వినిపిస్తుంది.