Indian Railways : సుదీర్ఘ రైలు ప్రయాణాలు అంటే చాలా మంది ఇష్టం. సంవత్సరంలో ఒక్కసారైనా రైళ్లలో ప్రయాణించాలనుకుంటారు. ముఖ్యంగా రైలు ప్రయాణంలో అత్యంత ఉత్తేజకరమైన భాగం తినడానికి లభించే రుచికరమైన ఆహారం అయితే, ఇటీవల రైల్వే ఆహారంలో నాణ్యత క్షీణించడంతో ప్రజలు ఇంట్లోనే ప్రయాణానికి అవసరమైన ఆహారాన్ని తయారుచేసుకుని తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. భారతీయ రైల్వేలు అందించే ఆహారాన్ని ప్రజలు తిరస్కరించడానికి నాణ్యత లోపించడం , రుచి లేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇక తాజాగా ఇటీవల, భారతీయ రైళ్లలో ప్రమాణించే ఓ మహిళా పాసింజర్ రైళ్లలో అందించే ఆహారంలో నాణ్యత తక్కువగా ఉందని తన ట్విట్టర్‌లో ఫిర్యాదు చేసింది.

ట్విటర్ యూజర్ భూమిక రైలులో పప్పు, రోటీ , అన్నంతో సగం తిన్న భోజనం యొక్క ఫోటోను ట్విట్టర్‌లో పంచుకుంది. క్యాప్షన్‌లో, ఆమె అధికారులను ఎత్తి చూపుతూ, మీరు ఈ ఆహారాన్ని ఎప్పుడైనా రుచి చూశారా @IRCTCofficial ను ప్రశ్నించింది. రోజురోజుకు టికెటు ఖర్చు పెరుగుతోంది కానీ మీరు మీ కస్టమర్లకు అందించే ఆహారంలో నాణ్యత పెరగడంలేదని ఫిర్యాదు చేసింది. కొద్దిసేపటికే, ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అయ్యింది. ప్రజలు దీనికి ప్రతిస్పందించడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితులను నివారించడానికి మహిళలు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తీసుకెళ్లాలని కొంతమంది సూచించారు. ఓ ట్విట్టర్ యూజర్, ట్రైన్‌లో అందించే ఆహారం వారి సేవలలాగే దయనీయంగా ఉందని అన్నాడు. రైల్వే ఛార్జీలు భారీగా ఉన్నాయి కానీ నాణ్యత దిగజారుతోంది అని కామెంట్ చేశాడు.

మరో ట్వీట్ ఇలా ఉంది, మురికి వాష్‌రూమ్స్ , ఇంత తక్కువ నాణ్యత గల ఆహారం ఉంటే కస్టమర్ డబ్బు అంతా ఎక్కడికి పోతోంది. మీరు దీన్ని ఎలా పిలుస్తారు? మీరు నిజంగా ఈ ఆహారం తినే ప్రతి ప్రయాణీకుల ప్రతిచర్యను గమనించాలి. వీధి కుక్కలు బాగా తింటాయి దీని కంటే బెటర్ ఆహారం అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. శతాబ్ది , రాజధాని వంటి రైళ్లు కూడా తప్పనిసరి ఆహార సేవను నిలిపివేసినప్పటికీ ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. మీ అందరికీ ఇలాంటి ఆహారాన్ని అందిస్తున్నందుకు సిగ్గుపడుతున్నాను అని ఓ అధికారి ఈ ట్వీట్ కు స్పందించారు. ఐఆర్‌సిటిసి కూడా ఈ ట్విట్టర్ ఫిర్యాదుపై స్పందించింది. దయచేసి PNR మరియు మొబైల్ నంబర్‌ను డైరెక్ట్ మెసేజ్ లో షేర్ చేయండి అని పేర్కొంది.