ఏపీలోని వైసీపీలో అత్యర్యుద్ధం మొదలైందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఓ వైపు ప్రతిపక్షాలు జగన్ ని గద్దె దించే పనిలో చాలా వేగంగా దూసుకుపోతున్నారు. వారి వ్యూహాలకి పదును పెడుతూ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ ప్రజలలోకి వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే అధికార పార్టీ వైసీపీని ప్రజలలో వ్యతిరేకత ఎక్కువైంది. మరో వైపు టీడీపీ, జనసేన పొత్తుతో సమీకరణాలు మారుతున్నాయి. నాయకులు అందరూ వచ్చే ఎన్నికలలో గెలవడానికి ఎవరి వ్యూహాలు వారు సిద్ధం చేసుకుంటున్నారు. మరో వైపు అధికార పార్టీ వైసీపీ తన పొలిటికల్ ప్రచార టీమ్ ఐప్యాక్ సలహాలు, సూచనలు పాటిస్తూ సిట్టింగ్ లు ఉన్న నియోజకవర్గాలలో కొత్తగా ఇన్ చార్జ్ లని తీసుకొచ్చింది. ఆ ఇన్ చార్జ్ ల పెత్తనంతో స్థానిక ఎమ్మెల్యేలకి కనీసం ప్రభుత్వ కార్యక్రమాలకి కూడా ఆహ్వానం అందడం లేదు అనేది చాలా మంది నుంచి వినిపించే మాట.
అయితే జగన్ రెడ్డి ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ లని తప్పించి ఆ ఇన్ చార్జ్ లని రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా నిలబెట్టడానికి ఇప్పటి నుంచే కార్యాచరణ చేసి ప్రజలలోకి పంపించారు. ఈ నేపధ్యంలో అధిష్టానంపై ఎమ్మెల్యేలకి అసహనం పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పటికే నెల్లూరులో వైసీపీలో ఆధిపత్య గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి బయటకి వచ్చేశారు. అయితే వాటిని సరిచేసే పనిలో జగన్ రెడ్డి ఉండగానే ఇప్పుడు కృష్ణా జిల్లా గన్నవరంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది.
వంశీ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. వచ్చే ఎన్నికలలో వంశీకి జగన్ టికెట్ ఖరారు చేశారు. ఈ నేపధ్యంలో గత ఎన్నికలలో అతనిపై పోటీ చేసిన యార్లగడ్డ చాలా గుర్రుగా ఉన్నారు. గత కొంతకాలంగా యార్లగడ్డ, దుట్టా కలుసుకోవడంతో వంశీకి మంట పుట్టిస్తుంది. వారిద్దరూ తనకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో దుట్టా, యార్లగడ్డ లక్ష్యంగా చేసుకొని ఘాటుగా విమర్శలు చేశారు. ఈ నేపధ్యంలో వారు కూడా వంశీపై ఎదురుదాడికి రెడీ అవుతున్నారు. ఈ గొడవలు కృష్ణా జిల్లా మొత్తం పాకి వైసీపీలో అంతర్గత యుద్ధం మొదలయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.