సమ్మెట గాంధీ…టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు ఉండరు. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన కీలక పాత్రలో కనిపించిన వ్యక్తిగా అందరికి సుపరిచితం అయ్యారు. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ఇతని పాత్ర ద్వారానే దర్శకుడు నేరేట్ చేశారు. ఈ సినిమా కంటే ముందుగా అతను రాజన్న సినిమాలో నటించాడు. ఆ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు. అలాగే ఆటోనగర్ సూర్య సినిమాలో కూడా నటించారు. అందులో కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే కనిపించి మెప్పించారు.
అయితే సమ్మెట గాంధీకి మొదటి బ్రేక్ వచ్చింది రాజన్న సినిమాతో అయితే, మంచి హైప్ క్రియేట్ అయ్యింది మాత్రం వకీల్ సాబ్ సినిమా ద్వారానే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏకంగా 10 రోజుల పాటు కలిసి నటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో అతనికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అలాగే బాలకృష్ణ సినిమాలో నటించిన మంచి అనుభవాలు కలిగి ఉన్నారు సమ్మెట గాంధీ కలిగి ఉన్నారు. నాటకరంగం నుంచి సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ పై సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకుంటూ వడివడిగా కెరియర్ లో నిలదొకక్కుకొని మంచి అవకాశాలని సొంతం చేసుకుంటున్నారు. లేటు వయస్సులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం నటుడుగా సక్సెస్ గుర్తింపుని ఆశ్వాదిస్తున్న సమ్మెట గాంధీతో ఆర్ టీవీ మీడియా ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విశేషాలు ఆయన మనతో పంచుకున్నారు. త్వరలో ప్రసారం కాబావోయ్ ఇంటర్వ్యూలో సమ్మెట గాంధీ చెప్పిన విశేషాలని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం