Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈరోజు ఆగస్టు 19వ తేదీ ఎపిసోడ్ లో జరిగిన హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో సామ్రాట్ తింటుంటే పోరా పోతుంది. అప్పుడు వెంటనే తులసి తలపై తట్టి నీళ్లు ఇచ్చి జాగ్రత్తగా అంటే నన్ను ఎవరో తిట్టుకుంటున్నారు తులసి గారు అంటాడు సామ్రాట్. పక్కన వెళుతున్న వెయిటర్ తగిలి తులసి,సామ్రాట్ పై పడబోతుంటే సామ్రాట్ పట్టుకోవడం చూసి చిరాకుగా చూస్తాడు నందు. తర్వాత సామ్రాట్ ఫ్రెండ్ ఎవరు కనిపిస్తే వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడానికి అక్కడ నుంచి పక్కకు వెళతాడు. ఇంతలో నందు వచ్చి తులసి పక్కన కూర్చొని వెటకారంగా ఈ నెలలో ఐదు రాశుల వాళ్ళకి బాగా కలసి వస్తుందట, పట్టిందల్లా బంగారం అవుతుందంట ఈ ఐదు రాశుల వారిలో మీరు కూడా ఉన్నారా అని ప్రశ్నిస్తాడు. తులసి నన్ను దూరం చేసుకున్న నా జాతకాన్ని బాగానే ఫాలో అవుతున్నారు అంటుంది. పాతిక సంవత్సరాలు కలిసి కాపురం చేసిన భార్య గురించి ఆలోచించడం తప్పేమీ కాదు, అది సహజం కూడా,నా జాతకం ఫాలో అవకుండా ,నా అదృష్టం గురించి ఎలా చెప్పగలుగుతున్నారు. అంటే దానికి బదులుగా ఒక పెద్ద బిజినెస్ మాగ్నెట్ కి పార్ట్నర్ అవ్వడం, ఫ్లైట్ ఎక్కడం, క్యాండిల్ లైట్ డిన్నర్లు, తీరని ఆశలు నెరవేరడం, వీటన్నిటిని బట్టి గెస్ చేశా అంటాడు నందు. నన్ను చూస్తే ఈర్షగా ఉందా,ఇంకా ఏమైనా మాట్లాడాలంటే అదే నువ్వు నా మాజీ భార్యవని సామ్రాట్ కి తెలియకూడదు అని నందు చెప్పేలోగా దానికి బదులుగా ఓ మీ భార్య నన్ను రెచ్చగొడుతుంటే నిజం ఎక్కడ బయటపడుతుందో అని కంగారు పడుతున్నారా అంటే థాంక్స్ చెప్పి నందు వెళ్లిపోతాడు. ఒంటరిగా కూర్చున్న తులసిని చూస్తూ లాస్య చిలక ఇక్కడే ఉంది గోరింక ఎక్కడ ఉందో అసలే నందు చిరాగ్గా ఉన్నాడు. అని అనుకుంటూ ఉంటుంది.
తరువాత సన్నివేశంలో ఫుల్ గా మందు తాగిన నందు వాష్ రూమ్ కు వెళితే అక్కడ సామ్రాట్ అద్దం ముందు నిలబడి ఉండడం చూసి ఏం సార్ ఏమైనా తెల్ల వెంట్రుకలు కనబడతాయేమో అని చూస్తున్నారా అయినా కలర్ వేసి మొత్తం కవర్ చేశారు కదా అంటే దానికి సామ్రాట్ మీరేదో బ్యాడ్ మూడ్ లో ఉన్నట్టున్నారు తర్వాత మాట్లాడుకుందాం అని వెళ్తుండగా ఆపి నువ్వు తులసి జోలికి వెళ్లొద్దు అంటే దానికి సామ్రాట్ ఆర్ యు మ్యాడ్ అంటే నాకు మ్యాడ్ కాదు. తులసి నా మాజీ భార్య అంటాడు నందు అప్పుడు సామ్రాట్ ఓ నువ్వేనా తులసిని పెళ్లి చేసుకొని, బాధపెట్టి,ఏడిపించి విడాకులు ఇచ్చింది అని కోపంగా ఇడియట్ అని నందు కాలర్ పట్టుకుంటాడు సామ్రాట్. ఇద్దరి మధ్య చిన్నగా గొడవ పెరిగి నందు సామ్రాట్ ను గట్టిగా తోస్తాడు. గొడవ పెరుగుతుండగా తులసి లాస్య వచ్చి గొడవను ఆపే ప్రయత్నం చేస్తారు. ఓ ఇదంతా నా భ్రమ అని అనుకుంటుంది లాస్య మరొకవైపు తులసి కంగారు గా ఫ్రెండ్ ని కలిసి వస్తానని ఇంతవరకు రాలేదు.ఒకవేళ నన్ను మర్చిపోయి రూమ్ కి ఏమైనా వెళ్లి ఉంటారా అని అనుకుంటుంది లాస్య ఒంటరిగా కూర్చున్న తులసిని చూస్తూ సామ్రాట్ కూడా లేడు ఏమైనా జరుగుతుందేమో అని కంగారుపడుతూ లాస్య తులసితో ఎవరికోసం వెతుకుతున్నావు అనగా సామ్రాట్ గారు అరగంట పైగా అయింది ఇంకా రాలేదు ఫోన్ లిఫ్ట్ చేయలేదు.అంటే దానికి లాస్య కూడా నందు కూడా అంతే అరగంట పైనే అయింది ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకుంటూ ఉండగా మరొకవైపు ఫుల్ గా మందు తాగి సామ్రాట్, నందు నవ్వుకుంటూ ఉంటారు వీరిద్దరిని తులసి ఇంకా లాస్య చూస్తారు. అప్పుడు నందు సామ్రాట్ తో దొరికిపోయాం బ్రో అంటే అంతేనా సరే సరెండర్ అయిపోదాం అనుకుంటారు. సామ్రాట్ ని తులసి ప్రశ్నించగా ఫ్రెండ్ ను కలిసి వస్తుంటే ఒంటరిగా నందు కనిపించాడు కంపెనీ ఇద్దామని కూర్చున్నాను అంతే అంతే నాకు మందు పెద్దగా అలవాటు లేదు ఏదో సంతోషం ఎక్కువయ్యి తాగాలనిపించింది. దానికి నందు నాకు బాధ ఎక్కువై తాగాలా అనిపించింది అంటాడు .అప్పుడు నందు తులసి ఏమీ అనుకోదు అంటే నీకు ఎలా తెలుసు అంటే తాగిన మత్తులో నిజం ఎక్కడ చెబుతాడో అని లాస్య కంగారుపడుతుంది.
తర్వాత నందు సామ్రాట్ లు స్టేజిఎక్కి పాటలు పాడి డాన్సులు చేస్తుంటే పెద్ద మనిషిలాకనిపించే సామ్రాట్ గారు మందేసి ఇలా మారిపోయారు ఏంటి ఆయనతో డాన్స్ చేయడం ఏంటి అంటూ స్టేజి పైనుండి దింపి తీసుకెళ్తారు తులసి, లాస్య.
Intinti Gruhalakshmi:
తర్వాత సన్నివేశంలో అందరూ హోటల్ కు చేరుకుంటారు. తరువాత నందు నువ్వు నా ప్రాణం బ్రో అంటే నువ్వు కూడా నా ప్రాణం,నువ్వు నా అన్నయ్యవి అంటాడు సామ్రాట్ .దానికి బదులుగా నువ్వు నా తమ్ముడివి అని ఇద్దరు కౌగిలించుకుంటారు. వీళ్లు చాలా ఎక్కువ చేస్తున్నారు వీడియో తీసి రేపు వీళ్ళకు చూపిద్దాం అంటే వద్దు లాస్య బాధపడతారు అని ఆపుతుంది తులసి తర్వాత రూమ్లలోకి వెళ్ళబోతుండగా లాస్య ఆపుతుంది ఎందుకు అని ప్రశ్నించగా నందు దానికి కిందటి జన్మలో ట్రాఫిక్ పోలీస్ అయి ఉంటుంది. అందుకే స్టాప్ స్టాప్ అని అంటుంది అంటే దానికి తులసి ఇది మన ఇల్లు కాదు హోటల్ అంటుంది. అప్పుడు నందు మన ఇల్లు ఎక్కడ అని లాస్యను అడగక లిఫ్ట్ ఎత్తే వస్తుంది అంటుంది. లిఫ్ట్ దగ్గర సామ్రాట్ మారం చేస్తాడు లిఫ్ట్ లో అబ్బాయిగా వెళ్లి అమ్మాయిగా మారి వస్తున్నారు. నేను వెళ్ళను అంటాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.