Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అలాంటి ఈ సీరియల్లో ఈరోజు ఆగస్టు 16వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్ శృతి వాళ్ళ ఇంటిదగ్గర కూర్చొని ఉంటే అప్పుడే శృతి ఇంకా వాళ్ళ అత్త లోపలికి వస్తారు. నన్ను చూసి నీ నవ్వు ఆగిపోయింది శృతి అని ప్రేమ్ ప్రశ్నించగా దానికి బదులుగా నా జీవితమే నవ్వుల పాలైపోయింది గా ప్రేమ్ అని బదులిస్తుంది. దానికి ప్రేమ్ నీకోసం నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. అప్పుడు శృతి నేను కూడా చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను అంటే దానికి వాళ్ళ అత్త తన గురించి తప్ప నీ గురించే ఆలోచించే టైమ్ ఎక్కడ ఉంది శృతి అంటుంది. ఇంటికి వెళ్దాం పద శృతి అంటే దానికి మనసు పూర్తిగా నే అంటున్నావా ప్రేమ్ ఒట్టేసి ఒట్టేసి చెప్పు ప్రేమ్ నీ అంతట నీవే వచ్చావా లేదంటే ఎవరైనా చెప్తే వచ్చావా సత్య హరిశ్చంద్రుడివి కదా అని శృతి అత్త అడుగుతుంది. భార్య భర్తల మధ్య ఎన్ని సమస్యలున్నా సర్దుకుపోవాలని అంకిత చెప్పిందని బదులిస్తాడు.
ఆ మాటకు వాళ్ళ అత్త ఎందుకు వచ్చాడో అర్థమైందా అంటే దానికి ప్రేమ్ ఇప్పుడు ఎందుకు మీరు శృతిని రెచ్చగొడుతున్నారు. అంటే దానికి ఇది చాలా బాగుంది మీ వదిన నీకు సలహా ఇస్తే తప్పులేదు కానీ నేను శృతికి తప్ప అప్పుడు చూడండి ఆంటీ ఇది మా భార్యాభర్తల విషయం దయచేసి మీరు జోక్యం చేసుకోకండి. మీ వల్లే మా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అప్పుడు ఉరుము ఉరిమి మంగళం మీద పడిందట మధ్యలో నేనేం చేశాను అంటే దానికి ఆ రోజు శృతిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉందని ఎందుకు చెప్పలేదు. ఆ రోజే ప్రాబ్లం సాల్వ్ అయ్యేది అంటే దానికి నేను శృతిని వెతుక్కుంటూ వచ్చాను అని అనలేదు.
శృతి మా ఇంట్లోనే ఉంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అంటూ ఎన్ని వంకర మాటలు చెప్పావు తాగి శృతిని నోటికొచ్చినట్లు మాట్లాడింది నువ్వు శృతి ఇంటి నుంచి బయటకు రావడానికి కారణం నువ్వు ఇప్పుడు ఆ నేరాన్ని నా నెత్తి మీద చేస్తున్నావా చూసావా అమ్మ మీ ఆయన తెలివి నిన్న నా మీద వేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నాడు. పెద్దవారు భార్యాభర్తల మధ్య గొడవ వస్తే నచ్చజెప్పి పంపాలి కానీ ఇలా రోజుల తరబడి మీ ఇంట్లోనే ఉంచుకుంటే ఏమిటి అర్థం మీకైనా తెలివి ఉండాలి కదా. అప్పుడు శృతి కోపంగా ప్రేమ్ పెద్ద చిన్న తేడా లేదా నువ్వు మాట్లాడుతుంది మా కౌసల్య అత్తతో, తాను ఎంత బాధ పడుతుందో తెలుసా అంటే దానికి ప్రేమ్ నా బాధ కనపడడం లేదా శృతి నేను ఎంత ఫీలవుతున్నానో తెలుసా అంత బాధ పడుతున్న వాడివి ఇంత నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చోవయ్యా, అరే కూరగాయల బ్యాగు పోతేనే దొరికేదాకా వెతుకుదాం.
అందుకు ప్రేమ్ మీరు మా ఇద్దరినీ కలపాలనుకుంటున్నారా లేక శాశ్వతంగా విడగొట్టాలి అనుకుంటున్నారా అంటాడు. అప్పుడు కూడా మీ నాన్నను సపోర్ట్ చేసి నీకు అశ్విన్ కు పెళ్లి జరిగేలా చేసింది ఇప్పుడు ఇంతే అనేలోగా శృతి ప్రేమ్ నువ్వు గొడవ చేయడానికి వచ్చావా దయచేసి వెళ్ళిపో. తర్వాత సన్నివేశంలో నందు వైజాగ్ లో ఈ ఒక్క హోటల్ మాత్రమే ఉందా వేరే హోటల్స్ లేవా అని అనుకుంటూ ఆమాత్రం కామన్సెన్స్ లేదా రూంలో కూర్చుంటే లాస్య పిక్కు తింటుంది అనుకుంటూ తులసి రూమ్ కాలింగ్ బెల్ కొడతాడు. తులసి వచ్చి డోర్ తీస్తుంది. తులసి ఏం కావాలని అడగక ఒకసారి సామ్రాట్ గారితో మాట్లాడాలి అంటే లోపలికి రమ్మని అంటుంది. సామ్రాట్ నందుతో రెండు నిమిషాలు ముందు రావాల్సింది అంటే అసలే ఇరిటేట్ గా ఉంది మిస్ అవ్వడం ఏంటో అర్థం కావడంలేదని అనుకుంటూ ఉంటాడు.
కాఫీ కావాల నందు అని అడిగితే వేడివేడి కాఫీ తాగడం కూడానా ఒళ్ళు మండిపోతుంటే దానికి నందు ఏమాలోచిస్తున్నారు అవును ఎందుకొచ్చారు అని అడగక దానికి నందు మీకు రూమ్ కంఫర్టబుల్గా ఉందో లేదో చూద్దామని వచ్చాను అంటాడు అప్పుడు సామ్రాట్ వాట్ అని ప్రశ్నించగా రిలాక్స్ అయ్యాక పిలిస్తే మీటింగ్ గురించి డిస్కస్ చేద్దామని అంటాడు. పదానందు వెళ్దాం అంటే ఇది మీ రూమ్ కాదా సార్ అంటే కాదు ఇది తులసి రూము నేను వేరే రూమ్ తీసుకున్నాను ఇందాక ఎవరో రూమ్ చెక్ అవుట్ చేస్తే నేను అది తీసుకున్నాను తులసి గారికి ఇక్కడ ఎలా ఉందో చూద్దామని వచ్చాను పదా వెళ్దాం అంటాడు. పర్లేదు సార్ మీరు వెళ్లి ఫ్రెష్ అవ్వండి నేను వస్తాను అంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. తరువాత లాస్య నందు వద్దకు వచ్చి కామెంట్స్ చేస్తూ ఉంటుంది.
Intinti Gruhalakshmi:
తర్వాత సన్నివేశంలో శృతి ప్రేమ్ ను గెటవుట్ అంటుంది. నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి కాదు క్రియేట్ చేసుకోవడానికి వచ్చావు దానికి ప్రేమ్ మీ అత్త నీ బ్రెయిన్ పాడు చేసింది అంటే దానికి బదులుగా శృతి ఎవరి బ్రెయిన్. పాడయిందో నాకు బాగా తెలుసు. ఒకప్పటి ప్రేమ నన్ను ప్రేమించేవాడు. నేను ఏం చెప్పినా అర్థం చేసుకునేవాడు. నాకు అండగా నిలబడేవాడు. ఎప్పుడూ నాకు పంతాలతో పోలేదు. ఈగో ఫీల్ అవ్వలేదు. పెళ్లి అనేది ప్రేమ బంధం అనే రెండు చక్రాల మీద నడుస్తుంది ఏ చక్రం కింద పడ్డ మన బంధం బతకదు నీ మీద నమ్మకం పోయింది ప్రేమ్ అంటూ నీకు నామీద ప్రేమ కంటే ఈ విషయం ఇంట్లో ఎక్కడ తెలిసిపోతుందో అన్న భయమే ఎక్కువ ఉంది. అది డామినేట్ చేస్తుంది. అందుకే నా ముందు ఇలా నటిస్తున్నావు. నేను నటిస్తున్నానా అంటూ ప్రేమ అడగక దానికి శృతి అవును నీది 100% లవ్ కాదు 100% నటన. కాకపోతే ఇంకేంటి ప్రేమ్ నేను ఇంట్లో ఉన్నానని తెలిసి కూడా తెలియనట్టు నటించావు. ఏ విషయమైనా ఆంటీతో చెప్పుకునే నువ్వు మన గొడవ విషయం ఆంటీ దగ్గర దాచావు. దానికి ప్రేమ్ ఇదంతా మీ కౌసల్య ఆంటీ వల్ల జరిగింది.
శృతి ప్రేమ్ ను అచ్చం వలన నాన్న లాగే బిహేవ్ చేస్తున్నాడు. అది భరించలేక తులసి ఆంటీ కూడా భర్తతో విడాకులు తీసుకుంది. ప్రేమ్ కోపంగా శృతి మనం మన గురించి మాత్రమే మాట్లాడుకుందాం. వేరే టాపిక్ మాట్లాడకు అంటే శృతి ఉన్న మాట మాట్లాడడానికి నీ పర్మిషన్ అవసరం లేదు ప్రేమ్ మళ్లీ మళ్లీ అంటాను వందసార్లు అంటాను. నీవు కూడా మీ నాన్న లాంటివాడివే. నేను కూడా అదే పొగరు భార్య అంటే అదే నిర్లక్ష్యం అంటే ప్రేమ్ కోపంగా శృతి నీకు నాతో రావాలని లేకుంటే మానేయ్ మన బంధం వద్దనుకుంటే ఇక్కడే తెంపెయ్. అంతేకానీ నన్ను మా నాన్నతో పోల్చకు, దూరం చేసుకోవడానికి పనికిరాని వంకలు చెప్పకు, నీకు ఒంటరి బతికే కావాలనుకుంటే అది నీ ఇష్టం, లైఫ్ లో నిన్ను డిస్టర్బ్ చేయను అక్కడ నుంచి వెళ్ళిపోతూ మనం కలుసుకోవడం మాట్లాడుకోవడం ఇదే ఆఖరిసారి గుడ్ బాయ్ అంటూ వెళ్లిపోతాడు. తర్వాత సన్నివేశంలో తులసి హాయిగా నవ్వుకుంటూ తన డైరీ ని ఓపెన్ చేసి తాను ఇంతకుముందు రాసుకున్న ఫ్లైట్ ఎక్కాను అనే దగ్గర టిక్ చేసి హోటల్లో నుంచి బీచ్ వైపు చూస్తూ ఆనందంగా గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది.
తర్వాత సన్నివేశంలో సామ్రాట్ తులసిని బయటకు తీసుకువెళ్లాలని అనుకుంటాడు. మరొక వైపు లాస్య నందుతో వాళ్లు ఉన్నది పక్కపక్క హోటల్స్ లో కాదు పక్కపక్క రూములలో ఎన్ని చోట్ల చూడలేదు. మనం మొగుడు పెళ్ళాం కాబట్టి ముసుగేసి పడుకున్నాం వాళ్లు అలా కాదు కదా నిద్ర పట్టదు. అంటూ కామెంట్స్ చేస్తుంది. తర్వాత సామ్రాట్ తులసి రూమ్ కాలింగ్ బెల్ కొడతాడు అది విని లాస్య బయటకు వస్తుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.