Keerthi Suresh : ఇటీవలి కాలంలో హీరోయిన్ల పెళ్లి వార్తలు తరచుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తొలుత అనుష్క పెళ్లి ఖాయమైపోయిందంటూ.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఆ తరువాత నిత్యా మేనన్ విషయంలోనూ ఇదే తరహాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ ముద్దుగుమ్మ దీనిని కూల్‌గా తీసుకుని అలాంటిదేం లేదంటూ తేల్చేసింది. తాజాగా ఆపిల్ బ్యూటీ హన్సిక పేరు కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయింది. ఓ ప్రముఖ రాజకీయ నేత కుమారుడితో అమ్మడు పెళ్లి పీటలెక్కబోతోందంటూ న్యూస్ వైరల్ అయ్యింది. అయితే దీనికి అమ్మడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.
ఈ క్రమంలోనే పెళ్లి కాబోతోందంటూ హల్చల్ చేస్తున్న వారి లిస్ట్‌లో కీర్తి సురేష్ పేరు కూడా వచ్చి చేరింది. ఆ వెంటనే ప్రస్తుతం వైరల్ అవుతున్న ముద్దుగుమ్మ పేరు కీర్తి సురేష్. అమ్మడు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందనే చర్చ కోలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. తల్లిదండ్రులు నిశ్చయించిన వరుడితోనే అమ్మడు ఏడు అడుగులు వేయటానికి సిద్ధమవుతున్నట్లు టాక్. పెళ్లికొడుకు వ్యాపారవేత్త అని, మరోవైపు రాజకీయాల్లోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అమ్మడికి నిశ్చితార్థం కూడా జరగబోతోందట. ఆ వెంటనే పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తారనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే కీర్తీ సురేష్ ఇంట మంగళ వాయిద్యాలు మోగడం ఖాయం.
Keerthi Suresh : ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా..
అయితే ఈ ప్రచారంపై కీర్తి సురేష్ ఇప్పటి వరకూ స్పందించలేదు. సినీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నటి కీర్తీ సురేష్ తొలుత మలయాళం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత తమిళం, ఆపై తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డును సైతం కీర్తి సురేష్ అందుకుంది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్ జంటగా మామన్నన్ చిత్రంలో నటిస్తోంది. కెరీర్ అద్బుతంగా సాగిపోతున్న ఈ తరుణంలో అమ్మడి పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. మరి వీటిలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.