Krithi Shetty : ఇటీవలి కాలంలో కొందరు ముద్దుగుమ్మలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది అందరికీ కలిసి రావడం కొందరు అందంగా తయారవుతుంటే మాత్రం మరికొందరు భయంకరంగా తయారవుతున్నారు. ఆ తరువాత మీడియా ముందు మొహం చూపించలేక సైడ్ అయిపోతున్నారు. ఇక ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టికి అందం ఏం తక్కువైందో కానీ ఈ ముద్దుగుమ్మ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అమ్మడికి తొలి సినిమాయే బ్లాక్ బస్టర్ హిట్.. ఇక తరువాతి సినిమాలు ‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగ రాయ్’ సైతం హిట్ కొట్టడంతో హ్యాట్రిక్ కొట్టింది. అయితే నాలుగో సినిమా రామ్‌తో చేసిన ‘ది వారియర్’ మూవీ మాత్రం పెద్ద దెబ్బే వేసింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ద్విభాష చిత్రం అతి పెద్ద డిజాస్టార్‌గా నిలిచింది. ఒక్క సినిమా అటు ఇటు అయినా నష్టం లేదనుకోండి. ఈ ముద్దుగుమ్మ మాత్రం యూత్ హృదయాల్లో పెద్ద పీటే వేసుకుని కూర్చొంది. ఆమె అందం, అభినయానికి ఫిదా అవుతోంది యూత్. అయితే ‘ది వారియర్’ సినిమాతోనే వచ్చింది అసలు చిక్కంతా. డిజాస్టర్ అయినా నష్టం లేదనుకుంటే ఈ సినిమాలో అమ్మడి లుక్‌పై కామెంట్స్ మొదలయ్యాయి. అమ్మడి లుక్ అంతగా బాగోలేదని ఆమెకే డైరెక్ట్‌గా పలువురు సూచించారట. ఇంకేముంది.. ఈ ముద్దుగుమ్మ హర్ట్ అయిపోయి.. అందానికి ప్లాస్టిక్ సర్జరీతో మెరుగులు దిద్దించుకునేందుకు సిద్ధమవుతుందనేది టాక్.
Krithi Shetty : డాక్టర్ని సంప్రదించేసిందట..
ముఖ్యంగా అమ్మడి పెదవులు కాసింత పెద్దగానే ఉంటాయి. తొలి మూడు సినిమాలు ఈ హిట్ అయినప్పుడు ఈ విషయాన్ని అంతా లైట్ తీసుకున్నారు. నాలుగో సినిమా డిజాస్టర్‌తో ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. దీంతో అమ్మడు తన పెదాల పరిమాణాన్ని తక్కించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. దీనికోసం ఇప్పటికే ఓ ఫేమస్ డాక్టర్‌తో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయట. త్వరలోనే సర్జరీ ఉండబోతోందని టాక్. మరి ఇదే నిజమైతే.. అమ్మడు అందమైన పెదాలతో తిరిగొస్తుందో.. మరింత మందమైన పెదాలతో తిరిగొస్తుందో చూడాలి.