Hero Ram కుర్ర హీరో రామ్ పోతినేని మంచి జోష్ మీద ఉన్నాడు. వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ లైఫ్‌ని బిజీబిజీగా గడిపేస్తున్నాడు. అయితే రామ్ లవ్‌లో పడ్డారని.. తాజాగా పెళ్లికి కూడా సిద్ధమయ్యాడని నెట్టింట్లో న్యూస్ తెగ వైరల్ అవుతోంది. మరి దీనిపై రామ్ స్పందించి మ్యాటర్‌కి క్లారిటీ ఇచ్చేశారు.
కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు రామ్. తాజాగా ఆయన నటించిన చిత్రం ది వారియర్. ఈ సినిమలో రామ్ సరసన హీరోయిన్ కృతిశెట్టి నటించగా, ఆది పిన్నిశెట్టి, అక్షరా గౌడ, నదియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అన్నీ అయిపోయాయి. ఈ సినిమాపై రామ్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా ఈ మధ్య రామ్ లవ్, పెళ్లికి సంబంధించిన న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ టాపిక్స్‌పై రామ్ తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ క్లారిటీ కూడా ఇచ్చేశారు. తాను సినిమాల్లోనే బిజీగా ఉండబోతున్నట్లు రామ్ చెప్పారు. సినిమాలు తప్ప వేరే ఆలోచన లేదని.. పెళ్లి గురించి ఇంట్లో కూడా ఎలాంటి డిస్కషన్ లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక తన చిన్న వయస్సులో స్కూల్‌కు సరిగ్గా వెళ్లేవాడిని కాదన్న ఆయన.. అలాంటప్పుడు లవ్ ఎలా ఉంటుందని చెప్పాడు. మొత్తానికి ది వారియర్ సినిమా ప్రమోషన్స్ చేసుకున్న పనిలోపనిగా తన లవ్, పెళ్లిపై కూడా అందరికీ ఓ మెసేజ్ ఇచ్చేశారని అంతా అనుకుంటున్నారు.
వారియర్ సినిమా తర్వాత రామ్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అదింకా ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఆ తర్వాత హరీశ్ శంకర్ డైరెక్షన్లో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. సో ఒక దాని తర్వాత మరొక సినిమాలు చేస్తూ రామ్ బిజీగానే ఉంటున్నారని చెప్పొచ్చు.