Jacqueline Fernandez : శ్రీలంకన్ బ్యూటీ బాలీవుడ్ బోల్డ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన సోయగాలతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతోంది. తన లేలేత అందాలను ప్రదర్శించి కంటికి కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఈ చిన్నది చేసిన హాట్ ఫోటోషూట్ పిక్స్ మరోసారి ఇంటర్నెట్‌ను ఉర్రూతలూగించింది. బంగారు వర్ణంలో అద్భుతమైన డిజైన్స్ తో రూపొందించిన డిజైనర్ అవుట్‌ఫిట్‌ను ధరించి తన అందాలను ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ.
ఫ్యాషన్ తో ప్రయోగాలు చేయడంలో జాక్వెలిన్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. సాహసోపేతమైన ఫ్యాషన్ ఎంపికలతో అందరిని ఫిదా చేస్తుంటుంది ఈ బ్యూటీ. జాక్వెలిన్ ధరించే ప్రతి అవుట్‌ఫిట్ లో అద్భుతంగా కనిపించేలా తనను తాను అందంగా మార్చుకుంటుంది. ఆ సామర్థ్యమే ఆమెను అభిమానులు ప్రశంసించేలా చేస్తుంటుంది.
లేటెస్ట్ గా చేసిన ఫోటో షూట్ కోసం జాక్వెలిన్ అప్సరస లుక్‌ను ఆలింగనం చేసుకుంది. పూసల అలంకారాలు, సీక్విన్‌లతో డిజైన్ చేసిన ఈ బంగారు గౌనులో జాక్వెలిన్ ధగ ధగా మెరిసిపోయింది. ఆఫ్ షోల్డర్, హాల్టర్ నెక్‌లైన్ , నడుము వద్ద వచ్చిన కటౌట్ డీటైల్స్ తో పాటు థై హై స్లిట్ అమ్మడి అందాలను ఎలివేట్ చేస్తున్నాయి. ఈ అవుట్‌ఫిట్‌తో ఇన్‌డోర్‌లో గోల్డెన్ లైటింగ్‌తో చేసిన ఫోటో షూట్ పిక్స్ ను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసింది జాక్వెలిన్. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బ్యూటీ అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. టైట్ ఫిట్టింగ్ డ్రెస్ లో టెంప్ట్ చేస్తున్న బ్యూటీ అందాలు చూసి కుర్రాళ్ళు మూర్చపోతున్నారు.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ గోల్డెన్ గౌనుకు మరింత వన్నె తెచ్చేందుకు రెట్రో మేకప్‌లో రాయల్టీని లుక్‌ను అందిస్తోంది. ఈ మేకమ్ తో ఫ్యాషన్ ప్రియుల మనసులను దోచేస్తోంది ఈ శ్రీలంకన్ బ్యూటీ. తన కనులకు నిగూఢమైన స్మోకీ ఐ ష్యాడో, పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని తన కురులను అలా వదులుకుని తన హాట్ లుక్స్ తో అత్యద్భుతమైన ప్రకంపనలను సృష్టిస్తోంది జాక్వెలిన్.
శ్రీలంకన్ బ్యూటీ అయిన జాక్వెలిన్ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. అనంతరం బాలీవుడ్‌లో నటిగా అలావుద్దీన్ తో పరిచయం అయ్యింది.హౌస్ ఫుల్, మర్డర్ 2, రేస్ 2, కిక్, బ్రదర్స్, భాగీ 2, బచ్చన్ పాండే, రామ్ సేత్, సర్కస్ వంటి చాలా వరకు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. తెలుగులోనూ ప్రభాస్ తో జోడీ కట్టి ఓ ప్రత్యేక గీతంలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. తన అందాలతో, నటనతో, డ్యాన్స్ మూవ్స్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. సినిమాలతో పాటు బుల్లితెరపైన డ్యాన్స్ ప్రోగ్రామ్ కు వ్యాఖ్యాతగాను, ప్రైవేట్ ఆల్బమ్స్ లోనూ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చి అదరగొట్టింది ఈ చిన్నది. తాజాగా అక్షయ్ కుమార్ , ఇమ్రాన్ హష్మీ నటించిన సెల్ఫీ చిత్రంలో ప్రత్యేక పాటలో కనిపించి కుర్రాళ్ళను హుషారెత్తించింది.