Jacqueline Fernandez : బాలీవుడ్ నటి, శ్రీలంకన్ బ్యూటీ చీరకట్టు కట్టి తన అందాల కనికట్టుతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2023 కోసం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందమైన చీరకట్టుకుంది. ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఈ అందగత్తెను ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు. ప్రింటెడ్ చీరకు చమత్కారమైన ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన బ్లౌజ్‌ని జతచేసింది జాక్వెలిన్.
నేవీ బ్లూ వైట్ ప్రింటెడ్ రంగుల్లో వచ్చిన ఈ ఆరు గజాల చీరను అత్యంత స్టైలిష్‌గా కట్టుకుంది జాక్వెలిన్. విభిన్నమైన మల్టీ-హ్యూడ్ బ్లౌజ్ తన లుక్కు మరింత అట్రాక్షన్‌ను తీసుకువచ్చింది. మినిమల్ యాక్సెసరీలను ఎంచుకుని తన అందాలను ఎలివేట్ చేసింది. ఈ లుక్స్ కు సంబంధించిన పిక్స్‌ను ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. అమ్మడి చీరకట్టు అందాలను చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
కోట్లాది రూపాయల మనీలాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో జాక్వెలిన్ పేరు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు మరింత పాపులారిటీ పెరిగిందనే చెప్పాలి. ఈ చిన్నది ఎక్కడ కనిపించినా మీడియా ఈమెను హైలెట్ చేస్తూనే వస్తోంది. తాజాగా జాక్వెలిన్ సంప్రదాయ చీర కట్టుకుని ఓ ఈవెంట్లో కనిపించింది. చాలా వరకు ఫ్యాన్స్ ఆమె అందాలకు ఫిదా అయితే, ఆమె మనోహరంగా కనిపించినప్పటికీ, నటిని ట్రోల్ చేసే ఒక వర్గం నెటిజన్లు లేకపోలేదు. ఒక వినియోగదారు ఇది కూడా సుఖేష్ ఇచ్చిన గిఫ్టా అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు.
ఇక జాక్వెలిన్ చీరకు సంబంధించిన వివరాలను గమనిస్తే , నీలం రంగులో తెలుపు రంగు ప్రింటెడ్ డీటైల్స్‌తో అలంకరించిన ఈ చీరకు సీక్విన్స్ మరింత అందాన్ని తీసుకువచ్చాయి. చీర సరిహద్దులపై ఎంబ్రాయిడరీ చేసిన ఫ్రిల్డ్ టల్లే పట్టీలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఆమె సంప్రదాయబద్ధంగా చీరను కట్టుకుని దీనికి జోడీగా రౌండ్ నెక్లైన్, సీక్విన్ డీటైల్స్‌తో హాఫ్ లెన్త్ స్లీవ్స్‌తో డిజైనర్ చేసిన బ్లౌజ్‌ను వేసుకుని తన ఎత్నిక్ లుక్స్ తో ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేసింది.
ఈ చీరకట్టుకు సెట్ అయ్యేలా సొగసైన బంగారు బ్రాస్లెట్, పాదాలకు హై హీల్స్ చెవులకు స్టేట్మెంట్ గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. కనీస ఉపకరణాలతో తన లుక్ ను కంప్లీట్ చేసింది. జాక్వెలిన్ గ్లామ్ పిక్స్ కోసం కనులకు స్మోకీ ఐ షాడో, వింగెడ్ ఐలైనర్, కనురెప్పల మీద భారీ మాస్కరా దిద్దుకుని, కనుబొమ్మలను డార్క్ చేసుకుంది. పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని తన గ్లామరస్ లుక్స్ తో నెట్టింట్లో మంటలు రేపింది.