Jacqueline Fernandez : బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన అసాధారణమైన స్టైలిష్ లుక్స్ తో అభిమానులను అమితంగా ఆకట్టుకుంటుంది. పార్టీ మినీ డ్రెస్ ల నుండి సొగసైన గౌన్ల వరకు ఎలాంటి దుస్తులలోనైనా అద్భుతంగా కనిపించగల సామర్ధ్యం ఈ భామ సొంతం. ఇటీవల ఈ బ్యూటీ తొడ-ఎత్తైన చీలికతో టీ-గ్రీన్ గౌను ధరించిన కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఉత్కంఠభరితంగా భంగిమలతో ఈ బ్యూటీ కెమెరాకు పోజులు ఇచ్చి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.ఈ అందమైన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి, ఆమె అందానికి , ఫ్యాషన్ సెన్స్‌కు ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
రీసెంట్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అద్భుతమైన ఈవెనింగ్ గౌనులో అత్యంత అద్భుతమైన రెడ్ కార్పెట్-విలువైన చిత్రాలను పంచుకుని ఫాలోవర్స్ కు పిచ్చెక్కించింది.
మృదువైన సిల్క్ మౌస్లైన్తో తయారు చేసిన అద్భుతమైన టీ-గ్రీన్ గౌను లో అంతే అద్భుతంగా కనిపించింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్ . భుజాలపై డ్రామాటిక్ రఫుల్ వివరాలు, కటౌట్ డీటెయిల్స్ తో తొడ ఎత్తు వరకు వచ్చిన చీలికతో ఈ గౌన్ ను డిజైనర్ రూపొందించారు.
తన రూపాన్ని మరింత అట్రాసిటివ్ గా మార్చుకునేందుకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కళ్లు చెదిరే డ్రాప్ డైమండ్ ఇయర్ రింగ్స్ ను అలంకరించుకుంది. పాదాలకు అందమైన హీల్స్ ధరించింది వయ్యారాలు పోయింది. ఈ ఉపకరణాలు ఆమె రూపానికి అదనపు ఆకర్షణను జోడించాయి.
సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ షాన్ ముత్తతిల్ సహాయంతో, జాక్వెలిన్ తన అందాలకు మెరుగులు దిద్దింది. పెదాలకు మాట్ న్యూడ్ లిప్ షేడ్ దిద్దుకుంది. కనులకు సొగసైన నల్లటి వింగేడ్ ఐలైనర్, కాను రెప్పలకు పింక్ ఐ షాడో పెట్టుకుని తన గిల్మోర్స్ లుక్స్ తో సోషల్ మీడియాలో ట్రాఫిక్ జామ్ చేసింది.
ఒకవేళ మీరు కాక్టెయిల్ పార్టీకి హాజరవుతున్నట్లయితే, జాక్వెలిన్ దుస్తులను మీరు స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైన రూపాన్ని సాధించడానికి, మీరు కంటికి ఆకట్టుకునే స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ జత చేస్తే పార్టీ లో మీరు అదుర్స్.