AP Capital: ఏపీ రాజకీయాలలో అప్రతిహిత విజయాలతో దూసుకుపోతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అజెండాతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన కూడా మూడు రాజధాని అజెండాతో ప్రజల విశ్వాసాన్ని సొంతం చేసుకున్న దిశగా వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం పరిపాలన రాజధానిగా చేయాలనే లక్ష్యంతో జగన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై పలుసార్లు ముఖ్యమంత్రి జగన్ తన వైఖరిని తెలియజేశారు. విశాఖ నుంచి పరిపాలన కొనసాగించడం ఖాయమని స్పష్టం చేశారు.
అయితే సుప్రీంకోర్టు పరిధిలో ఈ అంశం ఉండడంతో కొద్దిగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఆయన కూడా ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో ఏమాత్రం తగ్గేది లేదు అనే విధంగా ముందుకు వెళుతున్నారు. ఉగాది నుంచి విశాఖపట్నంలో పరిపాలన మొదలవుతుందని ఏపీ మంత్రులు చెబుతూ వచ్చారు. అయితే జూన్ నెల నుంచి విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలుపెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. తాను జూన్ నెలలో విశాఖ షిఫ్ట్ అవుతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
ఇక మూడు రోజులు అజెండాతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నాయకులు అందరికీ కూడా ముఖ్యమంత్రి జగన్ చేశారు. అలాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా అన్ని స్థానాల్లో వైసిపి గెలుపొందాలని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి తేడాలుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టబోతున్నట్లు స్పష్టం చేయడంతో దానికి సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి పాలనకు అవసరమైన సదుపాయాలు ఉన్న కార్యాలయాలను చూస్తున్నారు. మరోవైపు విశాఖ నుంచి పరిపాలన స్టార్ట్ చేయడం ద్వారా పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడులు పెట్టడానికి బలమైన నమ్మకాన్ని అందించాలని అందించాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది.