తోరాలు కింద పడేసిన అసలు దొంగైన మల్లికని జ్ఞానాంబకి పట్టించేస్తుంది జానకి. దీంతో మల్లిక ఏడుస్తూ అత్త కాళ్లు పట్టేసూ కుంటుంది. అత్త క్షమించి వదిలేయడంతో బతుకుజీవుడా అనుకుంటూ గడం నుంచి బయటపడుతుంది. అనంతరం జానకి, రామా మీద విష్ణుకి లేనిపోనివి ఎక్కిస్తుంది మల్లిక. తన ఐపీఎస్ కల గురించి ఆలోచిస్తూ బాధ పడుతున్న రామాని ఓదార్చుతుంది జానకి. అనంతరం ఒకరికి ఒకరు గోరు ముద్దలు తినిపించుకుంటూ పాటేసూ కుంటారు. ఆ తర్వాత ఆగస్టు 10న ఏం జరిగిందో చూద్దాం..
కథలోకి కొత్త క్యారెక్టర్ వచ్చి చేరింది.. ఆ పాత్ర పేరు జెస్సీ. చాలా అందంగా ఉన్న జెస్సీ లొట్టలేసుకుని చికెన్ ముక్కలు తింటూ స్టోరీలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం జెస్సీ నడుచుకుంటూ ఎక్కడికో వెళుతూ ఉంటుంది. అప్పడే బైక్‌పై వచ్చిన ఇద్దరూ దొంగలు ఆమె మెడలోని బంగారు గొలుసుని కొట్టేస్తారు. ఆమె దొంగలు అని గట్టిగా అరుస్తుంది. అప్పడే రామాకి లంచ్ ఇచ్చి వస్తున్నా జానకి అది వింటుంది. దొంగలను చూసి లంచ్ బాక్సుతో గట్టిగా కొడుతుంది. దాంతో వారిద్దరు కిందపడిపోతారు. అనంతరం పెద్ద తాటి కొమ్మని తీసుకుని వారిద్దరిని బట్టుల ఊతికినట్లు ఉతికేస్తుంది. దీంతో ఆ దొంగలు ఆ చైన్‌ని అక్కడే పడేసిపారిపోతారు. అది తీసి జెస్సీకి ఇస్తుంది జానకి. ఆ తరువాత జెస్సీ.. ‘వారిద్దరు ఉన్నారు. మీరు ఒక్కరే ఉన్నారు.అయిన అంత ధైర్యంగా ఎలా కొట్టారు’ అని అడుగుతుంది జెస్సీ. దానికి.. మనలోని పిరికితనమే మనతో భయాన్ని పెంచుతుంది. కాబట్టి ధైర్యంగా ఉంటే ఏదైనా చేయొచ్చని చెబుతుంది జానకి. జానకి ధైర్య సాహసాలు మెచ్చి పొగడ్తలు వర్షం కురిపిస్తుంది జెస్సీ. ఇద్దరూ ఒకర్నొకరు పరిచయం చేసుకుంటారు. మొత్తానికి వీళ్లిద్దరి కలయికతో కథ కొత్త మలుపు తిరగబోతున్నట్లు అర్థం అవుతోంది.
మరోవైపు జానకి మరిది నిఖిల్.. తన లవర్‌తో చాటింగ్ చేస్తూ.. చదువుకుంటున్నానని అబద్ధం చెప్తాడు. చికితా వచ్చి గ్యాస్ సిలిండర్ పెట్టాలని చెప్పిన వినకుండా తనని విసిగించకుండా వెళ్లమని కసురుతాడు. అది చూసి అఖిల్ ఎప్పుడు లేంది ఎందుకు ఇలా ఏకాగ్రతగా చదువుతున్నాడు అనుకుంటుంది జానకి. అనంతరం ఇంటి పనులు చేయాలని మరిదికి హితబోధ చేస్తుంది జానకి. అలా చెబుతున్న మధ్య ఎవరితోనైనా చాటింగ్ చేస్తున్నావా అని అడగగా.. కంగారు పడుతూ లేదు వదిన అని అంటాడు అఖిల్. అది చూసి చాటింగ్ అంటే కంగారు పడుతున్నాడని మరిదిని అబ్జర్వ్ చేస్తుంటుంది జానకి.
రాత్రి కాగానే భర్త చికెన్ పకోడి తీసురావట్లేదని తిట్టుకుంటూ ఉంటుంది మల్లిక. అప్పుడే రామా జానకిని తీసుకుని ఐపీఎస్ క్లాస్‌లకు రాజమండ్రి వెళుతుంటారు. అది చూసి పోలీస్ డ్రెస్ వేసుకుని వెళ్లకపోయావా అని వెటకారం చేస్తుంది. దీంతో రామా.. జానకి నిన్ను తన చెల్లిలా చూస్తోంది. కాబట్టి నువ్వు ప్రేమగా చూడకపోయినా పర్లేదు కానీ.. ఇబ్బంది పెట్టే పనులు చేస్తే బాగోదని వార్నింగ్ ఇస్తాడు. అది విని జానకి నాకు తోబుట్టువు లాంటిది. పోలీస్ డ్రెస్‌లో వెళితే త్వరగా ఐపీఎస్ కావాలని ప్రేరణ వస్తుందని అలా అన్నాను బావగారు అంటుంది మల్లిక అమాయకంగా ముఖం పెట్టి.
ఇంతలో జ్ఞానాంబ, గోవిందరాజులు బయట నుంచి వస్తుంటారు. జానకి, రామా బయటకు వెళ్లడం చూసి.. ఎక్కడికిరా రాముడు అని అడుగుతాడు గోవిందారాజులు. అదే నాన్న జానకిని చదువుకునే చోటికి తీసుకెళుతున్నాను నాన్న అంటాడు రామా. అది వద్దు అంటుంది జ్ఞానాంబ. ఈరోజు వద్దంటున్నావా లేక అస్సలు వద్దంటున్నావా అని ప్రశ్నిస్తాడు రామా. ఏ రోజు వద్దు అని జ్ఞానాంబ అనడంతో షాకైన రామా.. ‘అదేంటమ్మా.. జానకి చదువుకోవడానికి నువ్వు ఒప్పుకున్నావు కదా? ఇప్పుడు వద్దని ఎందుకు అంటున్నావమ్మా’ అని అంటాడు. అంతలో మల్లిక మధ్యలో కలగజేసుకుంటూ.. ‘చీర చిరగడానికి మనసు మారడానికి కారణం కావాలా?. జానకి అత్తయ్య అమ్మలాంటివారు. ఆమె చెబితే మనం వినాలి.. లోపలికి వెళ్లి పనిచూసుకో జానకీ’ అని వెటకారంగా అంటుంది మల్లిక.
ఆడపిల్లలు అర్థరాత్రి బయటకు వెళ్లడం మంచిది కాదు. అన్ని సమయాలు మనకు అనుకూలంగా ఉండవని అంటుంది జ్ఞానాంబ. పర్లేదమ్మా.. నేను ఉన్నాను చూసుకుంటాను అని రామా అనేసరికి.. ‘నువ్వు పగలంతా కొట్టులో పనిచేసి.. రాత్రి పూట జానకిని రాజమండ్రి వరకూ బండిలో తీసుకెళ్తే అలసిపోవా? నీకు అసలు నిద్ర సరిపోతుందా?. అయినా.. భార్యభర్తలు ఏకాంతంగా గడపాల్సిన సమయం ఇది.. దాన్ని ఇలా తిరుగుతూ వేస్టు చేస్తారా. ఇప్పటివరకూ కోల్పోయింది చాలు.. ఇంకా అన్ని కరెక్టుగా జరగాలి’ అని అంటుంది జ్ఞానాంబ. అది ఆందోళనగా చూస్తుంటుంది జానకి.
ఇక మల్లిక తెగ సంబరపడిపోతూ నీ ఐపీఎస్ కల కలగానే మిగిలిపోతుంది అని అంటుంది. అమ్మా పుల్లల మల్లికా. ‘మీ అత్తయ్య గారు చెప్పింది.. రాత్రి పూట వెళ్లొద్దు.. పగటి పూట వెళ్లి చదువుకోమని.. దానికి అన్ని ఏర్పాట్లు చేసింది’ అని గోవిందరాజులు అనేసరికి మల్లిక ముఖం మాడిపోతుంది. జానకి చాలా సంతోషపడుతుంది. కానీ అకాడమీలో సీటు రావడం కష్టం కదా అంటుంది జానకి. అదివిని గోవిందారాజులు మీ అత్తయ్యగారు తెలిసినవారితో మాట్లాడారు. వారు రేపటి నుంచే క్లాసులకి రమ్మని అన్నారు.
దాంతో.. అది కాదు అత్తయ్య గారూ.. ఇది ఉమ్మడి కుటుంబం.. జానకి చదువుకి లక్షలకు లక్షలు ఉమ్మడి డబ్బుని ఖర్చు చేయడం కరెక్ట్ కాదు కదా అని మల్లిక అంటుంది. దానికి.. నువ్వు ఇలాంటివి అడిగి పుల్లులు పెడతావని ముందే ఊహించా.. అందుకే ప్రభుత్వ ఖర్చుతో జానకి ఐపీఎస్ చదివేటట్లు ఏర్పాట్లు చేశానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. అయితే.. జ్ఞానాంబ.. తన ముఖం చూడకుండానే మాట్లాడడం గమనిస్తుంది జానకి. అదే భర్తకి చెప్పి ఫీల్ అవుతుంది. అత్తయ్యగారు నా చదువుకి మనస్పూర్తిగా ఒప్పుకోలేదని అనిపిస్తుందని రామాతో అంటుంది. జానకి అనుకున్నట్లుగానే జ్ఞానాంబ ఇబ్బంది పడుతుందా.. నిజమే అయితే దానికి కారణమేంటో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే..