రాఖీ పండుగ రోజు తమ్ముడికి రాఖీ కట్టిన మల్లిక, జానకిని తన అన్నయ్యకి రాఖీ కట్టలేదని ఏడిపిస్తుంది. దాంతో గుడికి వెళ్లిన తర్వాత జానకిని అన్నయ్యని అక్కడికి పిలిచి అందరికీ సర్‌ప్రైజ్ ఇస్తుంది జ్ఞానాంబ. అయినా అన్నయ్యకి రాఖీ కట్టడానికి నిరాకరిస్తుంది జానకి. మరోవైపు అఖిల్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వడానికి గుడికి వస్తుంటుంది జెస్సీ. ఆ తర్వాత ఆగస్టు 18 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘అన్నాచెల్లెళ్ల బంధం అనేది దేవుడిచ్చిన వరం. అలాంటి బంధం పంతాలు పట్టింపులతో దూరం కాకుడదు’ అని సర్ది చెప్పిన జ్ఞానాంబ జానకి చేతికి రాఖీ అందిస్తుంది. దాంతో అత్త మాట ప్రకారం అన్న యోగికి రాఖీ కడుతూ ఎమోషనల్ అవుతుంది. అనంతరం.. రామాకి క్షమించండని అడుగుతాడు యోగి. ‘నేను మీ అబ్బాయిని అవమానించినందుకు ఎవరైనా అయితే నా చెల్లిపై బాధపెట్టేవారు.. కానీ మీరు అలా చేయలేదు.. కడుపులో పెట్టుకుని తల్లిలా చూసుకున్నారు’ అని జ్ఞానాంబతో అంటాడు యోగి. అనంతరం అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోతాడు. అనంతరం ఆవు పాలతో నిష్టగా పొంగలి తయారు చేసి అమ్మవారికి భక్తి శ్రద్దలతో చేయమని చెప్పి పెద్ద కోడలు బాధ్యతలు అప్పగిస్తుంది జ్ఞానాంబ. అది చూసిన మల్లిక కుళ్లు కుంటుంది.
అనంతరం అందరూ ఎంతో భక్తిగా పూజ కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ అఖిల్ మాత్రం లేటవుంతుందని.. పూజ త్వరగా అయిపోతే వెళ్లి జెస్సీ పుట్టిన రోజు సెలబ్రేట్ చేయొచ్చని టెన్షన్ పడుతుంటాడు. అది గమనించిన రామా, గోవిందారాజులు విషయం ఏంట్రా అని అడిగితే ఏం లేదని దాటవేస్తాడు. అనంతరం జానకిని ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా వెళుతుండగా.. మల్లిక తగలడం వల్ల ఓ బాబు పాలు కిందపడిపోతాయి. దాంతో ఆ బాబు తల్లి అందరినీ కొంచెం పాలు పోయామని వేడుకుంటుంది. కానీ అందరూ నైవేద్యం చేసే పాలు నుంచి తీస్తే ఎంగిలి చేసినట్లేనని ఎవరూ పాలు పోయడానికి ఒప్పుకోరు. అది చూసిన జానకి పాలు పోస్తుంది. అది మల్లిక కంటపడుతుంది. దాంతో జానకిని అత్త దగ్గర ఇరిక్కించే అవకాశం దొరికిందని సంతోషపడుతుంది.
అనంతరం పూజా కార్యక్రామాలు పూర్తి చేసిన పంతులు నైవేద్యం తీసుకురమ్మని అంటాడు. అప్పుడు జానకి పొంగలి ఇవ్వబోతుండగా.. ‘అత్తయ్యగారూ ఎంగిలి పాలతో నైవేద్యం చేయొచ్చా’ అని అమాయకంగా అడుగుతుంది మల్లిక. దాంతో.. ‘నీకేమైనా పిచ్చా.. ఎంగిలి పాలతో నైవేద్యం చేయకూడద’ అని జ్ఞానాంబ మల్లికని తిడుతుంది. దాంతో.. జానకి ఎంగిలి పాలతో నైవేద్యం చేసిందని అస్సలు విషయం చెబుతుంది మల్లిక. నిజంగానే ఆ పాలు ఎంగిలి అయ్యాయా? అని జ్ఞానాంబ జానకిని అడుగుతుంది. అవును అత్తయ్య గారూ.. పసి పిల్లవాడు పాలకోసం ఏడుస్తుంటే కొన్ని పాలు తీసి ఇచ్చానని అంటుంది. ‘నీకు చెప్పింది ఏంటీ.. నువ్వు చేసింది ఏంటీ.. పరమ పవిత్రంగా నైవేద్యం చేయాలని చెప్పాను కదా.. నీ ఆలోచన మంచిదే కానీ.. బయట కొట్టులో కొని పాలు ఇవ్వొచ్చు కదా.. అది అపవిత్రం అవుతుంది అని నీకు తెలియదా?’ జానకిని అని తిట్టిపడేస్తుంది జ్ఞానాంబ.
ఇంతలో మల్లిక.. మీరు పెట్టిన కండిషన్స్‌లో ఒకటి అయిపోయింది. ఇంటికెళ్లి ఓ అంకెను కొట్టేయామని జ్ఞానాంబని రెచ్చగొట్టే ప్రయత్నిం చేస్తుంది. ఇంతలో ఆ బాబు తల్లి అక్కడికి వస్తుంది. ‘మీ కోడలు నా బిడ్డ ప్రాణాలు కాపాడిన దేవతమ్మా.. మీ చిన్న కోడలే నా బిడ్డ పాలను నేల పాలు చేసింది.. బాబు ఏడుస్తుంటే మీ పెద్ద కోడలు పాలు ఇచ్చింది.. నా బిడ్డ ఆకలి తీర్చింది. మీ కోడలు ఆ పని చేయకపోతే నాకు కడుపుకోత మిగిలేది’ అని చాలా బాదపడిపోతుంది. అది విన్న జ్ఞానాంబ కోపం కొంచెం తగ్గుతుంది. కానీ మల్లిక నోట్లో మాత్రం వెలక్కాయపడినట్లైంది. దాంతో గుడిలో తిట్టొద్దని అత్తని వేడుకుంటుంది మల్లిక. అదే సమయంలో పంతులు సీన్‌లోకి వస్తూ.. ‘మానవసేవే మాధవ సేవ అని అంటారు కదమ్మా. పసివాడికి పాలు ఇవ్వడం అంటే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడికి సమర్పించడమే.. అది అపవిత్రం కాదు తల్లీ.. మానవత్వంతో మంచికోసం చేస్తే తప్పేం లేదు’ అని అంటాడు. దాంతో జానకి నైవేద్యం సమర్పిస్తుంది. దాంతో పెద్ద కోడలు మళ్లీ మార్కులు కొట్టేసిందని కుళ్లుకుంటూ ఉంటుంది మల్లిక. అనంతరం భక్తి శ్రద్ధలతో పూజని పూర్తి చేస్తారు. కాగా.. అఖిల్ మాత్రం జెస్సీ బర్త్ డే గురించి కంగారు పడుతుంటాడు. మరోవైపు జెస్సీ గుడికే బయలుదేరి ఉంటుంది. జెస్సీ గుడికి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.