కథలోకి జెస్సీ అనే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. ఆమె బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లిపోతుంటే జానకి వచ్చి వాళ్లని కొట్టి జెస్సీకి గొలుసు వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత జానకిని రామా చదువుకోసమని తీసుకెళుతుండగా.. జ్ఞానాంబ రాత్రి పూట క్లాసులు వద్దని.. పగలు వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు చెబుతుంది. జ్ఞానాంబ తన చదువుకి ఒప్పుకున్నా.. తనతో సరిగా మాట్లాడటం లేదని.. కనీసం తన ముఖం కూడా చూడటం లేదని జానకి ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆగస్టు 11న ఏం జరిగిందో తెలుసుకుందాం..
విడాకులు ఇస్తానని బెదిరించి విష్ణుని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్న మల్లిక.. జ్ఞానాంబకి ఇష్టం లేని నాన్ వెజ్ని తెప్పించుకుటుంది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా భర్త తెచ్చిన బిర్యానీని లొట్టేసుకుని తిట్టుంది. అది ఆల్రేడి చచ్చినకోడి మెల్లగా తినవే అని హెచ్చరిస్తాడు విష్ణు. అయినా వినకుండా ఈ చికెన్ పీసుని చూస్తుంటే నన్ను చిన్న చూపు చూసిన మీ అమ్మ గుర్తొస్తుంది అంటూ గబగబా పీక్కు తింటుంది మల్లిక. దీంతో మల్లిక గొంతుకి అడ్డుపడి ఎక్కిళ్లు వస్తాయి. దాంతో విష్ణు హాలులోని డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి కంగారు నీళ్లు తెస్తుంటాడు. అప్పుడే ఎదురు వచ్చిన జ్ఞానాంబ, గొవిందారాజులు ఏమైందని అడిగితే.. మల్లిక గదిలో కూర్చుని తింటుంది అని చెబుతాడు విష్ణు. దాంతో.. ‘ఇందాక నువ్వు భోజనానికి పిలిస్తే ఉపవాసం అని చెప్పింది.. ఇప్పుడు వీడేమో గదిలో తింటుంది అని అంటున్నాడు.. ఏదో జరుగుతుంది’ అని జ్ఞానాంబ దగ్గర అనుమానం వ్యక్తి చేస్తాడు గోవిందారాజులు. అనంతరం వారిద్దరూ విష్ణు బెడ్రూమ్ దగ్గరకి వెళతారు.
అప్పుడే.. మా అమ్మ వస్తుంది తొందరగా తినవే అని విష్ణు అంటే.. ‘మీ అమ్మ అంటే నేను భయంతో వణికి పోవాలా? మీ అమ్మని చూసి భయపడటం ఒకప్పుడు.. ఇప్పుడు పరిస్థితులు మారాయి.. చిన్న కోడలు తిరుగుబాటు మొదలైంది. సింహాన్ని టచ్ చేస్తే సైలెంట్‌గా ఉంటుందేమో.. కానీ ఈ మల్లికను టచ్ చేస్తే మామూలుగా ఉండదు’ అంటూ పిచ్చిగా వాగుతూ ఉంటుంది. ఇంకేదో అనబోతూ లెగ్ పీస్‌లో నోట్లో పెట్టుకుని తలుపు వైపు చూసేసరికి ఎదురుగా జ్ఞానాంబ ఉంటుంది. అది మల్లిక జడుసుకుని చికెన్ పీస్ కిందపడేస్తుంది.
కోపంగా చూస్తున్నా జ్ఞానాంబని చూడగానే.. మల్లిక వణకిపోతూ అత్తయ్య గారూ అది అని యాక్ట్ చేయడం మొదలుపెడుతుంది. ‘నీకు అసలు బుద్దుందా? ఈ ఇంటి ఆచారాలు సాంప్రదాయాలు మంటకలుపుతున్నావ్.. ఈ ఇంట్లో మాంసం తినరని పెళ్లికి ముందే చెప్పా కదా.. ఆరోజు ఇంట్లో పూజ జరిగినప్పుడు కూడా ఇలాగే చేశావ్.. ఇంకోసారి ఇలా చేయొద్దని చెప్పాను.. ఇప్పుడు మళ్లీ అదే పని చేశావు’ అని తిడుతుంది జ్ఞానాంబ. ‘అది కాదు అత్తయ్య గారూ.. నేను బయటేతిందాం అని అంటే మీ అబ్బాయిగారే.. ఇంటికి తెచ్చారు’ అని విష్ణుపైకి నెట్టేస్తుంది మల్లిక. ఇరుక్కుపోయిన విష్ణు కవర్ చేయడానికి ఏదేదో చెబుతాడు కానీ వర్కౌట్ అవ్వదు. దీంతో మల్లికకి నోరు ఆగక.. తప్పుచేశాం.. మీరే శిక్ష వేసి పాయశ్చితం చేయండి అని మల్లిక అంటుంది. దాంతో ఇంట బయట రెండురోజులు ఏం తినొద్దని శిక్ష వేస్తుంది జ్ఞానాంబ. దెబ్బకి మల్లిక, విష్ణు నోరెళ్లబెడతారు.
మరోవైపు జానకి చదువుకుంటూ ఉండగా.. రామా ఆమెకు బహుమతిగా తలకు పెట్టుకునే చార్జింగ్ లైట్ ఇస్తాడు. పవర్ పోయినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటుందని అది తెచ్చినట్లు చెబుతాడు రామా. దాంతో భర్తని చూసి మురిసి పోతూ.. ‘ప్రేమించే భర్త దొరికితే చాలా అదృష్టం అని అందరూ అంటారు. దాంతో పాటు అర్థం చేసుకునే భర్త దొరికితే అది స్వర్గం. జానకి కలగనని స్వర్గాన్ని ఆ దేవుడు నాకిచ్చాడు’ అని అంటూ రామాని గట్టిగా కౌగిలించుకుంటుంది జానకి. దాంతో రామా ఉక్కిరి బిక్కిరి అవుతూ.. జానకిగారూ మీరు చదువుకోండి టైమ్ వేస్టవుతుంది అంటాడు. దాంతో పుస్తకాలు ముసేసిన జానకి.. ‘మీ గుండె చప్పుడు నాకు ఏం చెప్తుందో తెలుసా? మన మధ్య గాలి కూడా దూరే అవకాశం ఇవ్వొద్దని అంటుంది.. ఈ వెచ్చని కౌగిట్లో మనల్ని మనమే కాదు.. ఈ ప్రపంచం కూడా మర్చిపోవాలి’ చెబుతోంది అంటూ ఇంకా గట్టిగా కౌగిలించుకుంటుంది జానకి.
ఇక ఉదయాన్నే అత్తమామకు కాఫీ తీసుకుని వెళ్తుంది జానకి. అయితే జ్ఞానాంబ.. తన విషయంలో ఎందుకు ముభావంగా ఉంటున్నారో అర్థకావట్లేదు అనుకుంటుంది జానకి. గోవిందారాజులు కాఫీ తాగుతూ చూడు జ్ఞానం నీ కోడలు చదువుతో పాటు అత్తమామ సేవలు కూడా ఎంత చక్కగా చేస్తుందో. అనవసరంగా షరతులు పెట్టావు అంటాడు. దానికి జ్ఞానాంబ ఏం మాట్లాడదు. అప్పుడే వెన్నెల వచ్చి కాలేజ్‌కి వెళ్తున్నట్టు చెప్తుంది. అయితే.. జీన్స్, టీ షర్ట్ వేసుకొని మోడరన్ డ్రెస్‌లో ఉంటుంది. అది చూసి ఏంటే ఆ డ్రెస్సు అంటూ వెన్నెలను వెళ్లి డ్రెస్ మార్చుకోమని చెప్తుంది జ్ఞానాంబ. కూతురు ఏం చెప్పిన వినదు. జానకి కూడా అత్త షరతులకి లోబడి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది.
అనంతరం జానకి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని.. అకాడమీకి వెళ్తూ అత్తమామల ఆశీర్వాదం తీసుకుంటుంది. కంగారులో జానకి టిఫిన్ బాక్స్ మర్చిపోవగా చికితా తెచ్చి ఇస్తుంది. అది చూసిన జ్ఞానాంబ.. మొదటి రోజే నువ్వు తినే టిఫిన్ బాక్స్ మర్చిపోయావ్.. ముందు ముందు నీ చదువులో పడిపోయి ఇంటి బాధ్యతలు ఇంకెన్ని మర్చిపోతావో.. నీ భర్తని ఇంకెంత నిర్లక్ష్యం చేస్తావో అని అంటుంది జ్ఞానాంబ. జానకి ఎప్పటికీ అలా చేయదని రామా అంటే.. ఇంత చిన్న విషయానికి ఏదేదో ఊహించుకోవడం ఎందుకు జ్ఞానం అని గోవిందరాజులు జానకి సపోర్టు చేస్తాడు. దీంతో జ్ఞానాంబ.. ‘నీ కాలేజ్ సీటు గురించి నిన్న మీ ప్రిన్సిపాల్‌తో మాట్లాడాను.. నేను వచ్చి పరిచయం చేస్తాను పదా’ అని జానకితో పాటు కాలేజ్‌కి బయలుదేరుతుంది జ్ఞానాంబ. అది చూసిన మల్లిక బాగా కుళ్లుకుంటూ అత్త వేసిన శిక్షని గుర్తు చేసుకుంటుంది. ఈ పోలేరమ్మ తిరిగి వచ్చేలోపు రెండు రోజులకు సరిపడా తినేయొచ్చు అనుకుంటూ మనసులోనే డ్యాన్స్ వేస్తుంది మల్లిక. ఇంతలోనే చికితాని పిలిచి.. రెండురోజులు పాటు మల్లిక ఏమీ తినకూడదని చెప్పాను.. దానిపై ఓ కన్నేసి ఉంచు అని చెబుతుంది. దీంతో అన్ని తనకు ఇలా ఎదురుతంతున్నాయి ఎంటీ అనుకుంటూ మనసులోనే ఏడుస్తుంటుంది మల్లిక. అత్త శిక్ష ప్రకారం మల్లిక నిజంగానే రెండు రోజులు తినకుండా ఉంటుందా లేక దొంగచాటుగా ఏదైనా తింటుందా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే..