జానకిని కాలేజ్‌లో చేర్పించడానికి వెళ్లిన జ్ఞానాంబ కంటపడుతుంది జెస్సీ. అది కూడా లంగావోణీలో వచ్చిన ఓ అమ్మాయిని అమ్మమ్మ అని ఏడిపిస్తుంటుంది జెస్సీ. అది చూసి జ్ఞానాంబకి ఒళ్లుమండిపోయి జెస్సీతో గొడవేసుకుంటుంది. నువ్వు నాకు కోడలుగా వస్తే చుక్కలు చూపిస్తానని జ్ఞానాంబ.. నువ్వు నాకు అత్త అయితే నీకు మూడు చెరువుల నీళ్లు తాగిపిస్తానని జెస్సీ ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకుంటారు. ఇక ఆగస్టు 15 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
రెండు రోజులపాటు తినకూడదనే అత్త మాటని ధిక్కరించి గబగబ తింటూ ఉంటుంది మల్లిక. అప్పుడే ఇంటికి వచ్చిన జ్ఞానాంబ దగ్గర బుక్ అవుతుంది. దాంతో.. ‘క్షమించండత్తయ్యా.. నేను తిండికి ఆగలేన’ని వేడుకుంటుంది మల్లిక. అది విని జ్ఞానాంబ.. ‘నేను నీ కడపు మాడ్చి చంపేంతా మూర్ఖురాలిని కాను. ఇంటికి వచ్చాక తినమనే చెబుదాం అనుకున్నా. కానీ నువ్వు నా మాట మీరి కక్కుర్తి పడి తినేశావు. అందుకే మొత్తం మూడు రోజులు తినకుండా ఉండాలి’ అని శిక్ష వేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. దాంతో తనని తానే తిట్టుకుంటుంది మల్లిక.
ఇక కాలేజ్‌లో జ్ఞానాంబ తనని అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకుని రగిలిపోతుంటుంది జెస్సీ. ‘ఇప్పటివరకూ మా అమ్మానాన్నే నన్ను తిట్టలేదు.. అలాంటిది ముక్కు మెహం తెలియని ఆమె నాకు పద్దతులు చెప్తుందా?’ అని ఫ్రెండ్‌తో అంటూ జ్ఞానాంబపై మండిపడుతుంటుంది జెస్సీ. ఇంతలో అటుగా వచ్చిన జానకి కంటపడుతుంది. ఇద్దరు ఒకరిని ఒకరు పరిచయం చేసుకుని.. జానకిని అక్కా అని చనువుగా మాట్లాడేస్తుంది. అనంతరం జ్ఞానాంబతో తనకి జరిగిన గొడవ గురించి చెబుతుంది జెస్సీ. జ్ఞానాంబని తిడుతూ మాట్లాడుతుంటే.. తన అత్త గురించే మాట్లాడుతుందని తెలియని జానకి.. ‘పెద్ద వాళ్ల ఏం చెప్పిన మన మంచికే చెబుతారు. అందుకే వాళ్ల మాటలు వినాలి. వీలైతే ఆమె చెప్పిన దాంట్లో మంచిని తీసుకో.. ఏదో ఒకరోజు ఆమె మాటల్లోని మంచిని నువ్వే అర్థం చేసుకుంటావు’ అని జెస్సీని హితబోధ చేస్తుంది. అది విని.. ‘అక్కా.. నువ్వు ఎంత కూల్‌గా చెబుతున్నావు. ఆవిడ మాత్రం నన్ను కొట్టినంత పని చేసింది. నిన్ను చూస్తే ఇన్‌స్పైరింగ్ అని పిస్తే.. ఆవిడని చూస్తే కోపం వస్తుంది’ అని చాలా చిరాగ్గా అంటుంది జెస్సీ. అనంతరం జెస్సీకి బాయ్ చెప్పి ఇంటికి బయలుదేరుతుంది జానకి.
అక్కడ మల్లిక పిండి రుబ్బుతూ కడుపులో ఆకలితో అత్త జ్ఞానాంబని, తోటి కోడలు జానకిని ఆడిపోసుకుంటూ ఉంటుంది మల్లిక. అప్పుడే ఇంటికి వచ్చిన జానకిని పిలిచి.. ‘ఏంటి జానకి ఉద్యోగం ఎక్కడ ఇచ్చారు’ అని వెటకారంగా మాట్లాడుతుంది మల్లిక. దాంతో జానకికి చాలా కోపం వస్తుంది. దాంతో.. ‘చూడు మల్లిక.. నేను ప్రిపేరేషన్‌కి వెళుతున్నానని. ఏగ్జామ్స్‌కి ఇంకా టైమ్ ఉందని నీకు తెలుసు. అయినా ఉదయం ఐపీఎస్ డ్రెస్ వేసుకుని వెళ్లు. ఇప్పుడేమో ఉద్యోగం ఎక్కడ ఇచ్చారని వెటకారం చేస్తున్నావు. అది మంచి పద్ధతి కాదు. మార్చుకుంటే మంచిది’ అని సిరియస్‌గా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జానకి. అయినా మారని మల్లిక .. భూమి తలకిందులైనా సరే నా పగ చల్లారదు అనుకుంటూ జానకిపై ఎలా పగ సాధించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది.
అనంతరం హాలులో ఊయలలో కూర్చుని ఉన్నా అత్తమామకి టీ ఇస్తుంది. అది తీసుకుని.. కాలేజ్ ఏలా ఉందమ్మా అని అడుగుతాడు గోవిందారాజులు. బావుందమ్మా అని చెబుతుంది జానకి. అనంతరం జ్ఞానాంబని ఉద్దేశించి.. ‘నీ కోడలు బంగారం జ్క్షానం. అటు చదువుని, ఇటు ఇంటిపనులని చాలా చక్కగా చేసుకొస్తొంద’ అని జానకిని పొడుగుతాడు గోవిందారాజులు. కానీ.. జ్ఞానాంబ మాత్రం సైలెంట్‌గా ఉండిపోతుంది. అనంతరం వంటపనులు పూర్తి చేసిన జానకి కుటుంబ సభ్యులు అందరికీ వడ్డిస్తుంది. అందరూ కలిసి.. డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తుండగా.. మల్లిక మాత్రం దూరంగా అలా నిలబడి చూస్తూ ఆకలి బాధకి తల్లడిల్లిపోతుంటుంది. అది గమనించిన జానకికి ఎప్పటిలాగే మల్లిక మీద జాలి వేస్తుంది. దాంతో.. ‘అత్తయ్యా గారు.. మీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అని అనుకోను అంటే.. పాపం మల్లిక ఆకలికి తట్టుకోలేదు.. మీరు అనుమతి ఇస్తే.. మల్లికను భోజనానికి పిలుస్తా’ అని అంటుంది. రామా సైతం ‘అవునమ్మా.. మల్లిక తెలియకుండా తప్పు చేసింది ఈసారికి క్షమించు’ అని అంటాడు. దానికి.. ‘అది శిక్ష అని మీ అందరికీ అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఇంటి కట్టుబాట్లని తప్పితే అందరి పరిస్థితి ఇదేనని తెలుసుకుంటారని అనుకుంటున్నా. భవిష్యత్తులో జానకి నా షరతులను మీరిన ఇదే పరిస్థితి’ అని అక్కడున్నా వారందరి గట్టి వార్నింగ్ ఇస్తుంది జ్ఞానాంబ.
అనంతరం జానకి ఏకాగ్రతగా చదువుకుంటూ ఉంటుంది. అది కొంచెం దూరంలో నిల్చుని దిగులుగా గమనిస్తూ ఉంటాడు రామా. అది చూసిన జానకి సైట్ కొడుతున్నారా శ్రీవారు అంటూ చిలిపిగా మాట్లాడుతుంది జానకి. దాంతో.. ‘నా మనసు మీకు తెలుసు జానకిగారూ. అటు ఇంటి పనులు.. ఇటు చదువు. రెండింటితో చాలా కష్టపడుతున్నారు. అది చూడడం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే పరీక్షతో అమ్మాతో మీకు ఇంటి పనులు చెప్పొద్దన చెబుతా’ అంటాడు రామా. కానీ జానకి వద్దంటుంది.. కష్టాలు కలని సాధించి తీరాలనే పట్టుదల ఇస్తుంది. అలాగే.. చదువుతోపాటు ఇంటిపనులు సరిగ్గా నిర్వర్తించి కోడలుగా అత్తయ్యాగారి నమ్మకాన్ని కూడా నిలబెట్టుకొనివ్వండి అంటూ రామాని సముదాయిస్తుంది జానకి. జానకి, రామా సంభాషణని పక్కగా ఉండి వింటూనే ఉంటుంద జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.