అత్త శిక్షని కూడా మీరి దొంగతనంగా అన్నం తింటూ జ్ఞానాంబ కంటపడుతుంది మల్లిక. దాంతో రెండు రోజుల శిక్షని మూడు రోజులుగా చేస్తుంది జ్ఞానాంబ కోపంతో. అలాగే కాలేజ్‌లో జానకి, జెస్సీ మధ్య ఫ్రెండ్ షిప్ అవుతుంది. అనంతరం రాత్రి భోజనం దగ్గర మల్లిక విషయం లాగే అందరితోని, ముఖ్యంగా జానకి విషయంలో తన నిర్ణయాలు అంతే కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తుంది జ్ఞానాంబ. అనంతరం జానకి కష్టాన్ని చూసి కలత చెంది అమ్మకి చెబుతానంటాడు రామా. వద్దంటుంది జానకి. అదంతా పక్కగా నిలుచుని వింటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఆగస్టు 16న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఆకలి తట్టుకోలేక నిద్రపోకుండా నానా తిప్పలు పడుతుంటుంది మల్లిక. కానీ పక్కనే ఉన్న విష్ణు మాత్రం గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు. దాంతో మల్లిక మొగుడ్ని తిట్టుకుంటుంది. కానీ ఆకలి తిర్చుకునే దారెతుకుతూ హాలులోకి వస్తుంది. అక్కడ లైట్ మాత్రమే అటు ఇటు కదలడాన్ని చూసి దయ్యమనుకుని భయపడుతుంది. కానీ నిజానికి అది హెడ్‌లైట్ పెట్టుకొని చదువుకుంటూ ఉంటున్న జానకి. ఆమెని చీకట్లో జానకిని చూసే దయ్యమనుకుని దయ్యం అని అరుస్తూ చాలా పెద్ద గొడవ చేస్తుంది. దాంతో ఇంట్లోని అందరూ వచ్చి ఏంటని ఆరా తీస్తారు. దాంతో అది దయ్యం కాదని.. జానికి గారు చదువుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారని చెబుతాడు రామా. దాంతో ఖంగతింటుంది మల్లిక. ఇలాంటి లైట్స్ కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతుంది మల్లిక.
ఆ తర్వాత జానకి రామా సంభాషణ విన్న జ్ఞానాంబ వాళ్లకి నచ్చిన పని చేస్తుంది. అదే పరీక్షలు అయిపోయే వరకూ ఇంటి పనుల నుంచి జానకికి మినహాయింపునివ్వడం. అందుకే.. ‘జానకికి పరీక్షలు దగ్గరకు వచ్చాయి. అందుకే రేపటి నుంచి ఇంటిపనులు అన్ని నువ్వే చేయాలి’ అని మల్లికకి చెబుతుంది జ్ఞానాంబ. అది విని పర్లేదు అత్తయ్యగారు నేను మ్యానేజ్ చేసుకుంటానని చెబుతుంది జానకి. కానీ.. అదేం వద్దు.. ప్రస్తుతానికి నువ్వు చదువుకో. కానీ మిగిలిన బాధ్యతలని విస్మరిస్తే మాత్రం కుదరదని జానకికి వార్నింగ్ ఇచ్చిన జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో.. ‘నా భయ్యమే నా కొంపముంచింది’ అని కుయ్యో మొర్రో అని తెగ బాధపడిపోతుంది మల్లిక.
ఇక తెల్లవారగానే.. చికితా నీళ్లు పోస్తుండగా మల్లిక ఇళ్లంతా తుడుస్తూ ఉంటుంది. కానీ అత్త మీద కోపంతో చికితాని ఒకటి పీకుతుంది మల్లిక. అంతేకాకుండా మా అత్త మీద కోపం నీ మీద తీర్చుకున్నట్లు చెబుతుంది చికితాతో మల్లిక. దాంతో అంతా జ్ఞానాంబకి చెబుతానని బెదిరిస్తుంది చికితా. దాంతో ‘మా అత్తంటే నాకు భయం అనుకున్నవా. ఏదో పెద్దది కదా అని రెస్పెక్ట్ ఇస్తున్నా. అంతేకాని ఆవిడ అంటే నాకు అస్సలు భయం లేదు అంటుంది’ అంటుంది మల్లిక. అది చాటుగా నిలుచుని వింటుంటాడు గోవిందారాజులు. దాంతో మల్లికకి బుద్ది చెప్పాలని కావాలనే ఆమె తుడుస్తున్న ప్లేస్‌లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. దాంతో మరకలు పడుతుంటాయి. దాంతో మల్లిక వెటకారంగా ఆటో తిరిగినట్లు తిరుగుతారు అని అంటుంది. అంతేకాకుండా జ్ఞానాంబకి చెబుతానని బెదిరిస్తుంది. దాంతో నువ్వు మీ అత్తయ్యని తిట్టిన విషయం వీడియో తీశానని.. మీ అత్తని పిలువు చూపిస్తానని బెదిరిస్తాడు. దాంతో గమ్మున ఉండిపోతుంది మల్లిక.
తర్వాతి సీన్‌లో కొత్త ట్విస్టు. అదేంటంటే జ్ఞానాంబతో గొడవ పెట్టుకున్న జెస్సీని బైక్ మీద తీసుకెళుతుంటాడు అఖిల్. అంటే ఈ పెంకి పిల్లే.. జ్ఞానాంబకి కాబోయే చిన్న కోడలని అర్థమైపోయింది. వాళ్లిద్దరూ చాలా సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. దాంతో చాలా సంతోషంగా రైడ్‌కి వెళుతుంటారు. మరుసటి రోజు జెస్సీ పుట్టిన రోజు కావడంతో ఎలా గడపాలని చాలా ప్లాన్స్ వేసుకుంటారు జెస్సీ, అఖిల్. జెస్సీ బర్త్ డేని చాలా గ్రాండ్‌గా చేయాలని నిర్ణయించుకుంటాడు అఖిల్.
అక్కడ ఇంట్లో వినాయకుడి విగ్రహం పెట్టి పూజకి రెడీ చేస్తుంది జానకి. రాఖీ పండుగని చేసుకోవడానికి ఇంట్లోని అందరినీ పిలుస్తుంది. అది చూసిన గోవిందారాజులు.. ‘జానకిని చూస్తుంటే ఓ వైపు గర్వంగాను.. మరోవైపు బాధగాను ఉంది. జానకి నిజంగా సహనంలో సీతమ్మ తల్లి’ అని జ్ఞానాంబతో అంటాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన మల్లిక ఎప్పటిలాగే తోటి కోడలిని చూసి కుళ్లుకుంటుంది. అనంతరం పూజ చేసిన జానకి రామా, విష్ణు, అఖిల్‌ని కూర్చొబెట్టి వెన్నెలతో రాఖీ కట్టిస్తుంది. అంతేకాకుండా చికితాని తన తమ్ముడు చక్రికి రాఖీ కట్టిస్తుంది. అంతలోనే మల్లిక తమ్ముడు అక్కడికి వస్తాడు. నువ్వొచ్చావేంట్రా అని అడిగితే.. జ్ఞానాంబ పిలిచిందని చెబుతాడు. అది విని మల్లిక… అత్తయ్య గారూ మీరు నిజంగానే దేవత అంటూ తెగ ఓవరాక్షన్ చేస్తుంది. అనంతరం తమ్ముడికి రాఖీ కడుతుంది మల్లిక. అది చూసి తన అన్నకి రాఖీ కట్టే అవకాశం లేదని బాధపడిపోతుంటుంది. అది చూసిన మల్లిక సంతోషపడుతూ జానకిని ఇంకా ఏడిపించాలని అనుకుంటుంది. మల్లిక అనుకున్నట్లే జానకిని బాధపెట్టిందా.. లేక తనే ఎప్పటిలా అందరి ముందు బక్రా అయ్యిందా అని చూడాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే..