పెద్ద కోడలితో చేయించాల్సిన వరలక్ష్మీ వ్రతాన్ని జానకితో కాకుండా మల్లికతో చేయించాలని జ్ఞానాంబ అనుకుంటుంది. అందుకే కావాలనే జానకి రామాని పట్టించుకోనట్లు నటిస్తుంది. చివరికీ రామా చేయి కాలిన దూరంగా బాధపడుతూ చూస్తూ ఉండిపోతుంది. కానీ దగ్గరకి వచ్చి కనీసం ఎలా ఉందో చూడదు. అయితే.. పూజ మల్లిక చేయడం చూసి సవాలక్ష ప్రశ్నలు వేస్తుంది నీలావతి. అది అదునుగా చూసి మల్లిక చేతిలోని అమ్మవారి విగ్రహాన్ని జానకి తీసుకునేలా చేస్తాడు గోవిందారాజులు. ఇక ఆ తర్వాత ఆగస్టు 3న ఏం జరిగిందో చూద్దాం..
‘అమ్మా పుల్లల మల్లిక ఆ విగ్రహాన్ని జానకికి ఇవ్వమ్మా. త్వరగా పూజకి టైం అవుతుంద’ని గోవిందారాజులు అంటాడు. దాంతో చేసేది లేక ముఖం మాడ్చుకుని అమ్మవారిని జానకి చేతిలో పెడుతుంది. జ్ఞానాంబ కూడా సైలెంట్‌గానే ఉండిపోవడంతో.. జానకి అమ్మవారికి అలంకరణ పూర్తి చేస్తుంది. అనంతరం పంతులు వచ్చి.. పెద్ద కోడలు, పెద్ద కొడుకుని వచ్చి పీటలపై కూర్చోమని చెప్తాడు. అయితే.. ఈసారికి చిన్న కోడలు, చిన్న కొడుకు పూజ చేస్తారని చెబుతుంది జ్ఞానాంబ. పెద్ద కోడలు, పెద్ద కొడుకు పూజ చేయడం ఆనవాయితీ కదా అంటాడు పంతులు. కానీ.. అత్త మాటకి ఆనందంలో తేలియాడుతున్నా మల్లిక అడ్డుతగిలిన.. శాస్త్రాలు ఏం గాలిలో నుంచి రాలేదు. అవి మనం పెట్టుకున్నవే కదా పంతులు గారూ.. ఏం పర్లేదు.. మేం కూర్చుంటాం మీరు పూజ కానివ్వండని విష్ణుని బలవంతంగా పీటలపై కూర్చోబెడుతుంది. పంతులు పూజ మొదలుపెట్టి మంత్రాలు చదివిన తర్వాత.. అమ్మవారికి పాటతో పూజ చేయమంటాడు. అయితే.. పాట రాకపోవడంతో మల్లిక బిక్కమొహం వేస్తుంది. దాంతో.. గోవిందారాజులు చెప్పడంతో జానకి పాట అందుకుంటుంది. అది విని అందరూ మంత్రముగ్ధులు అయిపోతారు. దీంతో ఆ అమ్మవారే దిగి వచ్చి ఆశీర్వదించినంత అద్భుతంగా పాడావ్ తల్లీ అని పంతులు పొగడ్తలు కురిపిస్తాడు. దీంతో పెత్తనం తనది అయినా.. పేరు మాత్రం మళ్లీ జానకినే కొట్టేసిందని తెగ బాధపడిపోతుంది మల్లిక. అనంతరం పంతులు సూచన మేరకు మొదట అత్తకు వాయినం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది మల్లిక. అలాగే.. మిగిలిన ముత్తదువులకి కూడా వాయినం ఇచ్చిన మల్లిక వారి ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది.
అది చూసిన గోవిందరాజులు.. నువ్వు కూడా మిగిలిన వాళ్లకి వాయినాలు ఇవ్వమ్మా అని జానకితో అంటాడు. దాంతో జానకి వాయినం తీసుకుని జ్ఞానాంబకి ఇవ్వడానికి చూస్తుండగా.. జ్ఞానాంబ అక్కడ నుంచి పక్కకి వెళ్లిపోతుంది. దీంతో జానకి మిగిలిన వాళ్లకి వాయినం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటుంది. అనంతరం పేరంటాలందరూ సెలవు తీసుకుని వెళ్లిపోతారు. అయితే.. అత్తకి ఇవ్వలేదనే బాధ జానకికి అలాగే ఉంటుంది.
అనంతరం లెక్క ప్రకారం తొమ్మిది మందికి వాయినం ఇవ్వాలి.. మీ అత్తయ్య గారికి ఇస్తే వ్రత ఫలితం దక్కుతుందని గోవిందరాజులు అంటాడు. ఆ పోలేరమ్మ.. వాయినం తీసుకోదు. ఈ హీరోయిన్‌గారికి వ్రత ఫలితం దక్కదు అని సంబరపడుతుంటుంది మల్లిక. అయితే గోవిందారాజులు మాట విన్న జ్ఞానాంబ కావాలనే అక్కడ నుంచి వెళ్లిపోతుంది. చికితా గమనించి.. అమ్మగారు అక్కడున్నారు అని చూపిస్తుంది. గోవిందరాజులు జ్ఞానాంబ దగ్గరకు వెళ్లి.. అక్కడ వ్రతం జరుగుతుంటే నువ్వు ఇక్కడ ఉన్నాం ఏంటి జ్ఞానం అని అడుగుతాడు. పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలని ఇంట్లో వ్రతం చేయించాను. అక్కడ తన అవసరం బాధ్యత అయిపోయాయి కదండీ అని జ్ఞానాంబ అంటుంది. లేదు జ్ఞానం.. నీ బాధ్యత ఇంకా పూర్తి కాలేదు. జానకి ఇచ్చిన వాయినం తీసుకుని వాళ్లని ఆశీర్వదిస్తేనే నీ బాధ్యత తీరినట్టు అని అంటాడు గోవిందారాజులు.
‘పర్వాలేదు లేండి.. వచ్చిన ముత్తదువులకి వాయినాలు ఇచ్చింది కదా. సరిపోతుంది. నేను తీసుకోకపోయిన ఏం పర్వాలేదు’ అంటుంది జ్ఞానాంబ. ‘సరిపోదు జ్ఞానం.. తొమ్మిది మందికి ఇస్తేనే ఆ వాయినం పూర్తి అయినట్టు.. అప్పుడే వ్రతఫలం దక్కుతుంది.. వీటికంటే ముఖ్యంగా.. అమ్మలా నువ్వు ఆశీర్వదించాలి.. అప్పుడు మాత్రమే పిల్లలు సంతోషంగా ఉంటారు.. నువ్వు బాధపడుతూ నీకు నువ్వే శిక్ష వేసుకోవడంతోపాటు.. వాళ్లకి కూడా శిక్ష వేస్తున్నావ్.. ఆ నరకాన్ని వాళ్లు భరించలేకపోతున్నారు.. నువ్వు క్షమిస్తేనే వాళ్లు ఆ నరకం నుంచి బయటకు రాగలరు.. జానకి వరలక్ష్మీ వ్రతం చేస్తుంది తన సౌభాగ్యం కోసం.. అంటే తన భర్త సంతోషంగా ఉండాలని.. అంటే నీ కొడుకు ఆరోగ్యంగా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలనే.. మరి నీ కొడుక్కి నువ్వు ఆశీస్సులు ఇవ్వకపోతే ఎలా జ్ఞానం? నీకు బాధగా లేదా? నీ ప్రాణానికి ప్రాణమైన నీ కొడుకు విషయంలో నీ గుండె అంతగా బండబారిపోయిందా?’ అని అంటాడు గోవిందరాజులు.
‘నా మనసులో ఎంత బాధ ఉందో నాకే తెలుసు.. నా బిడ్డను నేను ఆశీర్వదించలేకపోతున్నందుకు నాలో నేను ఎంత కుమిలిపోతున్నానో నాకు మాత్రమే తెలుసు’ అంటుంది జ్ఞానాంబ. ‘మరి ఇంతలా బాధపడే బదులు వచ్చి వాయినం తీసుకోవచ్చు కదా. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్లు కూడా సంతోషడతారు’ అంటాడు గోవిందారాజులు. ‘ఎలా ఆశీర్వదిస్తాను.. వాడు కనిపిస్తేనే వాడు చేసిన మోసమే నాకు గుర్తుకు వస్తుంది.. నా ప్రేమకి వాడు విలువ ఇవ్వనప్పుడు.. నేను ఇచ్చే ఆశీస్సులకు విలువ ఏం ఉంటుంది’ అని ఎమోషనల్ అవుతుంది జ్ఞానాంబ. దీంతో గోవిందరాజులు.. ‘వాళ్లు చేసింది తప్పే జ్ఞానం. నీకు బాధ కలిగించారు. కాదనను. కానీ.. 9 నెలలు కడుపులో మోసి కన్న కొడుకు వాడు.. 26 ఏళ్లు కళ్లలో పెట్టుకుని చూశావు.. ఒక చిన్న తప్పుకి పేగు బంధాన్ని తెంచేసుకుంటావా? ఆ ప్రేమ బంధాన్ని వదిలేసుకుంటావా? చెప్పు’ అని ఎమోషనల్ డైలాగులు కొడతాడు. మరి జ్ఞానాంబ మనసు కరిగి.. కొడుకు కోడల్ని ఆశీర్వదిస్తుందా లేక తన పంతం నెగ్గించుకుంటుందో.. తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.