పిల్లల్ని కనాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది జానకి. అందుకే రామాని టెంప్ట్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. తన అందంతో కవ్విస్తూ తన దారికి తెచ్చుకునేందుకు ప్లాన్ చేస్తుంటుంది. అందులో భాగంగా.. డైనింగ్ టేబుల్ దగ్గరే ఎవరికి తెలియకుండా చిలిపిగా రామా కాలు తొక్కుతూ, నడుము గిల్లుతూ ఇబ్బంది పెడుతుంది జానకి. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..
రామా ఇబ్బంది పడటం చూసిన జ్ఞానాంబ ఏమైంది నాన్నా అని అడుగుతుంది. కానీ ఏదో చెప్పి కవర్ చేస్తాడు రామా. అయితే.. మల్లికకి మాత్రం వల్ల యవ్వారం కొంచెం తేడాగా అనిపించి టేబుల్ కిందకి చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే.. అక్కడ రామా కాలుని జానకి తొక్కుతూ ఉంటుంది. అది చూసి బావగారి ఇబ్బందికి కారణం ఇదా అనుకుంటుంది. అంతేకాకుండా.. వీళ్ల స్పీడ్ చూస్తుంటే తనకంటే ముందే పిల్లలని కని ఐదు సెంట్ల స్థలాన్ని కొట్టేసేలా ఉన్నారని బాధపడుతుంది. వారి సరసాలకి ఎలాగైనా ఆనకట్ట వేయాలని అనుకుంటుంది.

ఆ తర్వాత షాపుకి వెళ్లేందుకు సిద్ధమవుతాడు రామా.. జానకిని పిలిచి సాయంత్రం త్వరగా ఇంటికి వస్తా రెడీగా ఉండండి జానకి గారు అంటాడు. అది విని మల్లెపూలు తీసుకూ వస్తారా అని చిలిపిగా అడుగుతుంది జానకి. అమ్మకి ఇచ్చిన మాటని పక్కన పెట్టి మీ చదువు మీద కాన్సంట్రేట్ చేయండి అంటాడు రామా. నేను చదువుని పిల్లలని ఒకేసారి మ్యానేజ్ చేయగలను అంటుంది జానకి. అది కుదరదని కోపంగా అంటూ షాపుకి వెళ్లేందుకు సిద్ధమవుతాడు రామా. అది చూసి మీరు బయటికి వెళ్లేటప్పుడు ఎదురమ్మని అత్తయ్యగారు చెప్పారు అంటుంది జానకి. ఇదంతా బయటి నుంచి అరటిపండు తింటూ చూస్తూ ఉంటుంది మల్లిక. ఎలాగైనా వాళ్ల రొమాన్స్ కి అడ్డుకట్ట వెయ్యాలని ఫిక్స్ అవుతుంది. అందుకే ఎదురువస్తున్న జానకి ముందు తొక్కపడేస్తుంది. అది తొక్కి కిందపడుతుంది జానకి. అది చూసి అందరూ హుటాహుటిన అక్కడికి వస్తారు. కాలు బెనకడంతో జానకి బాధని చూసి డాక్టరుకి ఫోన్ చేస్తానంటాడు గోవిందరాజులు. అదేంవద్దు వేడి నీళ్లతో కాపడం పెడితే సరిపోతుంది అంటుంది జానకి. రామాతో పాటు జ్ఞానాంబ, గోవిందరాజులు తెగ కంగారుపడిపోతుండటం చూసి మల్లిక బాగా కుళ్లుకుంటుంది. గుంటూరులో పిడుగుపడితే.. గుడివాడలో గుండెపోటు వచ్చినట్టుగా ఈ పోలేరమ్మ వంటగదిలో నుంచి ఎలా పరుగుపెట్టుకుని వచ్చేసిందో చూశారా? ఎంతైనా జానకే ముద్దుల కోడలు అంటూ తెగ బాధపడి పోతుంది మల్లిక.
అనంతరం నడవడానికి జానకి ఇబ్బంది పడుతుండడంతో.. రామా జానకిని ఎత్తుకుని గదిలోకి తీసుకుని వెళ్తాడు. అది చూసిన మల్లిక.. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరగుతుందని తిట్టుకుంటూ నిలబడి ఉంటుంది మల్లిక. వెంటనే అలా చూస్తావేం.. వెళ్లి వేడి నీళ్లు పెట్టుకురా అని తిడుతుంది జ్ఞానాంబ.
గదిలోకి వెళ్లిన రామా, జానకి కాలుని నొక్కుతూ ఎమోషనల్ అవుతాడు. కిచెన్ లోకి వెళ్లిన మల్లిక, జానకిని కిందపడేసినందుకు చాలా సంబరపడిపోతుంది. నీళ్లు వేడి చేస్తూ పాట పాడుతూ డాన్స్ చేస్తుంటుంది మల్లిక. తర్వాత నీళ్లని తీసుకుని వెళ్లబోతుంటే పొరపాటున కొన్ని వేడినీళ్లు కాలు మీద పడతాయి. దీంతో మల్లిక కుయ్యో మొర్రో అంటూ అరుస్తూ ఉంటుంది. అది విని అక్కడికి వస్తాడు గోవిందరాజులు. ఏమైంది అని అడిగితే బాధపడుతూనే విషయం చెబుతుంది మల్లిక. అయితే మల్లిక ఓవర్ యాక్షన్ చూసి షాక్ అయ్యి చూస్తుంటాడు గోవిందరాజులు. అది చూసి ఇందాక జానకి కిందపడితే ఎలా బాధ పడ్డారు. మీకు పెద్ద కోడలంటే ఉన్న ప్రేమ.. చిన్న కోడలంటే లేదని గింజుకుంటుంది. అబ్బబ్బా.. అపామ్మా రెండు నీ మీద పడ్డది రెండు చుక్కలు మాత్రమే పది లీటర్లు కాదు. దానికి ఎందుకు అంతా అరుస్తావ్ అంటూ వేడి నీళ్లని తానే తీసుకెళ్లి భార్య జ్ఞానాంబ చేతికి ఇస్తాడు.
అనంతరం జానకి గదికి వెళ్లిన జ్ఞానాంబ.. కాపడం పెడతాను కళ్లు ఇటు ఇవ్వమని అడుగుతుంది. అయ్యో వద్దు అత్తయ్య గారూ.. మీకెందుకు శ్రమ అంటుంది జానకి. ‘ఇందులో శ్రమ ఏంటమ్మా.. కూతురికి సేవ చేయడం తల్లికి శ్రమా కాదు? ఏం పర్లేదు నేను మందు రాసి కాపడం పెడతానని అంటుంది జ్ఞానాంబ. పర్లేదు అత్తయ్య గారూ.. నాకు ఇబ్బంది అనిపిస్తే ఆయన ఉన్నారు కదా అని అంటుంది జానకి. దీంతో జ్ఞానాంబ.. సరేనంటూ.. రామాని కొట్టుకు వెళ్లకుండా జానకిని చూసుకోమని చెప్తుంది. అనంతరం రామా.. జానకి కాలికి మందు రాసి కాపడం పెడతాడు.
అయితే బయట జానకి కాలేసిన అరటితొక్కను గమనిస్తూ ఉంటుంది మల్లిక. అసలు తొక్కపై కాలేసినట్టే లేదు.. ఎలా పడిందబ్బా అని అనుమానం పడుతుంది. ఇలా కింద పడడంలో ఏదైనా స్కీం కానీ.. స్కాం కానీ ఉందా అని అనుకుంటుంది. అప్పుడు రామా దగ్గర అసలు విషయాన్ని బయటపెడుతుంది జానకి.
రామా కాలు నొక్కుతుంటే.. చీరను పైపైకి జరుపుతూ.. రామాని కవ్వించే ప్రయత్నం చేస్తుంది. చీరను పైకి ఎత్తి.. మందు రాయండి అని అంటుంది. రామా సిగ్గు పడుతుంటే.. పర్లేదు పైకి రాయండి అంటూ రామాని ఆటపట్టిస్తుంది. అయితే ఇబ్బంది పడతాడు. జానకి నవ్వడం చూసి.. అనుమానంగా అడుగుతాడు రామా. అసలు ఏంటండీ ఇదంతా.. మీకు నిజంగానే దెబ్బ తగిలిందా? కావాలనే చేస్తున్నారా? అని అడుగుతాడు.
మీ మీద ప్రేమతో మీతో ఏకాంతంగా ఉండాలనే ఇలా చేస్తున్నానంటూ తన మనసులో కోరికను బయటపెడుతుంది జానకి. దీంతో రామా.. ఏంటండీ మీరు ఇలా చేస్తున్నారు.. మీకు నిజంగానే దెబ్బ తగిలిందని ఎంత భయపడ్డానో తెలుసా? అని కొడతాడు.. ఆ సమయంలో సడెన్ గా జానకి లేచి వచ్చి రామాని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆ తరువాత ఏం జరిగుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.