జాన కి వెళుతుంది. ఇదంతా చాటుగా గమనించిన మల్లిక అత్త దగ్గరకి వెళ్లి జరిగిన విషయాన్ని చెబుతుంది. ఒకసారి అల్మరా చెక్ చేయమంటుంది. మల్లిక మాట ప్రకారం చెక్ చేసిన జ్ఞానాంబకి జానకి రామా మీద కోపం వస్తుంది. అదే అదనుగా అత్తని జానకి కోచింగ్ తీసుకునే ఇన్స్టిట్యూట్ కి తీసుకెళుతుంది. అదే సమయంలో జానకి ఉత్తమ ప్రతిభ అవార్డు తీసుకుంటూ జ్ఞానాంబ కంటపడుతుంది. ఆ తర్వాత జూలై 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..
‘ఇద్దరి కారణంగానే ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటుంది జానకి. తన తండ్రి చనిపోయినప్పుడు తనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన ఐపిఎస్ చదవాలనే కల చెదిరిపోయింది అని బాధపడ్డాను. కానీ ఆ దేవుడు నా భర్త రూపంలో వచ్చి నన్ను ఆదుకున్నాడు. ఆయనే నా భుజం తట్టి ఆసరాగా నిలిచాడు. ఆయనే లేకపోతే నా జీవితంలో ఐపిఎస్ ఉండేది కాదు. మాకు చాలా అడ్డంకులు ఉన్నప్పటికీ నేను ఇక్కడ ఉన్నానంటే కారణం ఆయనే. ఆయన కోసం కచ్చితంగా ఐపీఎస్ సాధిస్తా’ అంటూ ఎమోషనల్ అవుతుంది. అది చూసి అందరూ చప్పట్లు కొడతారు. ఈ తతంగాన్ని బయట నిలబడి జ్ఞానాంబ, గోవిందరాజులు, మల్లిక చూస్తూనే ఉంటారు. జానకి స్పీచ్ విన్న మల్లిక.. చూశారా అత్తయ్యగారు.. తన చదువు కోసం మీతో గొడవ పడతానని బావగారు మాట ఇచ్చారని జానకి చెబుతోంది అంటూ మల్లిక ఇంకా ఎక్కిస్తుంది. స్పీచ్ అయిపోయిన తర్వాత అత్త అక్కడికి వచ్చిన సంగతిని గమనించి షాక్ అవుతారు జానకి రామా. వాళ్లని కోపంగా చూసిన జ్ఞానాంబ అక్కడి నుంచి నడుచుకుంటూ ఎక్కడికో వెళ్లిపోతుంది.
షాక్ నుంచి తేరుకున్న రామా, జానకీ ఆమె కోసం పరుగు తీస్తారు. అయితే జ్ఞానాంబ ఎక్కడ కనిపించదు. వాళ్లతో పాటు ఓ వైపు గోవిందరాజులు, మల్లిక వెతకడం ప్రారంభిస్తాడు. కానీ జ్ఞానాంబ కనిపించదు. మీ అమ్మ చాలా సెన్సిటివ్ రా రాముడు అంటూ ఆమె ఇంటికి వెళ్ళిందేమో చూడడానికి మల్లిక తో కలిసి కారులో ఇంటికి వెళ్తాడు గోవిందరాజులు. జానకి, రామా అక్కడే తిరుగుతూ కనిపించిన వాళ్లని జ్ఞానాంబ గురించి అడుగుతూ టౌన్ లోనే వెతుకుతూ ఉంటారు. మరోవైపు ఇంటికి వెళ్లిన గోవిందరాజులు.. కూతురు,మూడో కొడుకుని అడిగి జ్ఞానాంబ అక్కడికి కూడా రాలేదని తెలిసి కంగారు పడుతూ ఉంటాడు. అస్సలు ఏమైంది అని వాళ్లు అడగడంతో జానకిని అదిపోసుకోడం ప్రారంభిస్తుంది మల్లిక. ఎంతో నమ్మిన కొడుకు, కోడలు మోసం చేశారని, బాధతో అత్తయ్యగారు ఎక్కడికో వెళ్లిపోయారని చెబుతుంది. ఆపమ్మ.. అంత నీవల్లే జరిగింది అని మల్లికని కసురుతాడు గోవిందరాజులు. అదేంటి మామయ్యా గారు అలా అంటారు, నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని తనని తాను సమర్థించుకుంటుంది మల్లిక.
మరోవైపు రామా, జానకీ రాజమండ్రీ మొత్తం వెతుకుతూ ఉంటారు. ఎక్కడా జ్ఞానాంబ కనిపించకా పోవడంతో చివరికి గోదావరి వైపు వెళ్లి వెతుకుతారు జానకి రమా. సరిగ్గా అదే సమయంలో ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న జ్ఞానాంబ.. ఓ కారు కింద పడబోతుంది. కారు డ్రైవర్ ఆపి.. ‘ఏంటమ్మా.. చావడానికి నా కారే దొరికిందా.. నేను సరైన టైం కి బ్రేక్ వెయ్యకపోయి ఉంటే నువ్వు ఆసుపత్రిలో, నేను జైలులో ఉండేవాళ్ళం. ఏదైనా సమస్య ఉంటే.. ఇంటికి వెళ్లాలి లేదా ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి. ఇలా కారు కింద పడి మా ప్రాణాలు తియ్యకూడదు’ అంటూ తిడతాడు. దాంతో జ్ఞానాంబ గోదావరి ఒడ్డుకు వస్తుంది. అవార్డ్ అందుకున్న తర్వాత జానకి మాట్లాడిన మాటలను గుర్తుచేసుకుని బాధ పడుతుంది జ్ఞానాంబ. అప్పుడే అటుగా వచ్చిన రామా, జానకి ఆమెని చూస్తారు.
‘ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డావు. ఎంత కంగారు పడ్డానో తెలుసా? నిన్ను చూసి చాలా భయపడ్డామో తెలుసా’ అంటాడు రామా. జానకీ కూడా అక్కడే ఉంటుంది. ‘ఈ జ్ఞానాంబ చనిపోయేంత పిరికిది కాదురా.. నన్ను నా నమ్మకాన్ని మోసం చేశారని తెలిసిన క్షణమే చచ్చిపోయాను.. దాని ముందు ప్రాణం పోవడం చాలా చిన్నదిరా..’ అంటుంది జ్ఞానాంబ. ‘దయచేసి అలా మాట్లాడొద్దమ్మా వినడానికే చాలా కష్టంగా ఉంది’ అంటాడు రామా బాధ. ‘నీకు వినడానికే కష్టంగా ఉంటే.. కళ్లారా చూసిన నాకు ఎలా ఉంటుంది.. నువ్వు చేసింది తప్పు కాదురా.. మోసం.. ఈ అమ్మ నమ్మకంతో ఈ అమ్మ ప్రేమతో ఆడుకున్నావ్.. చివరికి ఈ అమ్మని పిచ్చిదాన్ని చేసేశావ్’ అంటుంది జ్ఞానాంబ. ‘లేదమ్మా ఈ లోకంలో మా అమ్మ కంటే మా అమ్మ ప్రేమకంటే నాకు ఏదీ విలువైదని కాదు.. అలాంటి అమ్మ ప్రేమతో నేను ప్రాణాలు పోయినా ఆడుకోనమ్మా’ అంటాడు రామా. ‘మరి నువ్వు చేసింది ఏంట్రా? ఈ అమ్మ భయం నీ జీవితం గురించి.. నీ భవిష్యత్తు గురించి. నీకంటే ఎక్కువ చదువుకున్న అమ్మాయి వస్తే నిన్ను ఎక్కడ చిన్న చూపు చుస్తుందొనన్న భయంతో.. నా తమ్ముడులాంటి పరిస్థితి ఎక్కడ నా కొడుక్కి వస్తుందన్న బాధతో.. నీకంటే తక్కువ చదువుకున్న అమ్మాయితో పెళ్లి చెయ్యాలని అనుకున్నాను.. కానీ తన అన్నయ్య తన చదువు గురించి దాచిపెట్టి మోసం చేశాడు.. తను డిగ్రీ చదివింది అని తెలిశాక నీ భవిష్యత్తు గురించి భయం ఉన్న సరే.. తన మంచితనం మీదున్న నమ్మకంతో ఓ మెట్టు దిగాను.. చదువుకున్న అహంకారంతో నిన్ను అవమానించాదు అని నమ్మాను. నా మనసులోంచి ఆ భయమే ఇంకా పోలేదురా.. కానీ నాకు తెలియకుండా నువ్వు తనని చదివిస్తున్నావా?. అంటే నీ కోసం తల్లడిల్లుతున్న అమ్మ ప్రేమ పిచ్చితనంలా కనిపిస్తుందా ’ అని అరుస్తుంది జ్ఞానాంబ. ‘నీ ఆరాటం బాధ అర్థమయ్యాయమ్మా.. అలాగే నీకు ఇచ్చిన మాట కూడా నాకు గుర్తుంది. ఆ మాట కోసమే జానకీ గారిని చదివిస్తున్నాను’ అంటాడు రామా. ఏంటి నాకిచ్చిన మాట కోసమా అని సందేహంగా అడుగుతుంది జ్ఞానాంబ. అవున్నమ్మా అంటాడు రామా. దీంతో ఏం అర్థం కాకా జానకి, జ్ఞానాంబ షాక్ అయ్యి చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో.. అస్సలు జ్ఞానాంబకి రామా ఇచ్చిన మాటేంటో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.