Janhvi Kapoor : బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోషూట్ పిక్స్ ను పోస్ట్ చేసి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. తనదైన ఫ్యాషన్ సెన్స్ ను ప్రదర్శించడంలో డిగ్రీ తీసుకున్న బ్యూటీ ఈ సారి చీర కట్టుతో చంపేస్తోంది . తెలుపు, బంగారు వర్ణంలో ఉన్న కేరళ సంప్రదాయ చీరకు స్టైలిష్ బ్లౌజ్ ధరించింది అప్సరసలా తెలుక్కుమంది. ఈ పోస్ట్‌కి సోషల్ మీడియాలో ఆమె అభిమానులు, అనుచరుల నుండి అనేక లైక్‌లు, కామెంట్స్ వచ్చాయి. జాన్వీ కపూర్ రమర్డ్ ప్రియుడు శిఖర్ పహారియా కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు.

శనివారం, జాన్వీ కపూర్ తన తాజా ఫోటోషూట్ నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో పావురం ఎమోటికాన్‌తో చిత్రాలను పంచుకుంది . కేరళ చీర కట్టుకున్న జాన్వీ కొలనులో దిగి తడిసిముద్దయింది. ఈ చీరలో నీటిలో నిలబడి కెమెరాకు హాట్ పోజులు ఇచ్చింది బ్యూటీ . ఆమె కనీస ఉపకరణాలు, బోల్డ్ ఐ మేకప్‌తో తన లుక్ ను క్రేజీ గా తీర్చిదిద్దింది. సెలబ్రిటీ స్టైలిస్ట్ మనీషా మెల్వానీ, మేకప్ ఆర్టిస్ట్ సావ్లీన్ కౌర్ మంచాంద వైరల్ చిత్రాల కోసం జాన్వీని గ్లామ్ చేసారు.

జాన్వీ ఫోటోలకు అనేక లైక్స్, కామెంట్స్ వచ్చాయి. ఆమె రమర్డ్ ప్రియుడు శిఖర్ పహారియా హార్ట్ ఎమోటికాన్‌లను వదులుతూ పిక్స్ కు స్పందించారు. షానాయ కపూర్ “వావ్…” అని రాసింది, ఓర్హాన్ అవత్రమణి, “వాహ్ జాన్వీ జీ” అని వ్యాఖ్యానించాడు. మరికొంత మంది వినియోగదారులు హార్ట్ అండ్ ఫైర్ ఎమోజిలను వదిలారు.

జాన్వీ కపూర్ చీర విశాలమైన బంగారు అంచులతో అలంకరించబడిన తెల్లటి రంగులో వస్తుంది. స్టార్ సంప్రదాయబద్ధంగా ఆరు గజాల చీరను కట్టుకుంది. వీ నెక్‌లైన్‌తో , ఉబ్బిన సగం-పొడవు స్లీవ్స్ కలిగిన చీరకు సరిపోయే తెల్లని బంగారు జాకెట్టు ధరించి తడిసిన అందాలతో కుర్రాళ్లను తన్మయంలో ముంచింది.
