Janhvi Kapoor : 2022లో విడుదలైన రెండు సినిమాలు గుడ్‌లక్ జెర్రీ, మిలి విజయాలతో మంచి ఊపు మీద ఉంది బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. తనదైన నటనతో గ్లామర్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ చిన్నది. సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉండే ఈ చిన్నది ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ను అలరించేందుకు హాట్ ఫోటో షూట్లు, పర్సనల్ విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది నెట్టింట్లో తాను ఎదుర్కొనే విమర్శల గురించి పెదవి విప్పింది. ఓ ఇంటర్వ్యూలో నటి జాన్వీ కపూర్ గుర్తుతెలియని వారు తనను నెపో బేబీ అని పిలవడం పట్ల తీవ్ర అసంతృప్తిని, బాధను వెల్లడించింది.

జాన్వీ కపూర్ దివంగత సీనియర్ నటి శ్రీదేవి , బాలీవుడ్ సినీ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె. అలాగే, ఆమె అర్జున్ కపూర్ సోదరి. ఇంత మంచి సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో నెట్టింట్లో ఈ బ్యూటీని అనేకరకాలుగా అన్నోన్ వ్యక్తులు విమర్శిస్తుంటారు. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న కొన్ని విమర్షల గురించి ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నాకు నా బాలాలు, నా బలహీనతలు బాగా తెలుసు. నేను మంచి పనులు చేసినా, చేయకపోయినా దాని నుంచి నేను ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని అయితే మాత్రం తప్పక నేర్చుకోవాలనుకుంటాను. అహంకారాన్ని నేను ఎప్పుడూ చూపించను. నేను నటించిన గత రెండు చిత్రాల సక్సెస్ ద్వారా, నేను కొంత పురోగతిని సాధించానని నాకు కచ్చితంగా అనిపిస్తుంది. నేను నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకున్నానని చెప్పుకొచ్చింది.

ఇదే విషయాన్ని కొనసాగిస్తూ జాన్వీ కపూర్ తన మనోవేధనను చెప్పుకొచ్చింది. మీకు తెలుసా, చెమట. రక్తాన్ని చిందిస్తూ కష్టపడి పని చేస్తున్నప్పుడు, మీరు చేసే విమర్శలు మానసిక క్షోభకు గురిచేస్తాయని చెప్పుకొచ్చింది. నటన రానప్పుడు ఎందుకు చేస్తావు నెపోటిజం కి బచ్చి అని నెట్టింట్లో విమర్శలు చేసేవారి గురించి ఈ విధంగా స్పందించింది జాన్వీ.

ఎవరైనా తన పనిని మెచ్చుకున్నప్పుడు , ఆమె తన పనితీరును ఎలా మెరుగుపరుచుకోవాలో సూచించినప్పుడు తాను వారిని గౌరవిస్తానని చెప్పింది. మరోవైపు, మిలీలో మీరు బాగా నటించారు, కానీ మీరు మరొక చిత్రంలో మీ నటనను మెరుగుపరుచుకోవచ్చు అని ఎవరైనా చెబితే, నేను దానిని గౌరవిస్తాను అని తెలిపింది. జాన్వీ కపూర్ నటించిన గుడ్‌లక్ జెర్రీ , మిలీ చిత్రాలు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందాయి. రెండు సినిమాల్లోనూ ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. జాన్వీ 2018లో ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ధడక్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ తదుపరి చిత్రం గురించిన అప్డేట్స్ ఇప్పటి వరకు అయితే ఏమీ రాలేదనే చెప్పాలి.
