Janhvi Kapoor : అతిలోక సుందరి, లెజెండరీ నటి శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్… అంత క్రేజ్‌ను అయితే సంపాదించుకోలేకపోతోంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇలా వచ్చి అలా క్లిక్ అయిపోతున్నారు ముద్దుగుమ్మలు. కానీ ఈ అమ్మడికి బ్యాక్‌గ్రౌండ్ ఫుల్ స్ట్రాంగ్. తండ్రి బోనీ కపూర్ పెద్ద నిర్మాత. ఇక తల్లి గురించి చెప్పనక్కర్లేదు. మరణించినా కూడా శ్రీదేవి ఇప్పటికీ జనం గుండెల్లోనే ఉన్నారు. మరి అలాంటపుడు వీరి ముద్దుల తనయ ఎలా ఉండాలి? కానీ ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయిందనే చెప్పాలి. అయితే అమ్మడికి అవకాశాలకేమీ కొదవ లేదులెండి. ప్రస్తుతం జాన్వీ పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది.
Janvi Kapoor : జూహులోని ఓ అపార్టుమెంట్‌లో..
ఆమె కెరీర్ విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. జాన్వీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా జాన్వీ తన లగ్జరీ ఇల్లును అమ్మేసిందంటూ బాలీవుడ్ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. జూహులోని ఓ అపార్టుమెంట్‌లో జాన్వీకి ఒక ఫ్లాట్ ఉంది. అది చాలా లగ్జరీగా ఉంటుందట. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ప్లాట్‌ను ఓ స్టార్ నటుడికి అమ్మినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇల్లు అమ్మితే వార్తా? అనుకోకండి. అమ్మితే పెద్ద విషయం ఏమీ కాదు కానీ.. దాన్ని అమ్మిన ధర మాత్రం షాక్‌కు గురి చేసేదే.
జూహు-విల్లె పార్లీ అనే అపార్ట్‌మెంట్‌లో గల 14, 15, 16 అంతస్థుల్లో నిర్మించిన ఈ లగ్జరీ ప్లాట్‌ను జాన్వీ 2020లో రూ.35 కోట్లకు కొనుగొలు చేసిందట. 3456 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈ ఇంటిని ప్రముఖ నటుడు రాజ్ కుమార్ రావు రూ. 45 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవలే రాజ్‌కుమార్ రావుకు తన ప్రియురాలు, సహానటి పత్రలేఖతో వివాహమైంది. పెళ్లి తర్వాత వీరిద్దరు ఉండేందుకు ఇంటి కోసం వెతుకుతుండగా జాన్వీ తన ఫ్లాట్ అమ్ముతున్న విషయాన్ని తెలుసుకుని ఆమెను రాజ్‌కుమార్ సంప్రదించారు. దీంతో తన ఫ్లాట్‌ను ఆయనకు జాన్వీ అమ్మేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కేవలం ఈ ఫ్లాట్ల పార్కింగ్ స్పేస్ కోసమే రాజ్‌కుమార్ రావు మరో రూ. 2.19 కోట్లను ఖర్చు చేసినట్టు సమాచారం.