టాలీవుడ్ లో జూనియర్ ఎన్ఠీఆర్ మంచి నటుడు అనే సంగతి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి తనదైన నటనతో ఆ క్యారెక్టర్ కి మంచి గుర్తింపు తీసుకొస్తాడు. ఈ విషయంలో ఎన్ఠీఆర్ ని ఎవరూ తీసిపారేయలేరు. ఇక తన లుక్స్ కూడా సినిమాల కోసం పూర్తిగా మార్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే ఎన్ఠీఆర్ అని చెప్పాలి. తాజాగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్ఠీఆర్ నటనకి అందరూ ఫిదా అయిపోయారు. మెగా హీరో రామ్ చరణ్, ఎన్ఠీఆర్ పోటీపడే మరి నటించారు. అయితే కథ మెజారిటీ అంతా రామ్ చరణ్ క్యారెక్టర్ బేస్ మీద నడిచిన తారక్ మాత్రం తనకున్న పరిధిలోనే అద్భుతమైన నటనతో సినిమాలో తాను చేసిన భీమ్ పాత్రకి బాగా గుర్తింపు వచ్చేలా చేశాడు.
ఈ సినిమా చూసిన తర్వాత హాలీవుడ్ మేకర్స్ సైతం రామ్ చరణ్, తారక్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు అంటే ఏ స్థాయిలో సినిమాని వారిద్దరూ నిలబెట్టారు అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇదలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్ఠీఆర్ పాత్ర గురించి హాట్ టాపిక్ నడుస్తుంది. ప్రముఖ మూవీ పబ్లికేషన్ వెరైటీ 2023 ఆస్కార్ అవార్డులలో ఉండబోయేది ఎవరు ప్రిడిక్షన్ చేసింది. ఇందులో బెస్ట్ యాక్టర్ గా ఆర్ఆర్ఆర్ మూవీకి గాను ఎన్టీఆర్ కి వచ్చే అవకాశం ఉందని రాసుకొచ్చింది. ఈ న్యూస్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తారక్ ఫ్యాన్స్ దానిని మరింతగా షేర్ చేస్తూ తమ హీరో స్టామినా ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఒక వేళ ఈ ప్రిడిక్షన్ ప్రకారం నిజంగానే ఆస్కార్ అవార్డులలో ఎన్ఠీఆర్ బెస్ట్ యాక్టర్ గా ఎంపిక అయితే మాత్రం అది సంచలనమే అవుతుంది. ఎందుకంటే ఇండియాలోనే ఇప్పటి వరకు ఉత్తమ నటుడు కేటగిరీలో ఆస్కార్ అవార్డుని తీసుకోలేదు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఈ సారి ఆస్కార్ అవార్డుల జాబితాలో చోటు దక్కించుకోవడం పక్కా అనే మాట హాలీవుడ్ టెక్నీషియన్స్ నుంచి కూడా వినిపిస్తుంది. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది వేచి చూడాలి.