K Vishwanath : ప్రముఖ తెలుగు సినిమా ఆణిముత్యం దర్శకులు కె విశ్వనాథ్ గారి మరణం యావత్ సినిమాలోకాన్ని కలచివేసతోంది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో, కళాతపస్వి శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వర్ణకమలం, స్వయంకృషి వంటి అనేక క్లాసిక్ చిత్రాలను వెండితెరపైన చూపించి ప్రేక్షకుల హృదయాల్లో ఆయనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా లెజెండరీ నటులు మరణిస్తుండటంతో చిత్రపరిశ్రమ తీవ్ర శోఖసంద్రంలో మునిగిపోయింది. విశ్వనాథ్ గారి మరణ వార్త చిరంజీవి ,కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్లను దిగ్భ్రాంతికి గురి చేసింది. విశ్వనాథ్ గారితో సినిమాలకు మించిన గొప్ప బంధాన్ని పంచుకున్నారు వీరు . సోషల్ మీడియాలో ఆయనను స్మరిస్తూ, వారు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్‌లో పేపర్‌లో వచ్చిన విశ్వనాథ్ గారి వార్తా కథలాను పంచుకున్నారు. ఇది చాలా విచారకరమైన రోజు అని ఆయన తన సంతాపాన్ని తెలిపారు. తండ్రిలాంటి కె విశ్వనాథ్‌గారి మరణ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆయన గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు చాలవుని చెప్పారు. పండితులను, సామాన్య ప్రజలను కూడా ఆకట్టుకునే అతని చిత్ర నిర్మాణ శైలి ప్రత్యేకమైనది అని ఆయన కొనియాడారు. సున్నిత కళాత్మక చిత్రాలను కూడా బ్లాక్‌బస్టర్స్‌గా మార్చిన దర్శకుడు బహుశా ఆయనలా మరొకరు లేరేమో అని అన్నారు. తన సినిమాల ద్వారా తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప దర్శకుడు విశ్వనాథ్ గారు అని పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు అనే మూడు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింనందుకు నేను అదృష్టవంతుడిని అని అన్నారు.
సినిమాలకు అతీతంగా వ్యక్తిగతంగా ఆయనతో నాకు గురు శిష్య సంబంధం ఉందిని విశ్వనాథ్ గారితో తనకున్న అనుబంధాన్ని పేర్కొన్నారు. పైగా అది తండ్రీకొడుకుల మధ్య బంధం లాంటిది అని అన్నారు. ఆయనతో గడిపిన ప్రతి క్షణం నాకు అత్యంత విలువైనది అని అన్నారు. ఆయనతో పనిచేయడం ఏ నటుడికైనా విద్య లాంటిదన్నారు. ఆయన సినిమాలు భావి దర్శకులకు మార్గదర్శకం లాంటివి అన్నారు.
ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు, ఆయన సినిమాల్లోని సంగీతం, ఆయన కీర్తి ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని తన ఆవేదనను వ్యక్తం చేశారు చిరంజీవి.