పశ్చిమ బెంగాల్‌లోని భీర్భూమ్‌కి చెందిన భూబన్ బాద్యకార్ (Bhuban Badyakar).. ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఆయన పాడిన కచ్చా బాదామ్ సాంగ్ ఇండియాతోపాటూ విదేశాల్లోనూ కంటిన్యూగా వైరల్ అవుతూ వస్తుంది. మొన్నటిదాకా గ్రామాల్లో బైక్‌పై తిరుగుతూ… పల్లీలు అమ్ముకునే భూబన్ … తన “బాదామ్ బాదామ్ కచ్చా బాదామ్” పాటతో వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ఇక ఈ శనక్కాయల వ్యాపారం చేసేది లేదన్న భూబన్… ప్రత్యేక కార్యక్రమాలు, వేడుకల్లో తన పాటను పాడుతూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఐతే… సడెన్‌గా రోడ్డు ప్రమాదం ఆయన్ని ఆస్పత్రిపాలు అయ్యేలా చేసింది.
ఫిబ్రవరి 28 సోమవారం రోడ్ ప్రమాదం జరిగింది. ఈమధ్యే సెకండ్ హ్యాండ్ కారును కొన్న భూబన్… డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. కార్ డ్రైవింగ్ లో తేడా రావడంతో ప్రమాదం జరిగి భూబన్ రొమ్ముకి దెబ్బ తగిలి లోపల నొప్పి వచ్చింది. దాంతో ఆయన్ని వెంటనే సూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చేర్చారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిసింది.
ఒక్క పాటతో స్టార్ డమ్ తెచ్చుకున్న భూబన్ బాద్యకార్ని ఈమధ్యే బెంగాల్ పోలీసులు సత్కరించారు. అలాగే ఆయన అఫీషియల్‌గా పాడిన పాటకు గోధులిబెళ మ్యూజిక్ కంపెనీ ముందుగానే కుదుర్చుకున్న డీల్ ప్రకారం రూ.3 లక్షల రూపాయలు ఇచ్చింది. ఈ రీమిక్స్ వెర్షన్ ను 2021 డిసెంబర్ 26న యూట్యూబ్ లోని Godhuli Bela Music ఛానెల్ లో రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ వీడియో కి 9 కోట్ల వ్యూస్ వచ్చాయి. 28 లక్షల మందికి పైగా లైక్ లు చేశారు