Kantara Movie: కన్నడ ఇండస్ట్రీలో 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా కాంతారా. ఈ సినిమా కనడంలో బ్లాక్ బస్టర్ ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ ని తెలుగు తమిళ హిందీ మలయాళీ భాషలలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇక రిలీజ్ అయిన అన్ని భాషలలో కూడా కాంతారా సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. తెలుగులో ఈ సినిమా ఏకంగా 60 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం. ఇక హిందీలో కూడా 50 కోట్లకు పైగానే ఈ మూవీ కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది. ఓవరాల్ గా కాంతారా సినిమా 300 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాలి.

ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేకుండానే కేవలం కథ బలంతోనే ఈ మూవీ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించింది. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే అద్భుతమని చెప్పాలి. సినిమా ఆరంభం క్లైమాక్స్ కాంతారా మూవీ సక్సెస్ లో కీలక భాగంగా మారాయి. సామాన్య ప్రేక్షకుల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు కాంతారా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సెలబ్రిటీల ప్రశంసలతో మరింత మంది ప్రేక్షకులు ఈ సినిమా చూడడానికి ఆసక్తి చూపించడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పుడు కాంతారా ఫ్రీక్వెల్ కి దర్శకుడు హీరో రిషబ్ శెట్టి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ కూడా ఇచ్చారు. హొంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తోనే నిర్మించబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా రిషబ్ శెట్టి ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్స్ ఇచ్చారు. ఈ మూవీ 2024లో ప్రేక్షకుల ముందుకి వస్తుందని తెలియజేశారు. ఇక ఈ ఫ్రీక్వెల్ మొదటి భాగం ఎక్కడ స్టార్ట్ అయిందో దానికి ముందు జరిగే కథని చూపించబోతున్నట్లుగా తెలియజేశారు. అలాగే కాంతారా 2లో పంజర్ల సంస్కృతిని కూడా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన వర్క్ స్టార్ట్ అయింది అని కూడా క్లారిటీ ఇచ్చారు